డీఏ ఎరియర్స్ వడ్డీతో సహా చెల్లించాలి : ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ
ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకుంటే… కలిసొచ్చే ఉద్యోగ సంఘాలతో వచ్చే నెల ఒకటి నుంచి స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణ, ఆస్కార్రావులు స్పష్టం చేశారు.
ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు ఎరియర్స్ వడ్డీతో సహా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో పీఆర్సీ పెండింగ్ అంశాలు, ఉద్యోగుల సమస్యలపై ఆర్థికశాఖ అధికారులను కలిసిన అనంతరం సూర్యనారాయణ విలేకరులతో మాట్లాడారు. సెప్టెంబరు 30 లోగా సీపీఎ్‌సపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారని, ఇప్పటికీ దానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. 1-9-2004 కంటే ముందు ఉద్యోగాల్లో నియమితులైన వారికి ఏపీపీఎస్‌సీ, గ్రూప్-2-99 ఉద్యోగులకు, అదే విధంగా 20-03లో డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు 1-9-2004 కంటే ముందే నియామకప్రక్రియ జరిగి 1-9-2004 అనంతరం ఉద్యోగాల్లో నియమితులైన ఉద్యోగులకు కేంద్ర మార్గదర్శకాలప్రకారం ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
డీఈవో అధికారాలపై
దిక్కుతోచని స్థితిలో విద్యాశాఖ
జెడ్పి టీచర్లపై చర్యలు తీసుకునే అధికారం లేదన్న హైకోర్టు
ఏమీ తేల్చుకొని విద్యాశాఖ అధికారులు
పాఠశాల విద్య సక్రమంగా సాగుతుందా లేదా అనేది నిరంతరం పర్యవేక్షించడం పాఠశాల విద్యాశాఖ నియమించిన డీఈవోలు, ఆర్జేడీల బాధ్యత, ప్రభుత్వ స్కూళ్లుతోపాటు జడ్పి స్కూళ్లు, మున్సిపల్ స్కూళ్ల టీచర్లపైన కూడా వీరి పర్యవేక్షణ ఉంటుంది. ఈ టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు, జీతాలు అన్ని వీరి పరిధిలో ఉంటాయి. వీరికి ఉద్యోగులుగా అపాయింట్మెంట్ ఆధారాటిగా కూడా వీరే ఉంటారు. దానిలో భాగంగానే ఈ ఏడాది జరిగిన పదోతరగతి పరీక్షల్లో కొంతమంది టీచర్లు ప్రశ్నాపత్రాలను లీక్ చేశారంటూ విద్యాశాఖ వారిని సస్పెండ్ చేసింది. వీరిని డీఈవోలు, ఆర్జీడీ లు తమ అధికారాలను ఉపయోగించి సస్పెండ్ చేశారు. దీనిపై పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కొందరు జెడ్పి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు హైకోర్టు కెళ్లారు. గతంలో ప్రభుత్వం తెచ్చిన ఉమ్మడి సర్వీసు రూల్స్ ను హైకోర్టు కొట్టివేసినందున, నిబంధనల ప్రకారం తమపై చర్యలు తీసుకునే అధికారం డీఈవోలకు లేదని వీరు వాదించారు. ఈ వాదనతో ఏకభవించిన హైకోర్టు వీరి సస్పెన్షన్ చెల్లదని తీర్పునిచ్చింది. వీరిపై చర్యలు తీసుకోవాలంటే జెడ్పి అధికారం ఉందని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు ఇప్పుడు రాష్ట్ర సిఇవోకు మాత్రమే విద్యాశాఖకు సంకటస్థితిగా మారింది. కోర్టు తీర్పునసరించి ఆ కొందరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ ఎత్తివేస్తే విగిలిన జిల్లాల్లో కూడా సమస్యగా మారుతుంది. జడ్పి టీచర్ల పర్యవేక్షణలో డీఈవోలకు ఎటువంటి అధికారం లేదని కోర్టు తీర్పునివ్వడం కొత్త తలనొప్పిగా మారింది. ఒక వేళ అప్పీలుకు వెళితే ఇదే పరిస్థితి ఎదురైతే పరిస్థితి ఎంటా అని విద్యాశాఖ ఆలోచిస్తుంది. డీఈవోలకు, ఆర్జేడీలకు అధికారాలు ఉండవన్న కోర్టు తీర్పును కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆహ్వానిస్తుంటే మరికొన్ని ఉపాద్యాయ సంఘాలు మాత్రం కోర్టు తీర్పును తప్పు పట్టలేమని, అయితే డీఈవోలకు, ఆర్జేడీలకు అధికారం లేదనడం సరైంది కాదని, తమకు ఉద్యోగులిచ్చిన అపాయింట్మెంట్ అధిరాటినే డీఈవో, ఆర్జేడీలని పేర్కొంటున్నాయి.
