స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దేశ రాజధాని దిల్లీలోని దిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అర్హతలున్న అభ్యర్థులు సెప్టెంబర్ 30వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు:
కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్)- పురుషులు: 5,056 పోస్టులు (జనరల్- 3053, ఈడబ్ల్యూఎస్- 542, ఓబీసీ- 287, ఎస్సీ- 872, ఎస్టీ- 302)
కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్)- మహిళలు: 2,491 పోస్టులు (జనరల్- 1502, ఈడబ్ల్యూఎస్- 268, ఓబీసీ- 142, ఎస్సీ- 429, ఎస్టీ- 150)
అర్హత: 10+2 (సీనియర్ సెకండరీ) ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్(ఎల్ఎంవీ) కలిగి ఉండాలి.
జీత భత్యాలు: పే లెవల్-3 (రూ.21,700-రూ.69,100)
దరఖాస్తు రుసుము: రూ.100 (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు)
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్(పీఎంటీ), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: ఆబ్జెక్టివ్ టైప్‌లో 100 మార్కులు 100 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్/ కరెంట్ అఫైర్స్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, వెబ్ బ్రౌజింగ్ తదితర
అంశాల్లో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పరీక్షా కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
ముఖ్యమైన తేదీలు…
ఆన్లైన్ దరఖాస్తులు: 01-09-2023 నుంచి 30-09-2023 వరకు.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేది: 30-09-2023
ఆన్లైన్ ఫీజు చెల్లింపు చివరి తేది: 30-09-2023
దరఖాస్తు సవరణ తేదీలు: 03, 04-10-2023.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: 2023, డిసెంబర్లో ఉంటాయి.
CLICK HERE TO DOWNLOAD NOTIFICATION