యూజీ, పీజీ, పీహెచ్డీ వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలు
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వ్యవసాయ కోర్సుల్లో యూజీ, పీజీ, జేఆర్ఎఫ్/ ఎస్ఆర్ఎఫ్, పీహెచ్డీ ప్రవేశాల కోసం నిర్వహించే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్(ఐకార్) ఆలిండియా ఎంట్రెన్స్ ఎగ్జామ్(ఏఐఈఈఏ) 2022-23 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పరీక్ష ద్వారా 75 అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఇందులో 64 రాష్ట్రీయ వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చరల్, ఫిషరీస్ యూనివర్సిటీలు, 4 ఐసీఏఆర్ డీమ్డ్ యూనివర్సిటీలు, 3 సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలు, 4 సెంట్రల్ యూనివర్సిటీల్లోని వ్యవసాయ కోర్సుల్లో డిగ్రీ, పీజీ, ఏఐసీఈ జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్డీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
వివరాలు…
* ఐకార్- ఆలిండియా ఎంట్రెన్స్ ఎగ్జామ్(ఏఐఈఈఏ)- 2022-23 ద్వారా బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, జేఆర్ఎఫ్/ ఎస్ఆర్ఎఫ్(పీహెచ్డీ) కోర్సుల్లో ప్రవేశాలు
అర్హత: యూజీ కోర్సులకు ఇంటర్/ 10+2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మిగిలిన కోర్సులకు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 31.08.2022 నాటికి అభ్యర్థుల కనీస వయసు యూజీకి 16 ఏళ్లు, పీజీకి 19, పీహెచ్‌డీకి 20 ఏళ్లు నిండి ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. యూజీ కోర్సులకు సంబంధించి దేశవ్యాప్తంగా 178 నగరాలు, మిగిలినవాటికి 89 నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
పరీక్ష వ్యవధి: 150 నిమిషాలు(యూజీ), 120 నిమిషాలు(పీజీ, పీహెచ్డీ).
దరఖాస్తు ఫీజు:
బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రాం: రూ.800(ఓబీసీలు రూ.770, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ థర్డ్ జెండర్లు రూ.400 చెల్లించాలి)
మాస్టర్ డిగ్రీ ప్రోగ్రాం: రూ.1150(ఓబీసీలు రూ.1120, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ థర్డ్ జెండర్లు రూ.570 చెల్లించాలి)
పీహెచ్డీ ప్రోగ్రాం: రూ.1850(ఓబీసీలు రూ.1820, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ థర్డ్ జెండర్లు రూ.920 చెల్లించాలి)
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: 20.07.2022 నుంచి 19.08.2022 వరకు.
దరఖాస్తులో మార్పులు చేసుకునే తేదీలు: 21.08.2022 నుంచి 23.08.2022 వరకు.
UG LINKS
PG LINKS
Ph.d LINKS