BIS Admitcard: బీఐఎస్ పరీక్ష అడ్మిట్ కార్డులు రిలీజ్
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌లో మొత్తం 276 పోస్టుల భర్తీకి ఏప్రిల్ 16న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి దేశవ్యాప్తంగా సెప్టెంబరు 3న ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహించనున్నారు.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌లో అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్ష హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ వివరాలు సమర్పించి హాల్‌టికెట్లు పొందవచ్చు.