TODAY EDUCATION/TEACHERS TOP NEWS 07/10/2022

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

కడపలో 471 టీచర్ పోస్టుల అప్గ్రేడ్

 అమరావతి  : కడప జిల్లాలో 471 ఎస్జీటీ , పీఈటీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా అప్గ్రేడ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది . మరో 104 సబ్జెక్టు టీచర్ పోస్టులను ఇతర సబ్జెక్టులకు మార్చుతూ నిర్ణయం తీసుకుంది . ఒక ప్రీ హైస్కూల్ను ఉన్నత పాఠశాలగా అప్ గ్రేడ్ చేసింది . కన్వెన్షన్ చేసిన సబ్జెక్టు టీచర్ పోస్టుల్లో ఎక్కువగా ఇంగ్లిష్ సబ్జెక్టులోకి మార్చారు . కన్వెన్షన్ , అప్డేడేషన్పై ఇప్పటికే గత నెలలో మార్గదర్శకాలు జారీచేయగా , తదనుగుణంగా ఇప్పుడు చర్యలు చేపట్టింది .

🪸🪷🪸🪷🪸🪷


ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు అర్హుల జాబితా


*🌻నూజివీడు టౌన్‌, అక్టోబరు 6:* ఏలూరు జిల్లా నూజివీడులోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ పరిధిలో గల ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు ప్రత్యేక కేటగిరీ సీట్ల భర్తీకి సెలక్షన్‌ లిస్ట్‌ను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంచినట్టు ఆర్జీయూకేటీ అడ్మిషన్స్‌ కన్వీనర్‌ గోపాలరాజు తెలిపారు. పీహెచ్‌, క్యాప్‌ తదితర విభాగాల్లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేసుకున్న అభ్యర్థుల కాల్‌లెటర్లు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంచామని, వ్యక్తిగతంగా సెల్‌ఫోన్లకు సమాచారం  పంపామని పేర్కొన్నారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇



డీఎస్సీ 1998 ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం

*🌻మచిలీపట్నం కార్పొరే షన్, న్యూస్టుడే*: డీఎస్సీ 1998 అభ్యర్థుల్లో నిర్దేశించిన వేతనంతో ఉపాధ్యాయులుగా పనిచేసేందుకు తమ ధ్రువపత్రాలను వెబ్సైట్లో అప్లోడ్ చేసిన వారి ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. అభ్యర్థులతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా తరలిరావడంతో కార్యాలయ ప్రాంగణం సందడిగా కనిపించింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 502 మంది ఉండగా వారి జాబితా కూడా వెబ్సైట్లో పొందుపరిచినట్లు డీఈవో తాహెరా సుల్తానా తెలిపారు. రోజుకు వందమంది చొప్పున పరిశీలించేందుకు ఏర్పాట్లు చేయ డంతోపాటు సిబ్బందిని కేటాయించినట్లు చెప్పారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇


ఎన్ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తులు

*🌻మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్టుడే*: జాతీయ ఉపకారవేతన పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో తాహెరా సుల్తానా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్, వసతిసౌకర్యం లేని ఆదర్శపాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్ష రాసేం దుకు అర్హులన్నారు. ఓసీ, బీసీలకు రూ.100లు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 50ల చొప్పున రుసుము చెల్లించి ఈనెల 31వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వెబ్ సైట్ లేదా డీఈవో కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

నేటి అర్ధరాత్రి నుంచి 2 రోజులు సీఎఫ్ఎంఎస్ షట్ డౌన్

*🌻ఈనాడు, అమరావతి:* రాష్ట్రంలో అనేక బిల్లుల చెల్లింపులకు కీలకమైన సీఎఫ్ఎంఎస్ వ్యవస్థను ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచి 9వ తేదీ అర్ధరాత్రి వరకు మూసివేస్తున్నారు. బిల్లుల ప్రాసెస్కు సంబంధించి ఖజానా శాఖ సంచాలకులు మోహన్రావు గురు వారం రాష్ట్రంలోని అందరు ఖజానా అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ‘కార్యాలయాల్లో పెండింగులో ఉన్న అన్ని బిల్లులను శుక్రవారం రాత్రి ఏడు గంటల లోపు పరిష్కరించాలి. అందరు డ్రాయింగ్ డిస్బర్సుమెంటు అధికారులు వారి లాగి న్లో ఉన్న బిల్లులను శుక్రవారం సాయంత్రం 5 గంట లలోగా పరిష్కరించడమో లేక రద్దు చేయడమో చేయాలి. అనుబంధ బిల్లులు, బకాయిలకు సంబంధిం చిన బిల్లులు ఈ నెల 11వ తేదీ నుంచి మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది…’ అని మోహనరావు చెప్పారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్లకు డీడీవో అధికారాలు


