ఇక ఎక్కడి నుంచైనా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
*📚✍️ఇక ఎక్కడి నుంచైనా*
 *డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్✍️📚*
*♦️పెన్షనర్లకు ఈపీఎఫ్ వో కొత్త సౌకర్యం*
*🌻ఢిల్లీ:* వృద్ధాప్య సమస్యలతో 
బాధపడుతూ పీఫ్ ఆఫీస్ కు వచ్చి లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించలేని పెన్షనర్లకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్) కొత్త వెసులుబాటు కల్పించింది. ఇకపై ఎక్కడి నుంచైనా సరే ఫేస్ రికగ్నిషన్ అథెంటికేషన్ సాయంతో డిజిటల్ రూపంలో లైఫ్ సర్టిఫికెట్ను పంపేందుకు అనుమతినిస్తూ ఈపీఎఫ్వీ నిర్ణాయక మండలి నిర్ణయం తీసుకుంది. దీంతో 73 లక్షల మంది పెన్షనర్లలో ఇల్లు విడిచి బయటకు రాలేని వృ దులకు లబ్ధి చేకూరనుంది. పెన్షనర్ల కోసం కొత్తగా ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్ యాదవ్ ప్రారం భించారు. దీంతోపాటు పెన్షన్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకానికి సంబం ధించిన కాలిక్యులేటర్ను అందుబాటులోకి తెచ్చారు. స్కీమ్ ప్రయోజనాలను పెన్షనర్, కుటుంబ సభ్యులు ఈ కాలిక్యులేటర్ ద్వారా తెల్సుకోవచ్చు. మరోవైపు, ఈపీఎఫ్ వో సెక్యూరిటీస్కు కస్టోడియన్ సిటీ బ్యాంక్ను ఎంపిక చేస్తూ పీఎఫ్ నిర్ణాయక మండలి సీబీటీ నిర్ణయం తీసుకుంది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

error: Content is protected !!