EMRS 10391 POSTS RECRUITMENT APPLY DATE EXTENDED
దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల(EMRS)లో ఖాళీగా ఉన్న 10,391 బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు గడువు పెరిగింది. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని స్వయంప్రతిపత్తి సంస్థ- నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (నెస్ట్స్) నియామక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల దరఖాస్తులు పొడిగించినట్లు నెస్ట్స్ ఓ ప్రకటనలో తెలియజేసింది. ప్రిన్సిపల్/ పీజీటీ/ జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్/ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు- జులై 31; 6,329 టీజీటీ/ హాస్టల్ వార్డెన్ పోస్టులకు- ఆగస్టు 18న దరఖాస్తు ప్రక్రియ ముగియగా తాజాగా గడువు పొడిగించారు. డిగ్రీ, డిప్లొమా, పీజీ, డీఈడీ, బీఈడీ, సీటెట్ తదితర విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 19వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని నెస్ట్స్(NESTS) తెలిపింది. ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్-2023, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.