BIS Recruitment 2022: బ్యూరో ఆఫ్ ఇండియణ్ స్టాండర్డ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జోరీ చేసింది. నోటిఫికేషన్లో భాగంగా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?
BIS Recruitment 2022: బ్యూరో ఆఫ్ ఇండియణ్ స్టాండర్డ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జోరీ చేసింది. నోటిఫికేషన్లో భాగంగా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 100 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* అభ్యర్థులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ లేదా బీఈ, బీటెక్(ఈఈఈ/ ఎఫ్‌సీటీ/ ఎంసీఎం). పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, ఎంఫిల్, ఎంటెక్, ఎంఎస్, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పసరిగా ఉండాలి.
* అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన వారికి నెలకు రూ. 50,000 జీతంగా చెల్లిస్తారు.
* ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న బీఐఎస్ కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుంది.