India Post Recruitment: ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా వేర్వేరు సర్కిళ్లల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో (Post Office Jobs) 38,926 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపుగా ముగిసింది. ఇక పలు పోస్టల్ సర్కిళ్లల్లో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి.
తాజాగా చెన్నైలోని మెయిల్ మోటార్ సర్వీస్‌లో స్టాఫ్ కార్ డ్రైవర్ (Staff Car Driver) పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 16 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేయడానికి ఆగస్ట్ 12 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు పామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి, నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి. అభ్యర్థులు పూర్తి వివరాలను https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
- చెన్నై సిటీ రీజియన్- 6
- సెంట్రల్ రీజియన్- 10
ముఖ్య సమాచారం:
- విద్యార్హతలు: 10వ తరగతి పాస్ కావాలి. హెవీ మోటార్ వెహికిల్, లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్ తప్పనిసరి. డ్రైవింగ్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి. మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి.
- వయస్సు: 56 ఏళ్ల లోపు ఉండాలి.
- ఎంపిక విధానం: రాతపరీక్ష లేదా స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
- దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్ట్ 12, 2022
- దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: the Senior Manager (JAG), Mail Motor Service, No 37, Greams Road, Chennai 600 006
అప్లయ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి