APPSC: Initial keys – APPSC – Schedule – III (09th Nov 2022 to 11th Nov 2022 )_Assistant Conservator of Forests in A.P. Forest Service -Notification No.04/2022
ఏపీ ఫారెస్ట్ సర్వీస్‌లో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఉద్యోగాల భర్తీకి నవంబరు 9 నుంచి 11 వరకు నియామక పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నవంబరు 16న విడుదల చేసింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా కమిషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచనుంది.
ఆన్సర్ కీపై అభ్యంతరాలకు అవకాశం ఇవ్వనున్నారు. నవంబరు 17 నుంచి 19 వరకు ఏమైనా అభ్యంతరాలుంటే తెలపవచ్చు. ఆన్‌లైన్ విధానంలో మాత్రమే అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాట్సాప్, SMS, ఫోన్, ప్రత్యక్షంగా లేదా మరే ఇతర విధానాల్లో అభ్యంతరాలను స్వీకరించరని గమనించాలి. గడువులోగా నమోదుచేసిన అభ్యంతరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించరు.
అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆన్సర్ కీ:-
General Studies & Mental ability
General English and General Telugu
ఏపీ ఫారెస్ట్ సర్వీస్‌లో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 20 నుంచి మే వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అభ్యర్థులకు నవంబరు 9 నుంచి 11 వరకు నియామక పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని ఏపీపీఎస్సీ తాజాగా వెల్లడించింది. ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత ఫైనల్ కీతోపాటు ఫలితాలను కూడా కమిషన్ వెల్లడించనుంది.