*📚✍️పాఠశాలల విలీనంపై స్టే*
*ఇవ్వలేం: హైకోర్టు✍️📚*
*🌻అమరావతి, ఆంధ్రప్రభ:* పాఠశాలల విలీనం.. ఉపాధ్యాయుల హేతు బద్ధతపై ప్రభుత్వా జారీచేసిన జీ వోలపై స్టే ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇది పూర్తిగా ప్రభుత్వ విధాన నిర్ణయమని కొద్దిరోజులు అది అమలు చేయనిస్తే కానీ అందులో మంచి, చెడులు తెలియవని వ్యాఖ్యానించింది. స్టే ఇవ్వటం ద్వారా మొత్తం ప్రక్రియ నిలిచిపోతుందని అందువల్ల అందులో లోటుపాట్లు తెలియవని స్పష్టం చేసింది. పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధతపై జారీ అయిన జీవోలను సవాల్ చేస్తూ ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ డి రమేశ్ చంద్ర సింహగిరి పట్నాయక్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇదే అంశంపై గతంలో మరో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యాలు మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన డివిజన్ బెంచ్ ముందుకొచ్చాయి. ప్రభుత్వం తరుపున అడ్వొకేట్ జనరల్ ఎస్ శ్రీరాం వాదనలు వినిపించారు. పాఠశాలల విలీనం.. ఉపాధ్యాయుల హేతుబద్ధత అంశాలు పూర్తిగా ప్రభుత్వ పరిధిలోవని ఇప్పటికే అధిక శాతం అమల్లోకి వచ్చిందన్నారు. అమలు తీరుపై సమీక్ష జరపాల్సి ఉందన్నారు. ఈ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం అమలు తీరుపై స్పందించేందుకు నాలుగు వారాలకు విచారణ వాయిదా వేసింది. పిటిషనర్ల తరుపు న్యాయవాదులు రెండు వారాలకు వాయిదా వేయాలని కోరగా ఈ వ్యవహారంపై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 11వ తేదీకి వాయిదా వేసింది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