APUTF Released information NOTE: SEP 1,2022 AP EDUCATION MINTISTER CONFERANCE WITH TEACHER UNIOUNS DISCUSS ON IMPORTANT ISSUES OF TEACHERS

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
APUTF PRESS NOTE: SEP 1,2022 AP EDUCATION MINTISTER CONFERANCE WITH TEACHER UNIOUNS DISCUSS ON IMPORTANT ISSUES
APUTF PRESS NOTE: SEP 1,2022 AP EDUCATION MINTISTER CONFERANCE WITH TEACHER UNIOUNS DISCUSS ON IMPORTANT ISSUES


తాజా సమాచారం తేది: 01.09.2022
గౌ॥ విద్యాశాఖ మంత్రితో ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో చర్చించిన అంశాలు :
ఈ రోజు విద్యాశాఖ మంత్రి గౌ బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ మరియు
పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ సురేష్‌ గార్లతో గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల సమావేశం జరిగింది. ఈ
సమావేశంలో సర్విస్‌ రూల్స్‌, మండల విద్యాశాఖాధికారి పోస్టుల భర్తీ యాప్‌ల సమస్యలు, బదిలీలు, ప్రమోషన్లు,
మున్సిపల్‌ టీచర్ల సమస్యలపై చర్చించడం జరిగింది.
సర్వీస్ రూల్స్
సర్వీస్‌ రూల్స్‌ సమస్య హైకోర్టు పరిధిలో ఉన్నందున ఎంఇఓ, డివైఇఓ పోస్టులు భర్తీ చేయలేకపోవడం వల్ల పాఠశాల
పర్యవేక్షణ కుంటుపడుతున్నదని, ఈ సమస్య ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి పరిష్కారం కనుగొనాలని ముఖ్యమంత్రి
ఆదేశించినట్లు తెలియజేసారు. దీనిపై జరిగిన చర్చలో రాష్ట్రంలో జిల్లా పరిషత్‌ ఉపాధ్యాయులు, లక్ష యాఖభైవేలమంది
ఉండగా ప్రభుత్వ ఉపాధ్యాయులు వేలు మాత్రమే ఉన్నారని, కాని పర్యవేక్షణాధికారుల పోస్టులు మొత్తం ప్రభుత్వ ఉ
పాధ్యాయులకే కావాలని పట్టుబట్టడం వల్ల సర్వీస్‌ రూల్స్‌ సమస్య పరిష్కారం కావడం లేదని, దీనికి ప్రభుత్వమే చారవ
చూపి పరిష్కారం కనుగొనాలని వచ్చింది. ప్రభుత్వ, పంచాయితీరాజ్‌ ఉపాధ్యాయ సంఘాలు ఏదో ఒక పరిష్కారానికి
రావాలని, లేకుంటే ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయం ప్రకారం ముందుకెళుతుందని మంత్రి చెప్పడం జరిగింది.
మండల విద్యాశాఖాధికారుల పోస్సల భర్తీ :
రాష్ట్రంలో ఉన్న 672 ఎంఇఓ పోస్టులకు గాను ప్రస్తుతం 424మంది పనిచేస్తున్నారు. వీరిలో 18మంది మాత్రమే
ప్రభుత్వ ఉపాధ్యాయులు. మిగిలిన 411మంది జిల్లా పరిషత్‌ ఉపాధ్యాయులు. ఖాళీగా వున్న 248 ఎంఇఓ పోస్టులు
సర్విస్‌ రూల్స్‌ కోర్టు పరిధిలో ఉన్నందున భర్తీ చేసే అవకాశం లేదు. ముఖ్యమంత్రి ఎంఇఓ పోస్టులన్నీ తక్షణమే భర్తీ
చేయాలన్నందున ఖాళీగా ఉన్న 248 ఎంఇఓ పోస్టులను హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుల ను ఎఫ్‌ఏసిలుగా నియమించి
భర్తీ చేయాలని నిర్ణయించారు.
గడిచిన 2 సం॥లుగా మండలాల్లో 2వ ఎంఇఓ పోస్టు మంజూరు చేయాలని జరుగుతున్న చర్చకు ముఖ్య మంత్రి
కూడా అంగీకారం తెలపడంతో మరో 672 ఎంఇఓ పోస్టులు మంజూరు చేస్తున్నారు. ఈ మొత్తం పోస్టులన్నీ ఎఫ్‌ఏసిలను
నియమించి తాత్కాలికంగా భర్తీ చేస్తారు.

ఖాళీగా ఉన్న 248 ఎంఇఓ పోస్టులు ప్రభుత్వ టీచర్లకు, కొత్తగా మంజూరయ్యే 672 పోస్టులు జిల్లా పరిషత్‌ టీచర్లకు
కేటాయిస్తారు. కోర్టులో ఉన్న సర్వీస్‌ రూల్స్‌ సమస్య పరిష్కారమయ్యేవరకు ఈ పోస్టులలో ఎఫ్‌ఏసిలను నియమిస్తారు.
ఎంఇఓ పోస్టులు భర్తీలో ఏ మండలంలో పనిచేస్తున్న వారిని ఆ మండలంలోనే నియమిస్తారు.

గ్రేడ్‌ -1 హెడ్మాష్టర్లు : ప్రతి జిల్లాలో 1 లేదా 2 గ్రేడ్‌-1 హెడ్మాష్టర్లు మాత్రమే ఉన్నారని, 50సం॥లు పైబడి అన్ని
హంగులు కలిగి వందలాదిమంది విద్యార్థులతో హైస్కూల్స్‌ అనేకం ఉన్నాయని కాబట్టి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో
ఒక పాఠశాలకైనా గ్రేడ్‌-1 హెచ్‌ఎం పోస్టు మంజూరు చేయాలని కోరాము. దీనిపై ప్రతిపాదనలు ఇస్తే పరిశీలించి
మంజూరు చేస్తామని చెప్పారు.

డిప్యూటి ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ : ప్రస్తుతం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 75 డివైఇఓ పోస్టులలో 50% పోస్టులు (38)
ఏపిపిఎస్‌సి ద్వారా రిక్రూట్‌ చేస్తామని, మిగిలిన పోస్టులు భర్తీలో ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ టీచర్లు ఇరువురికి ప్రమోషన్లలో
అవకాశం కల్పిస్తామని తెలియజేసారు.
ప్రమోషన్స్,బదిలీలు:
రేషనలైజేషన్‌ వర్క్‌షాప్‌ జరుగుతున్నదని, సెప్టెంబర్‌ 5వ తేదీ తర్వాత ప్రమోషన్ల సంఖ్య తేల్చి ఆ తర్వాత బదిలీలు
చేపడతామని మంత్రి తెలియజేసారు. ఈ సంవత్సరం బదిలీలకు గరిష్ట పరిమితి 5 సం॥లు మాత్రమేనని తర్వాత జరిగేబదిలీలపై 8 స॥లు వునరుద్దరిస్తామని చెప్పారు. 8 సం॥లు కోసం సంఘాలు పట్టుబట్టినప్పటికి ఉపాధ్యాయుల కోరిక
మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
కర్నూలు జిల్లాకు కావలసిన 2800 పోస్టులు మిగిలిన జిల్లాల్లో వున్న సర్‌ ప్లస్‌ పోస్టుల నుండి కేటాయించి ప్రమోషన్లు
కల్పిస్తామన్నారు. మున్సిపల్‌ టీచర్లకు కూడా బదిలీలు, ప్రమోషన్లు కల్పించేందుకు అంగీకరించారు.
యాప్‌ల సమస్య :
ప్రభుత్వం ఇచ్చిన పరికరాలతోనే అటెండెన్స్‌ వేస్తామని ఉపాధ్యాయ సంఘాలు పట్టుబట్టినప్పటికి ఆర్థిక పరిస్థితుల
దృష్టా పరికరాలు సమకూర్చలేమని, ఉపాధ్యాయులు వారి స్వంత ఫోన్లలోనే హాజరు నమోదు చేయాలని మంత్రి విజ్ఞప్తి
చేసారు. స్వంత ఫోన్లలో హాజరు నమోదు చేయడం వల్ల పర్సనల్‌ డేటాకు ఎటువంటి ముప్పు కలుగదని, యాప్‌ను
సురక్షితంగా ఉండేలా తయారు చేసామని టెక్నికల్‌ అధికారులు చెప్పారు. దీనికి మంత్రి భరోసా ఇచ్చారు.
సిగ్నల్‌ సమస్య ఉందని, డేటా ఆన్‌ చేయకపోతే యాప్‌ పనిచేయడం లేదని, ఆఫ్‌లైన్‌లో హాజరు నమోదులో ఇబ్బందులు
ఉన్నాయని, లీవ్‌ మాడ్యూల్‌ జతపరచలేదని, ఆన్‌డ్యూటీ, డెప్యుటేషన్‌ వంటి సమస్యలు పరిష్కారం కాలేదని మంత్రి,
అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వీటన్నిటిని వెంటనే సరిచేస్తామని చెప్పారు. ఒకవేళ ఎవరి హాజరైన
నమోదు కావడంలో ఇబ్బంది కలిగితే వెంటనే తెలియజేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ ఇస్తారు. అలాగే టెన్నికల్‌ సమస్యలు
జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఏఎస్‌ఓలు కూడా పరిష్కరిస్తారు. ఉపాధ్యాయులు సెప్టెంబర్‌ 2వ తేదీ నుండి
యాప్‌లో హాజరు నమోదు చేయాలని, సమస్యల పరిష్కారానికి మరొక 15 రోజులు గడువు ఇస్తామని, అవసరమైతే
మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుందామని, ఎవరిపైనా ఎటువంటి చర్యలు చేపట్టబోమని తెలియజేసారు. ఉపాధ్యాయుల
హాజరును జీత భత్యాల చెల్లింపుతో ముడి పెట్టబోమని హామీ ఇచ్చారు.

ప్రభుత్వమే పరికరం సమకూర్చాలని ఎంతగా ఉపాధ్యాయ సంఘాలు పట్టుబట్టినా మంత్రి, అధికారులు అంగీకరించకపోగా
మరొ 15 రోజులు ఎటువంటి చర్యలు చేపట్టకుండా గడువు ఇస్తామని మాత్రమే చెప్పడం గమనార్హం. ఇప్పటికే
90%పైగా ఉపాధ్యాయులు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయగా, 40%మంది హాజరు నమోదు చేయడంతో అధికారులు వారి
వాదనకే కట్టుబడ్డారు.
మున్సిపల్‌ టీచర్ల సమస్యలు:
మున్సిపల్‌ టీచర్ల జీత భత్యాల చెల్లింపు, పర్యవేక్షణాధికారులు, ఇతర సమస్యలపై మంత్రికి ప్రాతినిధ్యం చేయడం
జరిగింది. పర్యవేక్షణాధికారుల ఫైల్‌ లీగల్‌ ఒపీనియన్‌కు పంపారు. ఫైల్‌ రాగానే హెడ్మాష్టర్లకు డిడిఓ అధికారాలు
ఇస్తారు. పాఠశాల విద్యాశాఖ బదలాయించి రెండు నెలలు గడిచినప్పటికి సమస్యలు పరిష్కారం కాలేదని, వెంటనే
పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరాము. సెప్టెంబర్‌ 10వ తేదీన విజయవాడలో జరిగే మున్సిపల్‌ టీచర్ల రాష్ట్ర
సదస్సుకు విద్యాశాఖ మంత్రి హాజరవుతారు.
ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్‌:
ఎయిడెడ్‌ నుండి ఇతర మేనేమెంట్లలోకి అబ్బ్దార్చ్‌ అయిన వారికి డిపార్ట్‌మెంట్‌ టెస్టులు విషయంలో ట్రెజరీ వారు
పెడుతున్న అభ్యంతరాలు పరిష్కరించాలని, 30 సం॥ల స్కేలు తీసుకున్న వారికి మాత్రమే ప్రమోషన్‌ పోస్టులో ఆటోమేటిక్‌
అడ్వాన్స్‌మెంట్‌ నిలుపుదల చేయాలని, 24 సం॥ల స్కేలు తీసుకున్న వారికి ప్రమోషన్‌ పోస్టులో ఏఏఎస్‌ అమలు
చేయాలని, 12/24 సం॥ల సర్వీస్‌ పూర్తి చేసేలోపల డిపార్ట్‌మెంట్‌ టెస్టులు పాస్‌ కాని వారికి, టెస్టులు పాసైన తేదీ నుండి
ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్మీమ్‌ అమలు చేయాలని విద్యాశాఖ కార్యదర్శి, జిఏడి ముఖ్య కార్యదర్శి, ఫైనాన్స్‌ సెక్రటరీకి
ప్రాతినిధ్యం చేయడం జరిగింది.
ఉపాధ్యాయులపై కేసులు :
సిపిఎస్‌ ఉద్యమాల నేపథ్యంలో గత నాలుగు రోజులుగా ఉపాధ్యాయులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించడం,
కేసులు నమోదు చేయడంపై విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఉపాధ్యాయులపై కేసులు తొలగించమని
ఆదేశిస్తామని మంత్రి చెప్పారు. రెండు రోజుల్లో సిపిఎస్‌పై మరో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలియజేసారు.

– యుటియఫ్‌ రాష్ట్ర కమిటీ


Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!