BRAOU ADMISSIONS 2022-23 LAST DATE WAS EXTENDED

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

BRAOU ADMISSIONS 2022-23 LAST DATE WAS EXTENDED 

BRAOU: అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశాల దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు

బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశ దరఖాస్తు గడువు మరోసారి పొడిగించారు. అయితే అభ్యర్థులు అభ్యర్థన మేరకు ప్రవేశ దరఖాస్తు గడువును పొడిగించినట్లు తెలుస్తోంది.

అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబరు 30 వరకు ప్రవేశాల దరఖాస్తుకు అవకాశం కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే రెండుసార్లు దరఖాస్తు గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే అభ్యర్థులు అభ్యర్థన మేరకు ప్రవేశ దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు.

అయితే రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతానికి సెప్టెంబరు 30 వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు. మరిన్ని వివరాలకు 7382929570/580/590/600, 040-23680290/ 291/294/295 నంబర్లలో సంప్రదించవచ్చు.

కోర్సుల వివరాలు..

 

1) డిగ్రీ కోర్సులు: బీఏ, బీకామ్, బీఎస్సీ.

2) పీజీ కోర్సులు: ఎంఏ (జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఇంగ్లిష్, తెలుగు, హిందీ, ఉర్దూ),  ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్/అప్లైడ్ మ్యాథమెటిక్స్, సైకాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫిజిక్స్, జువాలజీ), ఎంకామ్, ఎంబీఏ, ఎంఎల్ఐఎస్సీ, బీఎల్‌ఐఎస్సీ.

3) పీజీ డిప్లొమా కోర్సులు: ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, రైటింగ్ ఇన్ మాస్ మీడియా (తెలుగు), హ్యూమన్ రైట్స్, కల్చర్ అండ్ హెరిటేజ్ టూరిజం, ఉమెన్స్ స్టడీస్.

4) సర్టిఫికేట్ కోర్సులు: ఫుడ్ అండ్ న్యూట్రీషన్, లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్, ఎన్జీవోస్ మేనేజ్‌మెంట్, ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్.

అర్హతలు: 

* డిగ్రీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. నేషనల్ ఓపెన్ స్కూల్ నుంచి ఇంటర్ చదివినా అర్హులే. 

* పీజీ కోర్సులకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. ఎంకామ్ కోర్సుకు మాత్రం బీబీఏ, బీబీఎం, బీఏ(కామర్స్) ఉండాలి. సైన్స్ సబ్జెక్టులకు కూడా సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

* పీజీడిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులకు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉండాలి.


ముఖ్యమైన తేదీలు..

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.06.2022

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.09.2022.

డిగ్రీ కోర్సుల్లో ప్రవేశ సమాచారం కోసం క్లిక్ చేయండి..

పీజీ కోర్సుల్లో ప్రవేశ సమాచారం కోసం క్లిక్ చేయండి..

పీజీ రెండో సంవత్సరం ప్రవేశ సమాచారం కోసం క్లిక్ చేయండి..

 

Admission Notification

Website

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!