*🌻ఈనాడు, అమరావతి*: రాష్ట్రంలోని 163 ఆదర్శ పాఠ శాలల ప్రిన్సిపాళ్లకు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధి కారాలను (డీడీవో) బదలాయించేందుకు ట్రెజరీ డైరె క్టర్ గురువారం గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఈ ఉత్తర్వుల వల్ల జీతాలు, సెలవులు మంజూరు అధికారాలు ఇక నుంచి ప్రిన్సిపాళ్లకు ఉంటాయి.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

అన్ని కోర్సుల్లో సైబర్ సెక్యూరిటీ పాఠాలు: యూజీసీ

*🌻ఈనాడు, దిల్లీ*: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలు నిర్వహించే అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో సైబర్ సెక్యూరిటీని పాఠ్యాంశంగా చేర్చాలని యూజీసీ చైర్మన్ ఎం. జగదీశ్ కుమార్ సూచించారు. ‘సైబర్ సెక్యూరిటీ దివస్’ సందర్భంగా గురువారం సాయంత్రం నిర్వ హించిన వెబ్కాస్ట్లో ఆయన మాట్లాడారు. ఈ పాఠ్యాంశాల బోధన కోసం అన్ని విద్యాసంస్థలు సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్, ఐటీ నిపుణులను నియమించుకోవాలన్నారు. ఏ అంశాలను పాఠ్యాం శాలుగా చేర్చాలో సూచిస్తూ ఒక కరపుస్తకాన్ని కూడా ఆయన విడుదల చేశారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

పీఎఫ్ చందాదార్లెవరూ వడ్డీ కోల్పోలేదు


*♦️సాఫ్ట్వేర్ అప్గ్రేడింగ్తో జమ ఆలస్యం: ఆర్థిక శాఖ*

*🌻దిల్లీ*: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ ఓ) చందాదార్లకు వడ్డీ పరంగా ఎటువంటి నష్టం జరగలేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. సాఫ్ట్వేర్ అప్ గ్రేడింగ్ ప్రక్రియ వల్లే గత ఆర్థిక సంవత్సరానికి సంబం దించిన వడ్డీ జమ ఆలస్యమైందని పేర్కొంది. సెటిల్మెంట్, పీఎఫ్ ఉప సంహరణకు దరఖాస్తు చేసుకున్న వారికి వడ్డీతో కలిపే చెల్లింపులు చేస్తున్నట్లు పేర్కొంది. ‘చందాదార్లు ఎవరికీ వడ్డీ నష్టం జరగలేదు. అందరి ఖాతాల్లో వడ్డీ జమ అయింది. పన్ను విధానంలో వచ్చిన మార్పుల కారణంగా సాఫ్ట్వేర్ అప్ గ్రేడింగ్ ప్రక్రియ చేపట్టడంతో.. వడ్డీ జమ అయి నట్లు స్టేట్మెంట్లో కనిపించలేదు” అని మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఈపీఎఫ్ వడ్డీ జమ విషయంలో టి. వి. మోహన్దాస్ పాయ్ లేవనెత్తిన సందేహాలకు స్పందిస్తూ ఆర్థిక శాఖ ఈ స్పష్టత ఇచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.1 శాతం వడ్డీ రేటును చెల్లించేం దుకు ఈ ఏడాది జూన్లో ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. వార్షికంగా పీఎఫ్ జమ రూ.2.5 లక్షలకు మించితే పన్ను విధించడాన్ని 2021-22 నుంచే ప్రభుత్వం ప్రారంభించింది.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

ఏపీ సార్వత్రిక పది,ఇంటర్ ప్రవేశాలకు 15 వరకు ప్రవేశాలకు గడువు


*🌻పెడన గ్రామీణం, న్యూస్టుడే:* కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో సార్వత్రిక పది,ఇంటర్ ప్రవేశాలకు ఈనెల 15 వరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా గడువు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా తెలిపారు. సార్వత్రిక పది, ఇంటర్ ప్రయివేటు కేంద్రాల ద్వారా ఈ ఏడాది ప్రవేశాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రయివేటు కేంద్రాలు తమ అనుమతులను పునరుద్ధరించుకోవాలని తెలిపారు. ఈ ఏడాది పది, ఇంటర్ ఉత్తీర్ణత సాధిం చిన విద్యార్థులకు మార్కుల జాబితాల్ని డివిజన్ కేంద్రాలకు అందజేయను న్నట్లు వివరించారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

శాప్ లోనూ కారుణ్యనియామకాలకు అనుమతి


*🌻ఈనాడు-అమరావతి*: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో మొదటిసారి కారుణ్య నియామకాలకు అనుమతిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన నిబంధనలను సడలిస్తూ రాజపత్రం వెలువడింది. మిగతా ప్రభుత్వ శాఖల్లో మాదిరిగా శాప్లోనూ విధి నిర్వహణలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబసభ్యుల్లో అర్హులైన ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించే వెసులుబాటు కల్పించాలన్న ప్రతిపాదనలను ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి మూడో శుక్రవారం స.హ. దినం


*♦️ఆర్టీఐ చీఫ్ కమిషనర్ శ్రీనివాసరావు*

*🌻ఈనాడు, అమరావతి*: నెలలో ప్రతి మూడో శుక్రవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు దినం (ఆర్టీఐ డే) గా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని ఆర్టీఐ రాష్ట్ర చీఫ్ కమిషనర్ ఆర్. శ్రీని వాసరావు తెలిపారు. నెలలో వచ్చిన ఆర్టీఐ దరఖాస్తులు, ఫిర్యాదులను ఆ రోజున పరిష్కరించేలా క్షేత్రస్థాయిలో అధికారులు చర్యలు తీసుకోనున్నా రని ఆయన చెప్పారు. ఈనెల 5న ప్రారంభమైన ఆర్టీఐ వారోత్సవాల్లో భాగంగా గురువారం కమిషనర్లు కె. చెన్నారెడ్డి, కె.జనార్దనరావుతో కలిసి చీఫ్ కమిషనర్ శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. ‘ఆర్టీఐ ఫిర్యా దుల పరిష్కారం కోసం కమిషనర్లు తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్లేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశాం. కొన్ని ఫిర్యాదులపై విచారణ కోసం జిల్లా అధికారులు చీఫ్ కమిషనర్ కార్యాలయానికి ప్రత్యక్షంగా హాజ రవుతున్నారు. దీనివల్ల ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా కమిషనర్లే జిల్లాలకు వెళ్లాలని నిర్ణయించాం. ఈ విధానంతో జిల్లా స్థాయిలోనే చాలా ఫిర్యాదులు పరిష్కారమవుతాయి. సమాచార హక్కు చట్టంపై గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎంపిక చేసిన 25-30 గ్రామాల్లో ఈనెల 12లోగా న్యాయ కళాశాలల విద్యార్థులతో అవగాహన కల్పించ నున్నాం. 2019 మే నుంచి 2022 ఆగస్టు వరకు వచ్చిన 23,618 అప్పీళ్లు, ఫిర్యాదుల్లో 21,211 వరకు పరిష్కరించాం. కొత్తగా మరో ఇద్దరు కమిష నర్లు రాబోతున్నందున ఏ నెలలో వచ్చిన ఫిర్యాదులు, అప్పీళ్లు అదే నెలలో పరిష్కరించే విషయాన్ని పరిశీలిస్తున్నాం. ఆన్లైన్లోనూ ప్రజల నుంచి అప్పీళ్లు, ఫిర్యాదులు స్వీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆర్టీఐ విషయంలో సకాలంలో సమాచారం ఇవ్వకపోయినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా అలాంటి అధికారులపై చర్యలకు సిఫార్సు చేస్తున్నాం. 20 మంది అధికా రులపై జరిమానా కూడా విధించాం. మూడేళ్ల న్యాయ విద్యలో సమాచార హక్కు చట్టం ఒక సబ్జెక్ట్ గా చేర్చాలని గవర్నరికి ప్రతిపాదించాం’ అని చీఫ్ కమిషనర్ శ్రీనివాసరావు అన్నారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

స్పష్టతేదీ..?పదోన్నతుల ప్రక్రియపై ఉపాధ్యాయుల్లో ఆందోళన


*🌻మచిలీపట్నం కార్పొరేషన్,న్యూస్ టుడే:*

ఉపాధ్యాయుల పదోన్నతులకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయడంతో నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. . ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంతమంది ఉపా ధ్యాయులు పొందనున్నారో జాబితా సిద్ధం చేయడంతోపాటు షెడ్యూలు ప్రకారం ప్రక్రియ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంది. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పూర్తిస్థాయిలో స్పష్టత లేక పోవడంతోపాటు ఆన్లైన్లో పదోన్నతులు కల్పించడం తదితర అంశాలు ఉపాధ్యాయుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

