Guidelines for Conduct of FARMATIVE ASSESSMENT-II (FA 2) in AP schools

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

Guidelines for Conduct of FARMATIVE ASSESSMENT-II (FA 2) in AP schools: Here Guidelines Released by D.E.O SRI POTTI SRIRAMULU NELLORE DISTRIfor Conduct of FARMATIVE ASSESSMENT-II (FA 2) in AP schools

Guidelines for Conduct of FARMATIVE ASSESSMENT-II (FA 2) in AP schools

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యవర్తనాలు


ప్రస్తుతము: శ్రీమతి. R. S. గంగా భవాని, M.Sc., B.Ed.

Rc. No: 2/Exe/DCEB/2023-24,04.10.2023

విషయము : 2023-24 విద్యా సంవత్సరంలో FA-II పరీక్షలు నిర్వహణ గురించి సూచనలు- అనంతరం
కార్యక్రమములు – – తెలియజేయుట

పై సూచికల ప్రకారం ఈ విద్యా సంవత్సరం 2023-24 నందు FA-II పరీక్షల యొక్క 1 – 10 తరగతుల
ప్రశ్నాపత్రములను SCERT AP వారు online ద్వారా ఏ రోజు కారోజు పంపుతారు. ఆ ప్రశ్న పత్రములను వెంటనే జిల్లాలోని అన్ని whatsapp గ్రూపుల ద్వారా షేర్ చేయడం జరుగుతుంది. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అవసరమైన
ప్రశ్నాపత్రంలను ప్రింట్ చేయించి లేక డిక్టేట్ చేయడం ద్వారా వారి తరగతులలో పరీక్షలు నిర్వహించాలి.


సూచిక:-

1. కమిషనరు, పాఠశాల విద్యాశాఖ, అమరావతి వారి కార్యవర్తనలు Rc. No: ESE 02/247/2023-SCERT
Date:27/02/2023


2. 2023-24 అకాడమిక్ కాలండర్ ను అనుసరించి

AP FORMATIVE ASSESSMENT-II TIME TABLE

AP FORMATIVE ASSESSMENT-II TIME TABLE

1. జిల్లా లోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో (1 నుండి 10 వ తరగతి వరకు) మరియు ప్రవేట్ యాజమాన్య
పాఠశాలలలో (6 నుండి 10 వ తరగతి వరకు) SCERT-AP వారి ద్వారా జారీ చేయబడ్డ ప్రశ్నా పత్రాలతో మాత్రమే తేదీ.
03.10.2023 నుండి FA-II పరీక్షలు నిర్వహించాలి.


2. 1 వ తరగతి నుండి 10 తరగతి వరకు గల విద్యార్థులకు ఇవ్వబడిన సిలబస్ నందు నిర్మాణాత్మక మూల్యాంకనము
(ఫార్మేటివ్ అసెస్మెంట్)-11 20 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది.


3. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల విద్యార్థులకు English Part-A, Part-B పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ప్రవేట్ యాజమాన్య పాఠశాలల విద్యార్థులకు English Part- A మాత్రమే.

మండల విద్యాశాఖాధికారి చేయవలసిన పనులు


4. FA-II సిలబస్, టైం టేబుల్ లను మండలంలోని అన్ని పాఠశాలలకు తెలియజేసి ఉపాధ్యాయులను, విద్యార్థులను సంసిద్ధం
చేయాలి చేయాలి.


5. పరీక్ష రోజులలో SCERT AP వారు పంపిన ప్రశ్నాపత్రములు మండల గ్రూపులో షేర్ చేస్తూ అన్ని పాఠశాలలకు చేరవేయాలి.


6. మీ మండలంలోని అన్ని పాఠశాలలలో, ఇచ్చిన సమయం ప్రకారం SCERT-AP వారు ఇచ్చిన ప్రశ్నాపత్రములతోనే పరీక్షలు సజావుగా నిర్వహించబడేటట్లు పర్యవేక్షణ చేయాలి.


7. పరీక్షలు అనంతరం తర్వాత రోజు ఉపాధ్యాయులందరూ మూల్యాంకనం చేయబడిన జవాబు పత్రములను విద్యార్థులకు ఇచ్చి తల్లిదండ్రులకు తెలియజేయునట్లుగా పర్యవేక్షించాలి.


పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు సూచనలు


8. మొదటగా పరీక్షల టైం టేబుల్, సిలబస్ లను విద్యార్థులకు తెలియచేసి, వారిని పరీక్షకు సంసిద్ధులుగా చేయవలెను.


9. ప్రతిరోజు విద్యాశాఖ అధికారి నుండి పంపబడి ప్రశ్నాపత్రములలో అవసరమైన ప్రశ్నాపత్రములను ప్రింట్ చేయించుకుని గాని,
లేక డిక్టేట్ చేయడం ద్వారా కానీ లేక డిజిటల్ ల్యాబ్ ఉపయోగించడం ద్వారా గాని, టైమ్ టేబుల్ లో ఇచ్చిన సమయంలోనే
ఖచ్చితముగా అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించాలి.


10. అన్ని తరగతుల వారికి ఏ సబ్జెక్ట్ పేపర్ కు అయినా టైం టేబుల్ లో ఇచ్చిన సమయం మాత్రమే అనుమతించాలి.


11. పరీక్షల అనంతరం 10 వ తేది లోగా ప్రతి తరగతి, ప్రతి సబ్జెక్టు నకు ఉపాధ్యాయులు KEY తయారు చేసుకుని జవాబులను
దిద్దాలి. విద్యార్థులు పొందిన మార్కులను సంబంధిత రిజిస్టర్లు నందు నమోదు చేయడంతో పాటు, నిర్ణీత సమయం లోపల
CSE సైట్ నందు ఎంటర్ చేయాలి. జవాబులతో కూడిన ప్రశ్నా పత్రాలను తనిఖీ అధికారుల పరిశీలనార్ధం భద్రపరచాలి.


12. 10వ తేదిన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి FA-II నందు విద్యార్థులు చూపిన ప్రతిభపై చర్చించాలి.
విద్యార్థులు పొందిన మార్కులను ప్రోగ్రెస్ కార్డులందు నమోదుచేసి విద్యార్థుల తల్లిదండ్రులకు పంపాలి. తక్కువ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.


ఉప విద్యా శాఖాధికారులు చేయవలసిన పనులు


13. పరీక్షల సమయంలో తమ తమ పరిధిలోని పాఠశాలలను సందర్శించి SCERT-AP వారు ఇచ్చిన ప్రశ్నాపత్రముల తోనే
టేబుల్ ప్రకారం పరీక్షలు నిర్వహించబడేటట్లు పర్యవేక్షించాలి.


14. పదవ తరగతి విద్యార్ధుల యొక్క ప్రస్తుత స్థాయిని, పరీక్షల పనితీరును గురించి చర్చించి, నూరు శాతం ఉత్తీర్ణత కొరకు ఉపాధ్యాయులకు సలహాలను ఇచ్చి పర్యవేక్షించాలి.


15. పరీక్షలు అనంతరం ప్రతి పాఠశాలలోనూ తల్లిదండ్రులు సమావేశం జరుగునట్లుగా పర్యవేక్షించాలి.

జిల్లా విద్యాఖాధికారి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

FOR REGULAR UPDATES JOIN OUR WHATSAPP CHANNEL

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!