TODAY EDUCATION/ TEACHERS TOP NEWS 15/10/2022

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
TODAY EDUCATION/ TEACHERS TOP NEWS 15/10/2022

*📚✍️పిల్లలు మెచ్చే*
 *పాఠ్యాంశాలు..✍️📚*

*♦️సమగ్ర శిక్షా పథకాన్ని రీడిజైన్ చేసిన కేంద్ర ప్రభుత్వం*

*♦️జాతీయ విద్యా విధానం – 2020సిఫార్సులకు అనుగుణంగా మార్పులు*

*♦️ప్రోగ్రామాటిక్, ఫైనాన్షియల్మార్గదర్శకాలతో కొత్త ఫ్రేమ్వర్క్*

 *♦️ప్రీ ప్రైమరీ నుండి సీనియర్ సెకండరీస్థాయి వరకు నాణ్యమైన విద్య*

 *♦️పిల్లలందరికీ ఆహ్లాదకర వాతావరణంలో బోధన*

*♦️అభ్యసన ప్రక్రియలో చురుగ్గా పాల్గొనేలా చేయడమే లక్ష్యం*

*♦️పథకంలో 11.6 లక్షల స్కూళ్లు. 15.6 కోట్ల మంది విద్యార్థులు*


*🌻సాక్షి, అమరావతి*: జాతీయ నూతన విద్యా విధానం – 2020 సిఫార్సుల ప్రకారం సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రీడిజైన్ చేసింది. పిల్లలు మెచ్చేలా, వారు అభ్యసన ప్రక్రి యలో చురుగ్గా పాల్గొనేలా ప్రీ ప్రైమరీ నుండి సీని యర్ సెకండరీ స్థాయి వరకు నూతన విధానాన్ని (ఫ్రేమ్వర్క్) రూపొందించింది. ఆహ్లాదకరమైన తరగతి గదిలో, ఉన్నత ప్రమాణాలు సాధించేలా నాణ్యమైన విద్యను అందించేలా కార్యక్రమాలు రూపొందించింది. విద్యార్థుల విభిన్న సామాజిక పరిస్థితులు, సామర్ధ్యాలు, బహు భాషా అవసరాల ను పరిగణనలోకి తీసుకొంది. ఈ పథకంలో 11.6 లక్షల పాఠశాలలు, 15.6 కోట్ల మంది విద్యార్థులు, 57 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ కార్యక్రమాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలకు సహకారం అందిస్తుంది. ఈ విధానం లో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు, వివిధ శిక్షణ సంస్థలకు సహకారం అందుతుంది. విద్యా కార్యక్రమాల అమలుకు జిల్లాకు రూ.10 నుంచి 20 లక్షల వరకు ఖర్చు చేస్తారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, డ్రాపవుట్స్ నివారణ. పునాది అక్షరాస్యత సంఖ్యాశాస్త్రం (ఎఫ్ఎల్ఎన్) అభివృద్ధి. లింగ సమానత్వం. నాణ్యత, వినూత్న ఆవిష్కరణలు, ఉపాధ్యాయుల వేతనాలకు ఆర్ధిక సహకారం. డిజిటల్ కార్యక్రమాలు, యూనిఫారాలు, పాఠ్యపు స్తకాలు మొదలైన వాటికి సహకారం అందిస్తారు. ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ)కి వీలుగా కొత్త కార్యక్రమాలకు అవకాశం కల్పిస్తారు. వృత్తి విద్య, క్రీడలు, వ్యాయామ విద్య, ఉపాధ్యాయ శిక్షణను బలోపేతం చేస్తారు. హోలిస్టిక్, 360 డిగ్రీ, మల్టీ డైమెన్షనల్ మోడ్లో విద్యార్థులను తీర్చి దిద్దాలన్నది ఈ విధానం ఉద్దేశం. ఇందుకోసం జాతీయ మూ ల్యాంకన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. బ్యాగ్ లెస్ డేస్, స్కూల్ కాంప్లెక్స్లు, స్థానిక కళాకారు లతో ఇంటర్న్షిప్లు, బోధన సంస్కరణలు ఇందు లో కీలకమైనవి. ఖేలో ఇండియాలో భాగంగా జాతీ య స్థాయి స్కూల్ గేమ్స్ పతకాలు గెలిచిన పాఠ శాలకు రూ. 25 వేలు ఇస్తారు. అచీవ్మెంట్ సర్వేల కోసం టెస్ట్ మెటీరియల్, ఐటెమ్ బ్యాంక్ ల అభివృ ద్ధికి, శిక్షణ, పరీక్ష నిర్వహణ, డేటా సేకరణ, విశ్లేషణ, నివేదికలు రూపొందించడానికి ఎస్సీఈఆర్టీలలో అసెస్మెంట్ సెల్లు ఏర్పాటు చేస్తారు.. ఈ.. కార్యక్రమాల ప్రగతిని మదింపు చేసేందుకు పలు పనితీరు సూచికలనూ ఏర్పాటు చేశారు. స్మార్ట్ క్లాస్ రూమ్లో భాగంగా ఐసీటీ ల్యాబ్ లు, డిజిటల్ బోర్డులు, వర్చువల్ క్లాస్ రూమ్లు, డీటీహెచ్ ఛానల్ ఏర్పాటుకు సహకారం అందిస్తారు.