*♦️181 మందికి పదోన్నతులు*

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో 12,064మంది ఉపా ధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో అత్యధికంగా 5,620. మంది ఎస్జీటీ(తెలుగు)లు, స్కూల్ అసిస్టెంట్లు (గణితం) 843, ఇంగ్లీషు 684, సోషల్ 807, తెలుగు 812, హిందీ 622 గ్రేడ్-2 హెచ్ఎం 319, పీడీలు 372 ఇలా వివిధ విభాగాల వారీగా ఉపాధ్యాయులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారిలో సబ్జెక్టుల వారీగా సీనియారిటీ జాబితా ప్రకారం పదోన్నతులు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. హెచ్ఎంలు 23, గణితం 13, పీఎస్ 06, పీడీ- 3, ఇంగ్లీషు సబ్జెక్టుల్లో 136 మంది చొప్పున మొత్తం 181 మందికి పదోన్నతులు కల్పించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖాధికారులు జాబితా సిద్ధం చేశారు. పాఠశాలల వారీగా సీనియారిటీ జాబితా ప్రదర్శించడంతోపాటు ఈనెల 7,8 తేదీల్లో ఆ జాబితాపై ఆన్లైన్ ద్వారానే అభ్యంతరాలు స్వీక రిస్తారు. 9న అభ్యంతరాల పరిశీలన ప్రక్రియ పూర్తిచేసి 10న తుది జాబితా ప్రద ర్శిస్తారు. 11న గ్రేడ్ హెచ్ఎంలకు, 12, 13న స్కూల్ అసిస్టెంట్తో పాటు సమాన కేటగిరీల వారికి పదోన్నతుల ఉత్తర్వులు జారీ చేస్తారు. ఇలా నిర్దేశించిన వాటికి అనుగు ణంగా ప్రక్రియ పూర్తి చేయడానికి విద్యా శాఖ కార్యాచరణ చేపట్టింది. పదోన్నతులు ఉత్తర్వులు వచ్చిన వెంటనే కేటాయించిన పోస్టుల్లో చేరాలా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. బదిలీల ప్రక్రియ నిర్వహించాల్సి ఉండటంతో ప్రస్తుతం పదోన్నతుల ఉత్తర్వులు ఇచ్చి బదిలీల సమయంలో నిర్దేశించిన పోస్టుల్లో చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఉత్తర్వుల్లోనూ ఆడ్ హాక్ ప్రమోషన్ ఆర్డర్లు జారీ చేస్తామని పొందుపరచడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తప్పుబడుతున్నాయి. ప్రస్తుతం పదోన్నతులు ఇచ్చినా బదిలీలు నిర్వహించే వరకు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న చోటే అదే హోదాలో ఉండాలి. అలాంట ప్పుడు అప్పుడే పదోన్నతులు నిర్వహించవచ్చుకదా అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ముందుగా ఖాళీలు ప్రదర్శించక పోవడం విమర్శలకు తావిస్తోంది. ఉపాధ్యాయుల్లో 50శాతం భార్యా భర్తలు ఇద్దరూ ఉపాధ్యాయులుగా పనిచే స్తున్న వారు ఉంటారు. ఆన్లైన్లో ఎక్కడో దూర ప్రాంతంలో పోస్టింగ్ కేటాయిస్తే అంతదూరం వెళ్లలేక పదోన్నతిని కూడా వదిలేసుకునే వారు ఉన్నారు. అలా కాకుండా ముందుగానే ఖాళీలు ప్రదర్శిస్తే వారికి అనుకూలమైన ప్రాంతాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఈవిషయంలో కూడా ఉపాధ్యాయలు సమస్యలను పట్టించుకోలేదని వాపోతున్నారు.

