UPSC : Engineering Services (Preliminary) Examination, 2023
UPSC ESE Notification: ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ – 2023 నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా!
ఈ పరీక్ష ద్వారా రైల్వే సర్వీసెస్, రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, టెలికామ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
న్యూఢిల్లీ ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, టెలికామ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలకు నియామకాలు చేపడతారు. పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 14న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ – 2023
పోస్టుల సంఖ్య: 327 (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్).
సంస్థలు: ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీసెస్, సర్వే ఆఫ్ ఇండియా, బోర్డర్ రోడ్ ఇంజినీరింగ్ సర్వీసెస్, ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్, ఎంఈఎస్ సర్వేయర్ క్యాడర్, నావెల్ అర్మామెంట్ సర్వీసెస్, జూనియర్ టెలికమ్ ఆఫీసర్ (టెలికమ్ సర్వీసెస్).
విద్యార్హతలు: సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్ డిగ్రీ/ రేడియో రెగ్యులేటరీ సర్వీసెస్‌లో పోస్టులకు ఫిజిక్స్ లేదా రేడియో ఫిజిక్స్/ వైర్‌లెస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.01.2023 నాటికి నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్‌కు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: యూపీఎస్సీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు ఫీజు కింద రూ.200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం..
➦ రాతపరీక్ష, ఇంటర్వ్యూ/పర్సనల్ టెస్ట్, మెడికల్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
➦ పరీక్షను రెండు దశల్లో నిర్వహిస్తారు. ప్రిలిమినరీ (స్టేజ్-1), మెయిన్స్ (స్టేజ్-2).
➦ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినవారిని మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు.
➦ మెయిన్స్ వచ్చిన మార్కులను ఆధారంగా స్టేజ్-3 పర్సనాలిటి టెస్ట్(ఇంటర్వ్యూ) నిర్వహిస్తారు.
పరీక్ష ఇలా…
➦ ప్రిలిమినరీ పరీక్ష: మొత్తం 500 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. వీటిలో 200 మార్కులకు పేపర్-1 (జనరల్ స్టడీస్ అండ్ ఇంజినీరింగ్ ఆప్టిట్యూడ్), 300 మార్కులకు పేపర్-2 (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్) పరీక్ష నిర్వహిస్తారు. పేపర్-1 పరీక్షకు 2 గంటలు, పేపర్-1 పరీక్షకు 3 గంటల సమయం కేటాయిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి.
➦ మెయిన్ పరీక్ష: మొత్తం 600 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. వీటిలో 300 మార్కులకు పేపర్-1 (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్), 300 మార్కులకు పేపర్-2 (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్) పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు 3 గంటల చొప్పున సమయం కేటాయిస్తారు. కన్వెన్షల్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నంలో పరీక్ష నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➦ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 14.09.2022
➦ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: 04.10.2022 (6 PM)
➦ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 19.02.2023.