AP MDM: JAGANANNA GORUMUDDA IMPLEMENTATION LATEST INSTRUCTIONS BY DEO ELURU

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

AP MDM JAGANANNA GORUMUDDA IMPLEMENTATION LATEST INSTRUCTIONS BY DEO ELURU

జిల్లా విద్యాశాఖాధికారి ఏలూరు జిల్లా, ఏలూరు వారి ఉత్తర్వులు
Rc. No. SPL / B2 /2023-MDM,
పాఠశాలల యందు
మధ్యాహ్న భోజనము విద్యార్థులకు అందించు విషయములో గమనించిన
తప్పిదములను అనుసరించి తగిన సూచనలు జారీ చేయుట గురించి.
విషయము:- మధ్యాహ్న భోజన పథకం, ఏలూరు జిల్లా, ఏలూరు
సూచిక:- దిన పత్రికలలో ప్రచురితమవుచున్న వార్తలను అనుసరించి.
తేది: 01-11-2023

మధ్యాహ్నా భోజనము విషయమై పాఠశాలల యందు అనేక తప్పిదములు జరుగుచున్నందున
వివిధ దినపత్రికల యందు వార్తలు ప్రచురించబడుచున్నవి. దీని విషయమై అనేక మార్లు
పర్యవేక్షణాధికారుల ద్వారా అనేక పర్యాయములు వివిధ అంశముల పై సూచనలు జారీ చేయబడినను
కొంత మంది ప్రధానోపాధ్యాయులు సదరు సూచనలను పెడ చెవిన పెట్టి వారి సొంత నిర్ణయముల ప్రకారము
ఆహారము వండించుచున్నారు. అట్లు చేయుట మద్యాహ్న భోజన పథకము తప్పు దారి పట్టించుట గా
భావించవలసి వచ్చుచున్నది.
కావున జిల్లా యందుగల అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ క్రింద నుదహరించిన
అంశములను ద్రష్టి యందు ఉంచుకుని మధ్యాహ్న భోజన పథకము తూచా తప్పకుండ పాటించి
నిర్వహించవలెను.


1. పాఠశాల పని చేయు దినమున ప్రభుత్వము వారి నిర్ణయము మేరకు నిర్దేశించిన మెనూ
మాత్రమె పాటించి వంటలు చేయించవలెను.
2. విద్యార్ధులకు కోడిగుడ్లు ఇచ్చు విషయమై నిర్ణీత సమయమును అనుసరించి ఉడికించి గుడ్డు పై
పెంకు తీసిన పిదప మాత్రమే అందించవలెను. గుడ్డు యందు చెడు వాసన కాని, నల్ల మచ్చ
కానీ కనిపించిన యెడల అవి విద్యార్దులకు వడ్డించరాదు. కోడిగుడ్లు ప్రతి నెల నాలుగు దఫాలుగా
సరఫరా చేయబడును కాన సదరు పాఠశాల రోలు ను అనుసరించి వారమునకు కావలసినంత
మేర గుడ్లు మాత్రమే తీసుకొనవలెను. వీటిని రిజిస్టర్ నందు నమోదు చేయవలెను. ప్రతి రోజు
విద్యార్ధులకు ఇచ్చిన వివరములు కూడా నమోదు చేసి సంతకము చేయవలెను.
3. చిక్కి విషయమై సరఫరాదారుడు తెచ్చిన వెంటనే సదరు చిక్కి ప్యాకెట్ ల పై ముద్రించబడిన
తయారి తేది గమనించి దాని ననుసరించి రెండు నెలల లోపుగా చిక్కి లను విద్యార్థులకు
అందించవలెను. గడువు దాటిన చిక్కిలను విద్యార్ధులకు ఇవ్వరాదు. అట్లు గడువు దాటిన
చిక్కిలను సరఫరాదారునకు ఇచ్చివేయవలెను వాని స్థానే కొత్తవి తీసుకొనవలెను. వీటిని కూడా

రిజిస్టర్ నందు నమోదు చేయవలెను ప్రతి రోజు విద్యార్థులకు ఇచ్చిన వివరములు కూడా
నమోదు చేసి సంతకము చేయవలెను.
4. రాగి జావ వారములో మూడు రోజులు విద్యార్థులకు అందించ వలసి ఉన్నది. ఈ విషయమై
కూడ అనేక మంది ప్రధానోపాధ్యాయులు పూర్తి స్థాయి పర్యవేక్షణ చేయక అధిక సంఖ్య
పాఠశాలలలో కేవలము హాజరు లో సగము మంది మాత్రమే రాగి జావ తాగుచున్నట్లు
ఫిర్యాదులు అందుచున్నవి ఇది కేవలం ప్రధానోపాధ్యాయులు లేదా వారి స్థానే పర్యవేక్షించుచున్న
ఉపాధ్యాయులు భాద్యత వహించి పర్యవేక్షించవలసినదిగా సూచించడమైనది.
చాలా పాఠశాలల యందు హాజరును బట్టి కోడిగుడ్లు తినని విద్యార్థులకు కూడా కోడిగుడ్లు
ఇచున్నట్లు మరియు కొన్ని చోట్ల హాజరైన విద్యార్ధులలో కొంతమందికి మాత్రమే గుడ్లు
ఇచ్చుచున్నట్లు, సక్రమముగా విద్యార్ధులకు అందించుటలో కొంత నిర్లక్ష వైఖరి గమనించి విద్యార్దుల
తల్లిదండ్రుల ఫోన్ ద్వారా సమాచారము ఈ కార్యాలయమునకు ఫిర్యాదు చేయుచున్నారు. కొన్ని
పాఠశాలల నుండి వంటవారు (CCH) లేదా వారి సహాయకులు కోడిగుడ్లు వారి సొంతమునకు
తీసుకొనుపోవుచున్నట్లు కూడా గమనించబడినది. అట్లు గమనించిన విషయము నిర్ధారణ అయిన ఎడల
వంటవారిని వారి సహాయకులను ఎట్టి నోటీసు లేకుండా పని నుంచి తొలగించు అధికారము
ప్రధానోపాధ్యాయులు / పాఠశాల కమిటి / MEO వారికి కలదు.
ప్రతి నెల బియ్యము, కోడిగుడ్లు, చిక్కి, రాగి జావ ఇండెంట్ లు నిర్ణీత సమయమునకు IMMS
APP ద్వారా UPLOAD చేయవలెను. MDM / TMF నకు సంబందించిన అన్ని రిజిస్టర్ లు రికార్డు లు
నిర్ణీత స్థాయిలో నిర్వహించి ప్రధానోపాధ్యాయుల సంతకము చేయవలెను. కోడిగుడ్లు, చిక్కి లకు చెందిన
రశీదులు స్టాక్ అందిన వెంటనే GENERATE చేయవలెను లేని ఎడల దానికి భాద్యత పాఠశాలల
ప్రధానోపాధ్యాయులు వహించవలెను.
ఈ పై సమాచారము యావత్తు తనిఖి అధికారులు అందరు అన్ని పాఠశాలలకు పంపవలసినదిగా
ఆదేశించడమైనది. దీని పై అలసత్వము వహించకూడదని తెలియజేయడమైనది. అట్లు చేసిన యెడల
అధికారులు తీసుకొను నిర్ణయమునకు భాద్యులగుదురు.
అనుమతితో

పి. శ్యామ్ సుందర్
జిల్లా విద్యాశాఖాధికారి,
ఏలూరు జిల్లా ఏలూరు

Join Our WhatsApp Group

Join Our Groups

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!