 *♦️12వ తరగతి వరకు కేజీబీవీల అప్గ్రేడ్*

 అన్ని కేజీబీవీలను 12వ తరగతికి అప్గ్రేడ్ చేస్తారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కేజీబీవీ విద్యార్థినుల కోసం ప్రత్యేక హాస్టళ్లు ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ప్రస్తుతం ఇస్తున్న రూ.25 లక్షల సాయాన్ని 40 లక్షలకు పెంచుతున్నారు. బాలికల హాస్టళ్లలో ఇన్సినరేటర్, శానిటరీ ప్యాడ్ వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేస్తారు. ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించడం కోసం ‘రాణి లక్ష్మీబాయి ఆత్మ రక్షా శిక్షణ’ పేరిట శిక్షణ ఇస్తారు. దీనికోసం రూ. 5 వేల చొప్పున కేటాయిస్తారు.

*♦️అమలు ఇలా..👇👇*

▪️ప్రీ ప్రైమరీలో అంగన్వాడీ కార్యకర్తల శిక్షణ కోసం మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇస్తారు. ఈసీసీఈ టీచర్లకు ఇన్ సర్వీస్ శిక్షణ ఇస్తారు.

▪️ప్రభుత్వ పాఠశాలల ప్రీ ప్రైమరీ విభాగాలకు టీచింగ్ లెర్నింగ్ మెటీరి యల్, స్వదేశీ బొమ్మలను అందిస్తారు.

▪️మాన్యువల్ కోసం టీచర్కు రూ.150 చొప్పున ఇస్తారు.

▪️ఆటల కోసం ఒక్కో చిన్నారికి సంవత్స రానికి రూ.500. టీచింగ్ లెర్నింగ్ మెటీరి యల్ కోసం రూ.500 వరకు ఇస్తారు.

▪️సీనియర్ సెకండరీ విద్యార్థుల రవాణా సదుపాయానికి ఏడాదికి రూ.6 వేల చొప్పున ఇస్తారు.

▪️16 నుండి 19 సంవత్సరాల లోపు బడి బయట ఉన్న పిల్లలకు ఓపెన్ స్కూల్ విధానం ద్వారా సెకండరీ సీనియర్ సెకండరీ స్థాయిలను పూర్తి చేయడానికి సహకారం అందిస్తారు..

▪️ఎస్సీ, ఎస్టీ, వికలాంగ పిల్లలకు ఒక్కో గ్రేడికి ఒక్కో విద్యార్థికి రూ. 2వేల వరకు ప్రత్యేకంగా అందిస్తారు.

▪️బాలల హక్కులు, భద్రతకు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్కు ఆర్ధిక సహాయం అందిస్తారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇


*📚✍️16, 17 తేదిల్లో గణిత, సైన్సు ఉపాధ్యాయులకు శిక్షణ✍️📚*

*🌻పెడన గ్రామీణం, న్యూస్టుడే:* పట్టణ పల్లోటి ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాలలో ఈ నెల16, 17 తేదీల్లో సైన్సు, లెక్కలు బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్లు కరస్పాండెంట్ జోజిరెడ్డి తెలిపారు. సెన్సు, లెక్కల పాఠ్యపుస్తకాల రూపకర్తలు, రిసోర్సు పర్సన్లుగా వ్యవహరించే శిక్షణకు ఉపాధ్యాయులు ఎవరైనా పాల్గొన వచ్చని వివరించారు. పెడన పట్టణ, పరిసర ప్రాంత ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని ఉపయోగించు కోవచ్చన్నారు. శిక్షణ అనంతరం ఉపాధ్యాయులకు ధ్రువ పత్రం అందజేస్తామని తెలిపారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

*📚✍️యుడైస్ ప్లస్ లో*
 *వాస్తవాల నమోదు✍️📚*

*♦️పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సిఎస్ రాజశేఖర్*

*🌻ప్రజాశక్తి-అమరావతి బ్యూరో*
యుడైస్ ప్లస్ లో వాస్తవ గణాంకాలు నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ చెప్పారు. విద్యార్థులందరినీ ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడేలా ఉండాలని తెలిపారు. విజయవాడలో శు క్రవారం నిర్వహించిన 47వ యుడైస్ ప్లస్పై వర్క్షాపులో ఆయన ముఖ్య అతిధిగా ప్రసంగించారు. యుడైస్ ప్లస్ అనేది మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్) నుంచి డెషిసన్ సపోర్ట్ సిస్టంకు మారాలని అన్నారు. కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ మాట్లాడుతూ అంగన్వాడీ నుంచి గ్రాడ్యుయేట్ స్థాయి యుడైన నన్ను విస్తరించడం వల్ల డ్రాపౌట్లను తగ్గించవచ్చన్నారు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ గణాంక ప్రచురణల విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వెంకటరమణ హెగ్దే మాట్లాడుతూ. యుడైఎస్ ఎంట్రీలో ఎపి చాలా ముందుచూపుతో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిధిగా ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరిబాబు, సమగ్ర శిక్షా రాష్ట్ర అదనపు పథక సంచాలకులు బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇


*📚✍️మిగులు పోస్టులు 2,280✍️📚*

*♦️కొలిక్కి వచ్చిన హేతుబద్ధీకరణ*

*♦️డీఎస్సీ ఆశలకు గండి*

*🌻విజయనగరం విద్యావిభాగం, న్యూస్టుడే* ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఇందులో భాగంగా భారీగా పోస్టులు మిగిలిపోవడంతో అవసరం మేరకు సర్దుబాటు చేయనున్నారు. కొరత ఉన్న చోట్ల ఉద్యోగోన్నతులతో భర్తీ చేస్తారు. ఇప్పటికే అర్హులైన ఉపాధ్యాయుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేశారు. వారి నుంచి రాతపూర్వకంగా అంగీకారం కూడా పొందారు.

ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన హేతుబద్ధీకరణ భవిష్యత్తులో పోస్టుల భర్తీపై ప్రభావం చూపనుంది. ఉమ్మడి జిల్లాలో 2,280 పోస్టులు అదనంగా ఉన్నట్లు తేల్చారు. జీవో నంబరు 117 ప్రకారం తొలుత 2,380 పోస్టులు మిగిలిన ఉన్నట్లు గుర్తించారు. కొత్తగా జారీ చేసిన జీవో 128 , పాత జీవో 117ల ప్రకారం విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకునే తేదీ, పోస్టులు కొనసాగించేందుకు కొంత వెసులుబాటు కల్పించడంతో స్వల్ప మార్పు చోటుచేసుకుంది.
ఉన్నత పాఠశాలల్లో 3,4,5 తరగతుల విలీనం, ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం అమలు చేయడంతో ఎస్జీటీ పోస్టుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో విద్యా ప్రమాణాలు, నాణ్యత ఎలా పెరుగుతుందని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. జాతీయ నూతన విద్యావిధానం పేరుతో ప్రాథమిక పాఠశాలలను విచ్ఛిన్నం చేయడమేనని ఆరోపిస్తున్నారు.

*♦️1998 డీఎస్సీతో..*
గత బదిలీల్లో 900 పోస్టులు బ్లాక్‌ చేశారు. ప్రస్తుతం ఈ స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. హేతుబద్ధీకరణతో భవిష్యత్తులో పోస్టుల భర్తీకి అవకాశాలు తక్కువ. 1998 డీఎస్సీ వారికి ఒప్పంద విధానంలో పోస్టులివ్వాలని భావిస్తున్నారు. 128 జీవో ప్రకారం 20-30 మంది విద్యార్థులున్న చోట వీరికి అవకాశం కల్పించనున్నట్లు విద్యావర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల నిర్వహించిన ధ్రువపత్రాల పరిశీలనకు 575 మందికి 544 మంది హాజరయ్యారు. దీంతో రెగ్యులర్‌ ఎస్జీటీ పోస్టుల సంఖ్య ఇంకా తగ్గుతుంది. ఈ క్రమంలో భవిష్యత్తులో డీఎస్సీ ఉండదన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

*♦️మార్పులివీ…👇👇*

* ప్రాథమిక బడుల్లో తొలుత 30 మందికి ఒక్కో ఉపాధ్యాయుడినే ఇవ్వాలని నిర్ణయించారు. తర్వాత 21 నుంచి 60 వరకు ఇద్దరిని కొనసాగించేందుకు అవకాశం కల్పించారు.

* 3-10 తరగతులకు 137 మంది, 6-10 తరగతులకు 92 మంది విద్యార్థులు పైబడి ఉంటే ప్రధానోపాధ్యాయుడి పోస్టు కేటాయిస్తారు.

* ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయుడి పోస్టుకు తొలుత 121 మంది విద్యార్థులు ఉండాలని నిర్దేశించారు. ఇప్పుడు ఈ సంఖ్యను 151కి పెంచారు.

* మే నెల 5వ తేదీకి ఉన్న విద్యార్థుల నమోదు ఆధారంగా హేతుబద్ధీకరణ చేపట్టారు. ఉపాధ్యాయుల వ్యతిరేకతతో ఆగస్టు 31 నాటికి నమోదును పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

*♦️ఉత్తర్వులు రావాల్సి ఉంది*
హేతుబద్ధీకరణతో మిగులు పోస్టులను అవసరం మేరకు సర్దుబాటు చేయాల్సి ఉంది. కొరత ఉన్న పోస్టుల్లో ఉద్యోగోన్నతులు కల్పిస్తాం. ఇందుకు సిద్ధం చేశాం. సర్దుబాటు, బదిలీలకు ఉత్తర్వులు రావాల్సి ఉంది.

*▪️- కె.వెంకటేశ్వరరావు, ఇన్‌ఛార్జి డీఈవో*

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇


*📚✍️విద్యార్థుల భవిష్యత్ కు*
 *దిక్సూచిగా యూడైఎస్ ప్లస్✍️📚*

*♦️పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్* 

*♦️విజయవాడ వేదికగా యూడైస్ ప్లస్ 47వ ప్రాంతీయ వర్కుషాప్*

*🌻సాక్షి, అమరావతి:* యూడైఎస్-ప్లస్ (విద్యారంగా నికి సంబంధించి ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థ లో కేవలం సమాచారం నిమిత్తం గణాంకాలను నమోదు చేయడానికే పరిమితం కావొద్దని పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజ శేఖర్ కోరారు. అన్నివర్గాల విద్యార్థుల అభివృద్ధితో పాటు వారి భవిష్యత్ నిర్ణయించే విధంగా చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడేలా ఉండాలని స్పష్టం చేశారు. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన 47వ యూడైస్ ప్లస్ ప్రాంతీయ వర్క్షాప్ ప్రారంభ సభలో మాట్లాడుతూ.. యూడైస్ ప్లస్ అనేది మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్) నుంచి డెసిష న్ సపోర్ట్ సిస్టంకు మారాలన్నారు. మూడేళ్లగా కోవిడ్ కారణంగా ఆగిన ఈ ప్రాంతీయ స్థాయి కార్యశాలకు ఈసారి ఆంధ్రప్రదేశ్ వేదికైందని తెలిపారు. పాఠశా ల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ మాట్లా డుతూ మన రాష్ట్రంలో విద్యార్ధి ఆధారితంగా యూడై స్ ప్లస్ నమోదు జరుగుతుందన్నారు.

*♦️ఏపీ పనితీరు భేష్*

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గణాంక ప్రచురణల విభాగం (డీవోఎస్ఈ-ఎల్) డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణ హెగ్దే మాట్లాడుతూ. జనరల్ వెంకటరమణ యూడైస్ డీసీఎఫ్ (డాటా క్యాప్చర్ ఫార్మాట్)లో వివిధ అంశాలను తప్పులు లేకుండా పూర్తి చేసే విధానాన్ని, తప్పులు దొర్లటం వల్ల వివిధ జాతీయ స్థాయి డాష్ బోర్డుల్లో రాష్ట్రాల ప్రగతిపై చూపే ప్రభావాన్ని వివరించారు. యూడైస్ డేటా ఎంట్రీ విషయంలో ఆంధ్రప్రదేశ్ చాలా ముందుచూపుతో, ప్రణాళికాబద్ధంగా పని చేస్తోందని కొనియాడారు. 2021-22కు సంబంధించిన యూడైస్ డేటాను సమర్పించిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అభినం దించారు. కార్యక్రమంలో ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, అండమాన్ నికోబార్, పుదుచ్చేరి, కేరళ నుంచి రాష్ట్ర, జిల్లా ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇


*📚✍️నేడు చేతుల పరిశుభ్రత*
 *దినోత్సవం✍️📚*

*🌻మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్టుడే*: ప్రపంచ చేతుల శుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని అన్ని పాఠశా లల్లో శనివారం ఈ కార్యక్రమాలు నిర్వహించాలని సమగ్రశిక్ష ఏపీసీ డా.ఏ. శేఖర్ అన్నారు. పలువురు అధికారులు పాల్గొని తనిఖీలు నిర్వహిస్తారని ఒక ప్రకటనలో తెలిపారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇


*’📚✍️పీఎం శ్రీ’ పాఠశాలలు..మండలానికి రెండు✍️📚*

*♦️ఎన్ఈపీ-2020 లక్ష్యాలకు అనువుగా తీర్చిదిద్దనున్న కేంద్రం*

 *♦️సకల సౌకర్యాలతో దేశవ్యాప్తంగా14,500 బడులు*

*🌻ఈనాడు, న్యూస్*: నూతన జాతీయ విద్యా విధానం -2020 లక్ష్యా లకు అనుగుణంగా దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలను సకల సౌకర్యా లతో తీర్చిదిద్దాలని నిర్ణయించిన కేంద్రం మండలానికి రెండు పాఠశాల లను ఎంపిక చేయనుంది. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తారు. అందుకు ఒక్కో బడికి రూ. కోటిన్నర నుంచి రూ.2 కోట్లు వెచ్చిస్తారు. పథకం, విధి విధానాలను వివరించేందుకు అన్ని రాష్ట్రాల విద్యాశాఖ అధికారులతో కేంద్ర అధికారులు శుక్రవారం ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. ఏటా కొన్ని చొప్పున ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై 2026-27 నాటికి దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలను అభివృద్ధి చేస్తారు. అందుకు రూ.27,360 కోట్లు వ్యయం చేయాలని కేంద్రం నిర్ణయించగా అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు 60:40 శాతం వాటాలు భరిస్తాయి. ఈ పథకం వల్ల 18 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని అంచనా వేశారు. ఒక్కో పాఠశాలలో సగటున 125 మంది విద్యార్థులు ఉంటారు..

*♦️ఏమిటీ పీఎం శ్రీ ?*

నూతన జాతీయ విద్యా విధానం -2020లో పలు లక్ష్యాలను కేంద్రం నిర్దే శించింది. తరగతికి తగిన విద్యాసామర్ధ్యాలు ఉండాలని, ఒత్తిడి లేని విద్య అందించాలని, విద్యేతర కార్యక్రమాలకూ పెద్దపీట వేయాలని, గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్, క్రీడా మైదానం వంటి సౌకర్యాలతోపాటు పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు ఉండాలని, విద్యార్థులను అన్ని విధాలా తీర్చిదిద్దాలన్నది లక్ష్యం. దాన్ని చేరుకునేందుకు అనువుగా పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎం శ్రీ) పేరిట గత నెలలో కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

*♦️ఎంపిక ఎలా… ఎన్ని వస్తాయి?*

ఛాలెంజ్ విధానంలో మండలానికి గరిష్ఠంగా రెండు పాఠశాలలను ఎంపిక చేస్తారు. అందులో ఒకటి ప్రాథమిక, మరొకటి ఉన్నత పాఠశాలలు ఉంటాయి. ప్రాథమికంగా ఎంపికైన పాఠశాలల జాబితాను యూడైస్ ఆధా రంగా కేంద్ర రాష్ట్రానికి పంపిస్తుంది. ఇందుకోసం ప్రధానోపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలి. వాటిని జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయులలో పరిశీలించి తుది ఎంపిక చేస్తారు. అంటే ఎక్కువ మంది విద్యార్థులున్న, ఎక్కువ విస్తీర్ణం, ఉత్తమ విధానాలు అవలంబించే, వినూత్నంగా బోధన చేసే పాఠశాలలు ఎంపికయ్యే అవకాశం ఉంది.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇


*📚✍️ఉదయం 10 గంటలకల్లా సీటులో ఉండాల్సిందే✍️📚*

 *♦️కొందరు అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించట్లేదు*

*♦️ఇక పై రోజువారీ హాజరు వివరాలు పంపండి*

*♦️సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు* 

*🌻ఈనాడు, అమరావతి:* రాష్ట్ర సచివాలయంలోని ప్రతి విభాగం అధికారులు, ఉద్యోగుల హాజరు వివ రాల్ని రోజూ తమకు పంపాలని సాధారణ పరిపాల నశాఖ ఉత్తర్వులు జారీచేసింది. పదే పదే చెప్పినా కొందరు అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించట్లేదని, విధులకు ఆలస్యంగా హాజరవుతు న్నారని, అది రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు ఇబ్బందిగా మారుతోందని ఓ సర్క్యులర్ లో సాధా రణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి (రాజకీయ) రేవు ముత్యాలరాజు పేర్కొన్నారు. సచివాలయ నిబంధనల ప్రకారం అధికారులు, ఉద్యోగులు రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 వరకు విధుల్లో ఉండాలని స్పష్టంచేశారు. ఈ మేరకు సచి వాలయ ఆఫీసు మాన్యువల్ నిబంధనల్ని ఆయన పునరుద్ఘాటించారు. ఈ నెల 17 నుంచి రోజూ హాజరు వివరాలను మధ్యాహ్నం 3 గంటల్లోగా సాధారణ పరిపాలనశాఖ మెయిల్ ఐడీకి పంపించా లని స్పష్టంచేశారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తీవ్రమైన చర్యలు ఉంటాయన్నారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇


*📚✍️సబ్జక్టు పోస్టులకు కోత!✍️📚*

*♦️లాంగ్వేజీకి బదలాయింపు*

*♦️ఆంగ్ల మాధ్యమం ముసుగులో విద్యా శాఖ చర్యలు*

*♦️ప్రాథమిక పాఠశాలల విలీనంతో మిగిలిన 126 పోస్టులు*

*♦️ఉన్నత పాఠశాలల్లో ఆంగ్లం, తెలుగు, హిందీ స్కూల్ అసిస్టెంట్లుగా బదలాయింపు*

*♦️డీఎస్సీలో ఆ మేరకు కోత*

 *♦️భవిష్యత్తులో ప్రైమరీ స్కూళ్ల హెచ్‌ఎంలకూ మంగళం*

*🌻(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)*

ఆంగ్ల మాధ్యమ బోధన మోజులో పడిన ప్రభుత్వం చిన్నారులకు ప్రాథమిక విద్యను దూరంచేస్తోంది. ఇందులో భాగంగా తీసుకుంటున్న పలు నిర్ణయాలు భవిష్యత్తులో విద్యా వ్యవస్థను మరింత బలహీనం చేయనున్నాయని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. సబ్జక్టు పోస్టులను లాంగ్వేజీ పోస్టులకు బదలాయిస్తూ తాజాగా తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి.

ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమ బోధన తప్పనిసరి చేసిన ప్రభుత్వం మిగిలిన సబ్జక్టు పోస్టులకు కోతపెట్టింది. సాధారణంగా ఒక సబ్జక్టుకు అదనపు పోస్టులు అవసరమైతే ఆర్థిక శాఖ అనుమతితో మంజూరుచేయాలి. అయితే దీనికి విరుద్ధంగా విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుని పోస్టుల హేతుబద్ధీకరణ ద్వారా ఉమ్మడి జిల్లాలో 100 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను మిగులుగా చూపించారు. దీనికితోడు ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను కిలోమీటరు దూరంలో వున్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో 126 ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎం పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్‌లుగా గుర్తించారు. వెరసి 226 పోస్టులను లాంగ్వేజి టీచర్లుగా బదలాయిస్తూ పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ ఉత్తర్వులు ఇచ్చారు.