కోర్టు తీర్పు నేపథ్యంలో ఉపాధ్యాయులపై కేసులు ఎత్తేయండి: యుటిఎఫ్
®️హైకోర్టు తీర్పు నేపథ్యంలోనైనా పదవ తరగతి ప్రశ్నా పత్రాల కేసులో ఇరు క్కున్న అమాయక టీచర్లపై సస్సెన్లను ఎత్తివేసి వారిపై కేసులు తొలగించాలని ఐర్య. ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. డీఈవోలకు జడ్పి టీచర్లపై అధికారం లేదనడం సరికాదని, అయినప్పటికీ కోర్టు తీర్పు నేపథ్యంలో అమాయక టీచర్లను రాష్ట్ర ప్రభుత్వం బయటపడేయాలని ఆయన కోరారు.
*®️రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లపై పెట్టిన కేసులు ఎత్తేయాలి: తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం*
®️పదో తరగతి పేపర్లు లీక్ చేశారంటూ సోషల్ మీడియాలో వచ్చిన ఒక వార్త ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లపై అక్రమంగా కేసులు పెట్టారని, వాటన్నింటినీ ఎత్తివేసి టీచర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గౌరవనీయమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం నీచంగా చూస్తోందని, ఇప్పటికైనా వారిని మర్యాదపూర్వకంగా ట్రీట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
చైల్డ్ ఇన్ఫోలో నమోదు తప్పనిసరి
చైల్డ్ ఇన్ఫోలో ప్రతి విద్యార్థిని నమోదు చేయాల్సిందేనని మండల విద్యాశాఖాధికారి కేఎఫ్ కెన్నడీ ప్రైవైట్ పాఠశాల యాజ మాన్యానికి సూచించారు. ఆర్జేడీ సూచనల ప్రకారం మండల కేంద్రమైన కాకుమాను ఇండియన్జెమ్స్ పాఠశాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో 447 మంది విద్యార్థులు ఉండగా చైల్డ్ ఇన్ఫోలో 436 మందిని మాత్రమే ఎందుకు నమోదు చేశారని యాజమాన్యాన్ని ప్రశ్నిం చారు. అలాగే 1 నుంచి 10వ తరగతుల నిర్వహణకు మాత్రమే అనుమతు లు ఉన్నాయని, ఎల్కేజీ, యూకేజీ, అలాగే నర్సరీకు అనుమతులు పొందాల ని ఆదేశించారు. అనంతరం సీఆర్పీలతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రభు త్వ పాఠశాలలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమం సీఆర్పీలు సురేంద్రబాబు, చలపతిరావు, జమాయమ్మ, పాల్గొన్నారు.
ట్రిపుల్ ఐటీల్లో ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల ఎంపిక జాబితా విడుదల
రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో వికలాంగులు, సైనికోద్యో గుల పిల్లలు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో ప్రత్యేక కేటగిరీ సీట్లకు ఎంపికైన విద్యార్థుల జాబితాను ఆర్జీయూకేటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల కన్వీసర్ ఆచార్య ఎస్ఎస్ఎస్పీ గోపాలరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం తెలియజే స్తామని వివరించారు. ఎంపికైన విద్యార్థులు వెబ్సైట్ నుంచి కాల్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. స్పోర్ట్స్, ఎన్ సీసీ కోటా కేటగిరీలో సీట్లు పొందినవారి జాబితాను రెండు నుంచి మూడు వారాల్లో విడుదల చేస్తామని తెలిపారు.
ఉపాధ్యాయులు సీనియారిటీ జాబితాలు సరిచూసుకోండి
విద్యాశాఖలో ఉద్యోగోన్నతుల సీనియారిటీ జాబితాలను సరిచూసుకో వాలని కృష్ణాజిల్లా విద్యా శాఖాధికారి తాహెరా సుల్తానా ఉపాధ్యాయులకు సూచిం చారు. జిల్లా, మండల పరిషత్ యాజ మాన్యాల పరిధిలోని పాఠశాలల ఉపాధ్యా యులకు ఉద్యోగోన్నతుల ప్రక్రియ చేపడుతు న్నట్లు ఆమె తెలిపారు. సీనియారిటీ జాబితా లన్నీ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయన్నారు. వీటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే శని వారం సాయంత్రం లోగా తగిన ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచిం చారు. ఉపాధ్యాయులు తమ అభ్యంతరాలను కేవలం వెబ్సైట్లో మాత్రమే నమోదు చేయాలన్నారు. డీఈవో కార్యాలయంలో నేరుగా ఎటువంటి దరఖాస్తులను తీసుకోవడం జరగదన్నారు. ఉపాధ్యాయుల సౌలభ్యం కోసం ఆన్లైన్ ప్రక్రియను తీసుకొచ్చినందున, దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
నిలిచిపోయిన ఎన్టీఎస్ పరీక్ష, మార్చి వరకే కేంద్రం ఆమోదం:మళ్లీ అనుమతిచ్చే వరకు పరీక్ష లేనట్లేనని ప్రకటించిన ఎన్సీఈఆర్టీ
దేశంలో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష(ఎన్టీ ఎస్ఈ) బ్రేక్ పడింది. కేంద్ర విద్యాశాఖ నుంచి ఆమోదం లభించే వరకు దాన్ని నిలిపివేస్తున్నట్లు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్సీఈ ఆర్) ప్రకటించింది. పదో తరగతి చదివే విద్యార్థులకు రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో పరీక్ష నిర్వహించి చివరకు 2వేల మందికి కేంద్ర ప్రభుత్వం ఉపకారవేతనం అందజేస్తుంది. గత ఏడాది ఎన్టీఎస్ఈ-2021 నిర్వహి స్తామని ఎన్సీఈఆర్టీ ప్రకటించడంతో ఆయా రాష్ట్రాలు రాష్ట్రస్థాయి పరీక్ష కోసం విద్యార్థుల నుంచి రుసుములు వసూలు చేశాయి. గత జనవరిలో పరీక్ష జరపాల్సి ఉండగా.. దాన్ని నిలిపివేయాలని ఆనాడు ఎన్సీఈఆర్టీ నుంచి అకస్మాత్తుగా ఆదేశాలు వచ్చాయి. అప్పటి నుంచి పరీక్ష నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పరీక్షకు 2021 మార్చి వరకే ఆమోదం ఉందని, తర్వాత పరీక్షల నిర్వహణకు అది ఇంకా రాలేదని, అందువల్ల మళ్లీ ఉత్తర్వులు ఇచ్చే వరకు పరీక్షను నిలిపివేస్తున్నట్లు ఎన్సీఈఆర్టీ ప్రకటించింది. అంటే 2021కు పరీక్ష ఇక లేనట్లే. సాధారణంగా ఏటా ఆగస్టు/సెప్టెంబరులో నోటిఫికేషన్ ఇచ్చి నవంబరు తొలి ఆదివారం రాష్ట్రస్థాయి పరీక్ష జరుపుతారు. ప్రతిభ చూపినవారికి జాతీయస్థాయి పరీక్షను మే రెండో ఆది వారం నిర్వహిస్తారు. అక్టోబరు వచ్చినా ఇప్పటివరకు నోటిఫికేషన్ రానందున 2022కు కూడా పరీక్ష లేనట్లే. నని భావిస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులేమో 2021 మార్చి వరకే పరీక్షకు అనుమతి ఉన్నప్పుడు గత ఏడాది పరీక్ష జరపాలని నోటిఫికేషన్ ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. పోయిన ఏడాది తెలంగాణలో దాదాపు 14వేల మంది నుంచి వసూలు చేసిన ఫీజులను వెనక్కి ఇస్తారా? లేదా? అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఈ నెల IO, II తేదీల్లో ఉపాధ్యాయులకు శిక్షణ
మండలంలోని ఉన్నత పాఠశాలల్లో 9వ తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయులకు ఈనెల 10, 11 తేదీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్థానిక ఎమ్మార్సీలో శిక్షణ ఉంటుందని ఎమ్యీవో మెటిల్దారాణి తెలిపారు. తొమ్మిదో తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయుల్లో సెక్షన్కు ఒక్కరు చొప్పున హాజరు కావాలని సూచించారు.