*♦️కాగితంపై పదోన్నతులా*

*▪️లెనిన్బాబు, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి*

 ప్రభుత్వం పదోన్నతులు కల్పించి ఎప్పుడో ఆ పోస్టులు కేటా యిస్తామనడం సమంజసం కాదు. కాగితంపై పదోన్నతులు కల్పించడాన్ని సంఘపరంగా వ్యతిరేకిస్తున్నాం. ఎంతమందికి పదోన్నతులు కల్పిస్తున్నారో వారందరికీ కేటాయించిన పోస్టులు వెంటనే కేటా యించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

*♦️నిబంధనలకు అనుగుణంగానే..:*

 *▪️తాహెరా సుల్తానా, జిల్లా విద్యాశాఖాధికారి*

నిబంధనలకు అనుగుణంగా పదోన్నతులు కల్పించేందుకు శాఖాపరంగా చర్యలు తీసుకుంటున్నాం. సీనియారిటీ జాబితా శుక్రవారం వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో ట్రెజరీకోడ్ సాయంతో ఆన్లైన్లోనే అప్పీలు చేయాలి. ఒక్కొక్కరికీ మూడు అప్పీల్కు మాత్రమే అవ కాశం ఉంది. నేరుగా అభ్యంతరాలు స్వీకరించరు. పదోన్నతులు పొందినవారికి పోస్టింగ్ కేటాయింపు, ఇతర అంశాలు కూడా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే జరుగు తాయి. ఈ విషయాలపై ఏవైనా ఆదేశాలు వస్తే వెంటనే ఉపాధ్యాయులకు తెలియజేస్తాం.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

ఓఎంఆర్ విధానంలో పరీక్షలు

*♦️ఒకటి నుంచి 8 తరగతుల వారికి..*

*♦️ఆ విధానంతో అభివృద్ధికి ఆటంకం*

*♦️యూటీఎఫ్ నేత, విద్యావేత్తల అభిప్రాయం*

*🌻పొదలకూరు, అక్టోబరు 6* : ఒకటి నుంచి 8వ తరగతుల విద్యార్థులకు నిర్మాణాత్మక మూల్యాంకన (ఎఫ్ఎ-1) పరీక్షలను ఓఎంఆర్ విధానంలో నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఇప్పటికే జరగాల్సిన పరీక్షలను దసరా సెలవుల అనంతరం నిర్వహించేలా వాయిదా వేసింది.

♦️ఓఎంఆర్‌ విధానం అనుసరిస్తే విద్యార్థుల్లో భావవ్యక్తీకరణ, రాత నైపుణ్యా ల అభివృద్ధికి ఆటంకం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా 1, 2, 3 తరగతుల్లో పఠనా శక్తిని అర్థం చేసుకోవడం కొంచెం కొంచెంగా ఉంటుంది. ఓఎంఆర్‌ విధానం పెద్ద తరగతుల్లో అనుసరిస్తే బాగుంటుందని యూటీఎఫ్‌ జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు అన్నారు. కొత్త విధానాన్ని అమలు చేసే ముందు పైలట్‌ ప్రాజెక్టుల్లో పరిశీలించి ఫలితాలను బట్టి నిర్ణయాలు చేపడితే మంచిదని పలువురు విద్యావేత్తలు అభిప్రాయ పడుతున్నారు. సీసీఈ విధానం అమలు ప్రారంభంలోనూ ఇదే విషయమై పైలెట్‌ ప్రాజెక్టుల్లో వ్యతిరేక ఫలితాలు రావడంతో మిన్నకున్నారని తెలిపారు. అభ్యసన దశలో కొత్త విధానం అమలుతో చిన్నారుల్లో విషయ అవగాహన, భావవ్యక్తీకరణకు అవకాశం లేకుండా పోతుందని కొందరి వాదన. పరీక్షలకు ఓఎంఆర్‌ పత్రాలు ఇస్తే చిన్న పిల్లల చేతుల్లో అవి పాడయ్యే అవకాశం ఉంది. ఈ పరీక్ష విధి విధానాలపై త్వరలో మార్గదర్శకాలు రానున్నాయి.

*♦️ఇప్పటి వరకు ఇలా..*

ఎఫ్‌ఏ పరీక్షలను 50 మార్కులకు నిర్వహించేవారు. వాటిలో అంతర్గత మార్కులుగా విద్యార్థుల అభ్యసన, సామర్థ్యాలకు పదేసి మార్కుల వంతున 30 మార్కులు, రాత పరీక్షకు 20 మార్కులు కేటాయించేవారు. తరగతి గది లో విద్యార్థుల అభ్యసనం, ప్రాజెక్టు పనులు, ప్రతిస్పందన, వైఖరులను బట్టి ఉపాధ్యాయులు అంతర్గత మార్కులను ఇచ్చేవారు. ఆ మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేసేవారు.

*♦️మూల్యాంకనం ఎలా ఉంటుందో..*

ఓఎంఆర్‌ పద్ధతిన జరిగే పరీక్షల మూల్యాంకనం ఏ విధంగా ఉంటు ందనేది తేలాల్సి ఉంది. ఓఎంఆర్‌ పత్రాలను ఎవరు దిద్దాలి.. స్కానింగ్‌ పద్ధతిని పాటిస్తారా..? విద్యార్థి అభ్యసనాన్ని అంచనా వేయడానికి కొత్త సూచనలు చేస్తారా అంటూ ఉపాధ్యాయుల్లో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో కొత్త విధానం అమలుపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.

