voter card linked with aadhar card: the last date is April 1-2023

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

దేశంలో ఓటర్ల జాబితాలో పేరున్న ప్రతి ఒక్కరూ 2023 ఏప్రిల్‌ 1లోగా తమ పేరును ఆధార్‌ నంబర్‌తో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజీజు తెలిపారు. గురువారం ఆయన రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. తాజాగా సవరించిన ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ 6బి ఫారం ద్వారా తమ ఆధార్‌ నంబర్‌ను సంబంధిత ఎన్నికల రిజిస్ట్రేషన్‌ అధికారికి తెలపాలన్నారు. ఇది ఐచ్ఛికమని(ఆప్షనల్‌), ఒకవేళ ఎవరికైనా ఆధార్‌ నంబర్‌ లేకపోతే ఇతర డాక్యుమెంట్లను 6బి ఫారం ద్వారా సమర్పించవచ్చని చెప్పారు.

error: Content is protected !!