పాఠశాలలకు బోధనా సామగ్రి
కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాల్లో పాఠశాలలకు ఇంగ్లీషు బోధన సామగ్రి ఈనెల 12న అందజేస్తారని ఎస్ఎస్ ఏఎంవో సుధా కర్ తెలిపారు. నాడు-నేడు మొదటి దశలో అభివృద్ధి చేసిన పాఠశాలల్లో ఇంగ్లీషు ల్యాబొరేటరీలు ఏర్పాటు చేశారన్నారు. దానిని ఉపయోగించి ఒకటి నుంచి 8 తరగతి వరకు విద్యార్థులకు సమర్థంగా ఆంగ్ల బోధన చేసేందుకు ఎస్ఎస్ ఎస్పీడీ కార్యాలయం నుంచి జిల్లాకు పెన్ డ్రైవ్ మెటీరియల్ కాపీ చేసి ఇస్తారని తెలిపారు. దీన్ని మండలాల వారీగా పంపిణీ చేస్తామని వివరించారు.
మున్సిపల్ పాఠశాలలు, ఉపాధ్యాయులకు సంబంధించి ఏ విధమైన విధానపరమైన నిర్ణయం తీసుకోవాలన్న
ఆ నిర్ణయాధికారంపురపాలక శాఖదే:ఎంటీఎఫ్
మున్సిపల్ పాఠశాలలు, ఉపాధ్యాయులకు సంబంధించి ఏ విధమైన విధానపరమైన నిర్ణయం తీసుకోవాలన్న మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి మాత్రమే అధికారం కలదని మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ నాయకుడు రామకృష్ణ స్పష్టం చేశారు. సర్వీస్ రూల్స్ మార్చాలన్నా. ప్రధానోపాధ్యాయులకు డిడిఓ పవర్స్ ఇవ్వాలన్నా, జిపిఎఫ్ ఎకౌంట్ ఓపెన్ చేయాలన్నా, అన్ని నిర్ణయాలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా మాత్రమే జరగాలని ఆయన అన్నారు. జీవో 84 ప్రకారం స్కూల్ ఎడ్యుకేషన్ వారికి పురపాలక సూల్స్ పై రోజు వారి కార్యక్రమాలు, విద్యా పర్యవేక్షణ కు మాత్రమే అధికారం కలదని, ఇతర ఏలాంటి టీచర్ల సర్వీసు పరం గానీ.. పురపాలక ఆస్తులపై అధికారం లేదని రామకృష్ణ స్పష్టం చేశారు.
ప్రత్యేక విద్య’ టీచర్ తప్పని సరి: విద్యాహక్కు చట్టానికి కేంద్రం సవరణలు
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు విద్యను అందించేందుకు అన్ని పాఠశాలల్లో ప్రత్యేక విద్య ఉపా ధ్యాయులను (స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు) తప్పనిస రిగా నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. ప్రతి పాఠశాలలో ఓ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉండాలని పేర్కొంటూ విద్యాహక్కు చట్టానికి తాజాగా సవరణలు చేసింది. ఈ మేరకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ ఎడ్ల నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధనను అన్ని రాష్ట్రాలు అమలుచేయాలంటూ సమగ్ర శిక్షా అభి యాన్ ప్రత్యేక ప్రాజెక్టు డైరెక్టర్లు, దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శులకు సూచించారు. ఒకటి నుంచి అయిదు తరగతుల్లో ప్రతి 10 మంది దివ్యాంగులైన విద్యార్థులకు, ఆరు నుంచి ఎనిమిది తరగతుల్లో ప్రతి 15 మంది విద్యార్థులకు తప్పనిసరిగా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచరు ఉండా లని స్పష్టం చేశారు. ఏకో పాధ్యాయ పాఠశాలలు, ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు లేని ప్రాంతాల్లోని పాఠశాలలను ప్రత్యేక క్లస్ట ర్లుగా ఏర్పాటు చేసి నియ మించేందుకు వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు. ఒక్కో ప్రత్యేక విద్య ఉపాధ్యాయుడికి నాలుగు పాఠశాలలకు మించి కేటాయించకూడదని, ఆయా పాఠశాలలన్నీ అయిదు కిలోమీటర్ల దూరంలో ఉండాలని ఆ ఆదేశాల్లో సూచించారు.