*♦️20 మార్కులకు ప్రశ్నాపత్రం*

ఎఫ్‌ఏ-1 ప్రశ్నాపత్రం 20 మార్కులకు ఉంటుంది. అందులో 15 మార్కులకు బహుళైచ్ఛిక జవాబులు ఉంటాయి. సరైన జవాబును విద్యార్థులు ఓఎంఆర్‌ పత్రంపై గుర్తించాలి. అన్ని సబ్జెక్టులకు ఇదే ఓఎంఆర్‌ పత్రం వినియోగించాల్సి ఉంది. మిగిలిన 5 మార్కులకు రాతపూర్వక సమాధానాలు ఇవ్వాలి. ఇందుకు అదనంగా మరో జవాబు పత్రం ఇస్తారని సమాచారం

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

ఉపాధ్యాయులు  ఉద్యోగోన్న తుల ప్రక్రియ శుక్రవారం నుంచి మొదలు

ఎంతోకాలంగా ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న ఉద్యోగోన్నతుల ప్రక్రియ శుక్రవారం నుంచి మొదలవుతోంది . ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఆదే శాలు జారీ చేసింది .

 స్కూల్ అసిస్టెంట్లుగా చేస్తున్న వారికి గ్రేడ్ -2 ప్రధానోపాధ్యాయులు గానూ , సెకండరీ గ్రేడ్ వారికి స్కూల్ అసిస్టెంట్లుగానూ ఉద్యోగోన్నతులు లభించనున్నాయి .
ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే ఈ ప్రక్రియ కొనసాగు తుంది . వాస్తవానికి తొలుత రాష్ట్ర వ్యాప్తంగా రెండో ఎంఈవో పోస్టుకు ఉద్యోగోన్నతులు ఇస్తామని ప్రకటించి ప్రధా నోపాధ్యాయుల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ కూడా తీసుకున్నారు . ఈలోగా న్యాయప రంగా ఏర్పడుతున్న చిక్కుల వల్ల వాటిని తాత్కాలికంగా నిలిపేశారు . ఇప్పుడు ఈ ప్రక్రియ వల్ల పలు విలీన ఉన్నత పాఠశా లల్లో ఖాళీగా ఉన్న సబ్జెక్టు టీచర్ల కొరత చాలా వరకు తీరుతుంది . ఉద్యోగోన్నతి పొందిన ఉన్నత పాఠశాలలకు , ప్రధానోపా ధ్యాయుల ఖాళీలు నిండనున్నాయి . దానిని బట్టి జిల్లాలో ఎన్ని సెకండరీ గ్రేడు ఉపా ధ్యాయ పోస్టులు ఖాళీలున్నాయి . ఉపా ధ్యాయ , విద్యార్థి నిష్పత్తికి అనుగుణంగా ఎంతమంది ఉన్నారన్న వివరం తేలుతుంది 

*ఇదీ ప్రకటన వివరం ..*

 ఇప్పటికే ఉద్యోగోన్నతులు పొందే కేడర్లకు సంబంధించిన ఉపాధ్యాయుల సీనియార్టీ జాబి తాలు డీఈవో వెబ్సైట్లో పెట్టారు . 8 వ తేదీ లోగా వీటిని పరిశీలించుకుని అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయాలి . వీటిని తగిన ఆధారాలతో అప్పీలు చేసే ఉపాధ్యాయుడి ట్రజరీ కోడ్ సాయంతో వెబ్సైట్లో అన్లైన్లోనే పొందు పరచాలి . ఒక్కొక్కరు మూడు అప్పీళ్లు చేసుకోవ డానికే వీలుంటుంది . నేరుగా అప్పీళ్లు జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో స్వీకరించరు . వాటిని పరిశీలించి 10 న తుది జాబితా ప్రకటిస్తారు . 11 న గ్రేడు -2 ప్రధానోపాధ్యాయులకు , 12 , 13 న స్కూల్ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహిస్తారు . ఉద్యోగోన్నతులు అడాక్గానే ఇస్తారు . తదుపరి జరగబోయే ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ అనంతరమే కచ్చితమైన స్థానానికి వారు వెళ్లాల్సి ఉంటుంది

🪸🪷🪸🪷🪸🪷 

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!