AP TEACHERS orientation on Teacher Training Need Analysis Form.. KEY POINTS
Sri Pratap Reddy:
Director SCERT
®️ 100% అకాడమిక్ క్యాలండర్ ను ఫాలో అవ్వాలి.
డిజిటల్ బోధన (బైజుస్ తో ఒప్పందం నేపథ్యంలో) తో ఉపాధ్యాయ పోస్టులు కుదించేస్తారన్న ప్రచారం తప్పు. తరగతి గదిలో ఉపాధ్యాయుడికి సాటి ఏదీ లేదు.
ఉపాధ్యాయులందరూ వార్షిక ప్రణాళిక, నెలవారి ప్రణాళిక, వారం వారి ప్రణాళిక, పాఠ్యప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. వీటిని మార్కెట్లో దొరికే రెడీమేడ్ వాటినీ ఉపయోగించి కాపీ, పేస్ట్ చేయవద్దు. మీ ఆలోచనలకు తగిన విధంగా మీ తరగతి గది పరిస్థితులను బట్టి సొంతంగా తయారు చేయాలి.
గతంలో ఉపాధ్యాయులకు చాలా శిక్షణ కార్యక్రమాలు ఇచ్చాము వాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఆ పరిస్థితులు రాకూడదని ఇప్పుడు కాంప్లెక్స్ లెవెల్ లో మీకు ఎలాంటి శిక్షణ కావాలో తెలుసుకోవడం కోసమే ఈ కార్యక్రమం. ఆ అవసరాలు పూర్తి చేయడానికి సాల్ట్ కార్యక్రమం ఉద్దేశించబడింది.
®️ *పరిస్థితులు మారాయి, మీరూ మారాలి*
సి.ఎస్.ఈ. సురేష్ కుమార్…
®️ ఉపాధ్యాయులందరూ అత్యున్నత విద్యావంతులు. అయితే 20 – 30 సంవత్సరాల క్రిందట ఉన్న పరిస్థితులు నేడు లేవు. చాలా తెలివైనటువంటి విద్యార్థులను చూస్తున్నాం. వారికి తగినట్టుగా ఉపాధ్యాయులు కూడా నిత్య విద్యార్థి లాగా తయారు కావాల్సిందే. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సిందే. ఉపాధ్యాయుడు చెప్పే విషయాలపై మాత్రమే విద్యార్థులు ఆధారపడటం లేదు. పెరిగిన సాంకేతిక విజ్ఞానంతో వారు అనేక అంశాలపై సొంతంగా అవగాహన పొందుతున్నారు.
కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కంటే తెలివైన విద్యార్థులను చూస్తున్నాం. అకాడమిక్ క్యాలెండర్ లో సమగ్రంగా వివరాలు అందించడం జరిగింది. వాటిని తూచా తప్పకుండా పాటించాలి.
CSE_AP