ఉద్యోగోన్నతులపై అస్పష్టత,బదిలీల వరకుఆగాల్సిందే..ఆందోళన చెందుతున్న ఉపాధ్యాయులు
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగోన్నతులు ఇచ్చేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టత లేక ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఆన్లైన్లో ఉద్యోగోన్నతులు ఇవ్వాలని నిర్ణయించడంపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగోన్నతి ప్రక్రియను భౌతికంగా నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగోన్నతులు కల్పించడానికి ప్రభుత్వ ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. విధివి ధానాలను జిల్లా విద్యాశాఖాధికారులకు పంపించింది. ఆ ప్రకారం ఉమ్మడి కృష్ణా -జిల్లాలో అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. షెడ్యూల్ ప్రకారం ఉద్యోగో న్నతులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఉద్యోగోన్నతి ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, బదిలీలు నిర్వ హించినప్పుడే ఆయాపోస్టుల్లో చేరాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం చెబుతున్నాయి. అంటే ఉద్యోగోన్నతి పొందిన ఉపాధ్యా యులు వెంటనే ఆ హోదా పోస్టులో చేరేందుకు అవకాశం లేదు. తిరిగి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తి చేసే వరకు ఆగాల్సి ఉంటుంది. అప్పటివరకు ప్రస్తుత పాఠశా లల్లో పాత హోదాలోనే పని చేయాలి. ఖాళీ పోస్టుల వివ రాలు ప్రకటించకపోవడం పైన విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. ఆన్లైన్లో దూరప్రాంతంలో పోస్టింగ్ ఇస్తే అంత దూరం వెళ్లడం ఇష్టం లేని వారు తమ ఉద్యోగోన్నతిని వదులుకునే పరిస్థితి ఉంది. దంపతులు ఉపాధ్యాయులై, వేర్వేరు చోట పని చేయాల్సి వస్తే మరింత కష్టం అవు తుంది కనుక ప్రమోషన్కు దూరంగా ఉండొచ్చు. కనుక ఆయా అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉపా ధ్యాయులు కోరుతున్నారు.
181 మందికి..
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రభుత్వ పాఠశా లల్లో 12,064 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. అందులో ఎస్జీటీలు తెలుగు 5620, స్కూల్ అసి స్టెంట్లు.. గణితం 843. ఆంగ్లం 684, సోషల్ 807, తెలుగు 812, హిందీ గ్రేడ్ -2లో 622, ప్రధానోపాధ్యాయులు 319, పీడీలు 372. మంది ఉన్నారు. వారిలో సబ్జెక్టుల వారీగా సీనియారిటీ ప్రకారం. కేవలం 181 మంది ఉపాధ్యాయులకు మాత్రమే ఉద్యోగోన్నతి రానుంది. వారిలో ప్రధానోపాధ్యాయులు 23, గణితం 13, పీఎస్ 6. పీడీ-3, ఆంగ్లం సబ్జెక్టులో -136 మందికి ప్రమోషన్ ఇవ్వను న్నారు. ఆ జాబితాను పాఠశాలల వారీగా ప్రదర్శించారు. అభ్యం తరాలు ఉంటే శుక్ర, శనివారాల్లో ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తున్నారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి ఆదివారం కల్లా తుది జాబితా ప్రదర్శించాలని నిర్ణయించారు. ఈ నెల 11న ప్రధానోపాధ్యాయు లకు, 12, 13 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్లతో పాటు సమాన కేట గిరీ వారికి ఉద్యోగోన్నతుల ఉత్తర్వులు జారీ చేస్తారు.
సీపీఎస్ అమలుకు ముందు ఎంపికైన ఉద్యోగుల జాబితా సేకరణ
కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం (సీపీఎస్) అమల్లోకి వచ్చిన సెప్టెంబరు 2004కు ముందు ఉద్యోగానికి ఎంపికై ఆ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగుల వివరాలను ఆర్థిక శాఖ సేకరిస్తోంది. ఇప్పటికే అయా విభాగాలు అందించిన డేటాలో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే చేసి, తుది జాబితాను ఈనెల 12లోపు అందించాలని అన్ని విభాగాధిపతులు, సచివాలయ అధికారులను కోరింది. కొన్ని నియామకాల్లో ఆగస్టు 31, 2004కు ముందు ఎంపిక ప్రక్రియ పూర్తయినా సీపీఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల్లో చేరారు. సీపీఎస్ అమల్లోకి రాక ముందే ఉద్యోగాల ఎంపిక పూర్తయినందున వారికి పాత పింఛన్ విధానం అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది.