FA1 EXAMS CBA PATTERN INSTRUCTIONS IN TELUGU
జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు :: ప్రకాశం జిల్లా
ఎఫ్ ఏ1 నిర్వహణకు సూచనలు
> జిల్లా లోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో మరియు ప్రవేట్ యాజమాన్య పాఠశాలలలో ఎస్ సి ఈ ఆర్ టి
వారి ద్వారా జారీ చేయబడ్డ ప్రశ్నాపత్రాలతో మాత్రమే తేదీ 02.11.2022 నుండి ఎఫ్ ఏ 1 పరీక్షలు నిర్వహించాలి.
> ఈ విద్యా సంవత్సరం 1 వ తరగతి నుండి 8 తరగతి వరకు గల విద్యార్థులకు క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ (CBA)
నిర్వహించడం జరుగుతుంది. 9వ మరియు 10వ తరగతుల విద్యార్థులకు, గతంలో మాదిరిగానే ఎఫ్ ఏ 1 పరీక్షలు
నిర్వహించడం జరుగుతుంది.
> క్లాస్ రూమ్ బెస్ట్ అసెస్మెంట్ కు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల విద్యార్థులకు ప్రశ్నా పత్రంతో పాటు ఓ ఏం ఆర్ సీట్
ఇవ్వడం జరుగుతుంది. ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల విద్యార్ధులకు కేవలం ప్రశ్నా పత్రములు మాత్రమే
ఇవ్వబడతాయి. ఓ ఏం ఆర్ లు ఇవ్వబడవు.
> ప్రశ్నా పత్రంలో ఆర్థిక్టివ్ తరహా ప్రశ్నలతో పాటు డిస్క్రిప్టవ్ తరహా ప్రశ్నలు కూడా ఇవ్వబడతాయి. విద్యార్థులు
జవాబులను ప్రశ్నా పత్రం లోనే టిక్ చేయాలి మరియు వ్రాయాలి. మరియు ఓ ఏం ఆర్ నందు బబుల్ చేయాలి.
> అన్ని పరీక్షలకు కలిపి ఒక ఓ ఏం ఆర్ షీట్ ఇవ్వబడుతుంది. కనుక ప్రతిరోజూ పరీక. పూర్తైన వెంటనే విద్యార్ధులనుండి
ప్రశ్నాపత్రంతో పాటు ఓ ఏం ఆర్ షీట్ కూడా వెనుకకు తీసుకోవాలి.
> పరీక్షలు అన్ని పూర్తైన వెంటనే ఓ ఏం ఆర్ పీట్స్ అన్నింటిని సబ్జెక్టు వారీగా, తరగతి వారీగా వేరు చేసి వేరు వేరు
పాలిథిన్ కవర్స్ నందు ఉంచి, ప్యాక్ చేసి సి ఆర్ పి ద్వారా మండల విద్యాశాఖాధికారి వారి కార్యాలయానికి పంపాలి.
> మండల విద్యాశాఖాధికారి తన మండలంలోని అన్ని పాఠశాలల ఓ ఏం ఆర్ పీట్స్ పాకెట్స్ సేకరించి జిల్లా ఉమ్మడి
పరీక్షల బోర్డు కార్యాలయానికి పంపాలి.
> ఓ ఏం ఆర్ షీట్స్ ను జిల్లా స్థాయిలో స్కాన్ చేయించడం జరుగుతుంది. ఓ ఏం ఆర్ నందు విద్యార్ధులు పొందిన
మార్కుల వివరాలు పాఠశాలలకు తెలియజేయబడవు. అవి కవలం విద్యార్థుల స్థాయిని అంచనావేసి భవిష్యత్తులో
ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ఇవ్వవలసిన శిక్షణా కార్యక్రమాల రూపకల్పనకు మాత్రమే వినియోగించడం
జరుగుతుంది.
> ఉపాద్యాయులు విద్యార్థుల వద్ద నుండి ప్రతి రోజు పరీక్ష తదనంతరం వెనుకకు సీకరించిన జవాబులతో కూడిన ప్రశ్న
పత్రములలోని జవాబులను దిద్దాలి. విద్యార్థులు పొందిన మార్కులను సంబంధిత రిజిస్టర్లు నందు నమోదు చేయడంతో
పాటు నిర్ణీత సమయం లోపల సి ఎస్ సి సైట్ నందు ఎంటర్ చేయాలి. జవాబులతో కూడిన ప్రశ్నా పత్రాలను తనిఖీ
అధికారుల పరిశీలనార్థం భద్రపరచాలి.
* విద్యార్థులు పొందిన మార్కులను ప్రోగ్రెస్ కార్డులందు నమోదుచేసి విద్యార్థుల తల్లిదండ్రులకు పంపాలి. తక్కువ ప్రతిభ
చూపిన విద్యార్ధులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఉపాధ్యాయుల మరియు తల్లిదండ్రుల సమీక్షా సమావేశంలో ఎఫ్ ఏ 1
నందు విద్యార్థులు చూపిన ప్రతిభపై చర్చించాలి.
జిల్లా విద్యాశాఖాధికారి
ప్రకాశం జిల్లా