*♦️విలీనంతో పోయిన పోస్టులు*

నూతన విద్యావిధానం అమలులో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను కిలోమీటరు దూరంలో వున్న ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. దీంతో ఆంగ్లం, తెలుగు బోధించే టీచర్లు అవసరమయ్యారు. అయితే తరగతుల విలీనంతో ప్రస్తుత విద్యా సంవత్సరానికి 126 ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఎత్తివేసిన విద్యా శాఖ…వాటిని ఉన్నత పాఠశాలల్లో అవసరం పడిన ఆంగ్లం, తెలుగు, హిందీ స్కూల్‌ అసిస్టెంట్లుగా బదలాయించింది. ఉమ్మడి జిల్లాలో 126 ఆంగ్లం స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు అవసరమని అధికారులు గుర్తించారు. రేషన్‌లైజేషన్‌లో భాగంగా ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో అక్కడ పనిచేస్తున్న 110 ఇతర సబ్జక్టుల పోస్టులను కూడా లాంగ్వేజి స్కూల్‌ అసిస్టెంట్లుగా బదలాయిం చారు. ఈ మేరకు జిల్లా విద్యా శాఖ చేసిన ప్రతిపాదనను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ అనుమతించారు.

*♦️ఆంగ్లం, తెలుగు, హిందీ బోధనకు సబ్జక్టు టీచర్లు*

రేషనలైజేషన్‌, తరగతుల విలీనంతో మిగిలిపోయిన టీచర్లలో అర్హులను గుర్తించి ఆంగ్లం, తెలుగు, హిందీ స్కూల్‌ అసిస్టెంట్లుగా బదలాయించారు. ఈ విధంగా 67 ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎం, 44 సోషల్‌ స్టడీస్‌, 22 బయాలజీ, మూడు ఫిజికల్‌ సైన్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను ఆంగ్లం స్కూల్‌ అసిస్టెంట్లగా కన్వర్షన్‌ చేశారు. ఇంకా 20 గణితం, ఒక ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం, తొమ్మిది ఫిజికల్‌ సైన్స్‌ స్కూలు అసిస్టెంట్ల పోస్టులను తెలుగు స్కూల్‌ అసిస్టెంట్లుగా 45 ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలు, రెండు ఫిజికల్‌ సైన్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను హిందీ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లోకి, 13 ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎం పోస్టులను వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల్లోకి కన్వర్ట్‌ చేశారు. పలు రకాలుగా మిగులులో వున్న టీచర్లకు ఇతర సబ్జక్టులు బోధన కు బదలాయించడానికి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. బీఈడీలో గణితంతోపాటు ఆంగ్లం, తెలుగు మెథడాలజీ తీసుకున్నవారు, పీజీలో ఆంగ్లం, తెలుగు స్పెషలైజేషన్‌తో పీజీ పూర్తిచేసిన స్కూల్‌ అసిస్టెంట్లు ఆయా సబ్జక్టులు బోధనకు అర్హులని అధికారులు చెబుతున్నారు. అయితే ఏళ్ల తరబడి గణితం, సోషల్‌ బోధించే టీచర్లు ఒక్కసారిగా తెలుగు బోధించడం ఇబ్బందిగా వుంటుందని కొందరు టీచర్లు అంగీకరిస్తున్నారు. తరగతుల విలీనంతో భవిష్యత్తులో ప్రాఽథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయ పోస్టులు రద్దయినట్టేనని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. పాఠశాలల విలీనంతో 350 ఎస్జీటీ పోస్టులు, కర్నూలు జిల్లాకు అదనంగా కేటాయించిన పోస్టుల కోసం బదలాయించడం వల్ల మరో 156 ఎస్జీటీ పోస్టులు రద్దయ్యాయని గుర్తుచేస్తున్నారు. రేషనలైజేషన్‌, ఇతరత్రా మిగులు చూపించి 226 పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్‌లుగా బదలాయించడం వల్ల భవిష్యత్తులో చేపట్టబోయే డీఎస్సీలో ఆ మేరకు పోస్టుల్లో కోత పడుతుందని ఆరోపిస్తున్నారు. నూతన విద్యా విధానం అమలు పేరిట ప్రాథమిక, సెకండరీ విద్యలో ఉపాధ్యాయ పోస్టుల కోత లేదా రద్దు ద్వారా ప్రైవేటు విద్యకు ప్రభుత్వం తలుపులు తెరుస్తోందని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇


*📚✍️ఖజానా ఖాళీ✍️📚*

*♦️ఆర్బీఐకే రాష్ట్ర ప్రభుత్వం 2,000 కోట్లు బాకీ*

*♦️ప్రతినెలా ఉద్యోగుల జీతాల కోసం అప్పులు*

*♦️ఆర్బీఐ దగ్గర 4,535 కోట్ల రుణం.. సర్కారు ఆదాయం ఎటు పోతుందో?*

*🌻అమరావతి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి)*: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందని ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ బయట అధికార పార్టీ నేతలూ ఇవే గొప్పలు చెప్పారు. అయితే, ప్రస్తుతం రాష్ట్ర ఖజానా ఖాళీ. పైసా కూడా లేదు. ఈ నెలలో 15 రోజులు గడిచాయి. సొంత పన్నులు, కేంద్ర గ్రాంట్ల ద్వారా, కేంద్ర పన్నుల్లో వాటా, రెవెన్యూ లోటు గ్రాంటు కింద వచ్చిన వేల కోట్లు ఎటు పోయాయన్నది ప్రశ్నార్ధకం. ఖజానాలో చిల్లి గవ్వ లేకపోగా ఆర్బీఐకే జగన్ సర్కారు ఇంకా రూ.2,000 కోట్లు బాకీ ఉంది. ఈ నెల మొదటి వారంలో దసరా పండుగ ఉన్నా ఉద్యోగులకు సకాలంలో జీతా లు ఇవ్వ లేదు. 1వ తేదీ జీతాలు ఇవ్వడంలో ఈ నెల కూడా విఫలమైంది. ఆ సమయంలో ఆర్బీఐ నుంచి ప్రభుత్వం రూ.2,535 కోట్లు వేజ్ అండ్ మీన్స్ అప్పు, రూ.2,000 కోట్లు ఓడీ అప్పు తీసుకుంది. అంటే.. ఆర్బీఐ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.4.535 కోట్ల అప్పు తీసుకుంది. దీన్ని చెల్లించడంలో విఫలమవుతోంది. అతికష్టమ్మీద రూ.2,535 కోట్ల అప్పును చెల్లించింది. శుక్రవారం నాటికి ఆర్బీఐకి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం రూ.2,000 కోట్లు అప్పు చెల్లించాల్సి ఉంది. ఆర్బీఐ వద్ద తీసుకున్న అప్పుపై వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు దాదాపు రూ.11,000 కోట్ల పైచిలుకు ఆదాయం వస్తోంది. ఉద్యోగుల జీతభత్యాలు, అవ్వాతాతల పెన్షన్లు, అప్పుల అసలు, వడ్డీల చెల్లింపులకు, ఇతర అత్యవసర ఖర్చులకు ఈ ఆదాయం సరి పోతుంది. కానీ ప్రభుత్వం ఇవి చెల్లించేందుకు కూడా అప్పులపైనే ఆధారపడుతోంది. ప్రతినెలా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే అప్పులు చేయక తప్పని పరిస్థితి. అప్పు పుట్టే వరకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ఆపుతున్నారు. అందుకు అక్టోబరు నెలే ఉదాహరణ. ఖజానాలో జమ అవుతున్న డబ్బుతో ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వొచ్చు. అయితే ఖజానాలో చిల్లి గవ్వ కూడా ఉండడం లేదు. వేజ్ అండ్ మీన్స్, ఓడీ అప్పులతో నెట్టుకొస్తోంది. ఖజానాలో డబ్బు లేనప్పుడే ఆర్బీఐ నుంచి ఈ అప్పులు తీసుకుంటుంది. రాష్ట్ర ఖజానాకు వస్తున్న వేల కోట్ల ఆదాయం ఎటు పోతోందో? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి అని ఇటీవల కాగ్ నివేదికలోనూ, ప్రముఖ రేటింగ్స్ సంస్థ క్రిసిల్ నివేదికలోనూ వెల్లడించాయి. ఏపీ ప్రభుత్వం పరిమితికి మించి 73 శాతం అధికంగా వేజ్ అండ్ మీన్స్ అప్పులు వాడిందని కాగ్ పేర్కొంది. ఇలా వేజ్ అండ్ మీన్స్ అప్పులపై విపరీతంగా ఆధారప డడం బలహీన ఆర్ధిక వ్యవస్థకు సంకేతమని క్రిసిల్ ఏపీసీఆర్డీఏ బాండ్ల రేటింగ్ తగ్గిస్తూ ఇచ్చిన నివేదికలో పేర్కొంది.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!