AP ASSISTANT AND ASSOCIATE PROFESSORS RECRUITMENT 2023 FOR 3295 POSTS
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. భారీగా ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్ ఆమోదముద్ర వేశారు. యూనివర్సిటీలు, రాజీవ్ ట్రిపుల్ ఐటీల్లో లెక్చరర్ల నియామకాలపై సమీక్ష చేసిన సీఎం.. కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 3295 పోస్టుల ను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యూనివర్సిటీల్లో పూర్తి స్థాయిలో రెగ్యులర్ సిబ్బంది నియామకాలు చేయాలని సీఎం ఆదేశించారు. యూనివర్సిటీల్లో 2635 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. రాజీవ్ ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం జగన్ అనుమతించారు. వీటిలో లెక్చరర్లు, ప్రొఫెసర్ల పోస్టులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయాలని సీఎం సూచించారు. ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్న వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు ఇంటర్వ్యూలో వెయిటేజ్ ఇవ్వాలని నిర్ణయించారు. యూనివర్సిటీల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలంటే పూర్తిస్థాయిలో ఖాళీలన్నీ భర్తీ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
AP ASSISTANT AND ASSOCIATE PROFESSORS RECRUITMENT 2023 FOR 3295 POSTS SCHEDULE
ఉద్యోగాల భర్తీకి షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ద్వారా మొత్తం ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీకి ఆగష్టు 23 న నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఒకేసారి 3295 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. సెప్టెంబరు 3, 4 వారాల్లో ఏపీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌లో పరీక్షలు జరగనున్నాయి. అక్టోబరు 10 వ తేదీకల్లా పరీక్షా ఫలితాలు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆన్ లైన్‌లో పరీక్షల ఫలితాలు విడుదల తర్వాత నెల రోజుల్లో ఇంటర్వ్యూలు జరుపనున్నారు. మొత్తం ప్రక్రియను నవంబరు 15 నాటికి పూర్తి చేసి అదే రోజు ఎంపికైన అభ్యర్ధుల జాబితాను యూనివర్సిటీల వారీగా ప్రకటించనున్నారు.