AP TET JULY 2024 NOTIFICATION RELEASED

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

ఏపీ టెట్ నోటిఫికేషన్ 2024 విడుదల, దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం ఎప్పటి నుంచంటే?

AP TET JULY 2024 NOTIFICATION  : ఏపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు మరోసారి టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఏపీ టెట్ కొత్త నోటిఫికేషన్ జులై1న  పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్  విడుదల చేశారు. జులై 2 నుంచి దరఖాస్తుల స్వీకరించనున్నారు. ఏపీ టెట్ (జులై)-2024 ఆన్లైన్ పరీక్షలకు సంబంధిన పూర్తి సమాచారం https://cse.ap.gov.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామన్నారు. టెట్ షెడ్యూల్, నోటిఫికేషన్స్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, సిలబస్, ఆన్లైన్ విధానంలో (CBT) జరిగే పరీక్షలు గురించి అభ్యర్థులకు తగిన సూచనలు, విధివిధానాలు అన్ని అధికారిక వెబ్ సైట్ త్వరలో ప్రకటిస్తామన్నారు. జులై 2 నుంచి అభ్యర్థులు ఈ వెబ్ సైట్ లో పూర్తి సమాచారం పొందవచ్చని తెలిపారు. ఇతర సమాచారం కోసం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆఫీసు హెల్ప్ డెస్క్ ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

AP TET  JULY 2024 NOTIFICATION RELEASED

మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ కు సన్నాహాలు

ఏపీలో ఎన్నికలకు ముందు టెట్  పరీక్షకు 2.35 లక్షల అభ్యర్థులు హాజరుకాగా, 1,37,903 మంది టెట్ అర్హత సాధించారు. అయితే కూటమి ప్రభుత్వం గతంలో ఇచ్చిన డీఎస్సీని రద్దు మెగా డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు కొత్తగా 16,347 టీచర్‌ పోస్టులతో మెగా డీఎస్సీ 2024 ప్రకటించింది. మెగా డీఎస్సీ నేపథ్యంలో తాజాగా బీఈడీ, డీఎడ్‌ పాసైన అభ్యర్థులతో పాటు ఇటీవల టెట్‌లో ఫెయిలైన వారికి మరో అవకాశం కల్పిస్తూ కొత్తగా టెట్‌ నిర్వహించాలని నిర్ణయించింది. టెట్‌ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ కల్పించనున్నారు.

పాత డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు జీవో విడుదల

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వంలో విడుదలైన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ జీవో నెం.256 జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వంలో 6,100 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఎన్నికల్లో కూటమి పార్టీలు విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఎన్నికల ప్రచారం ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి సంతకం మెగా డీఎస్సీపై పెట్టారు. ఈ నేపథ్యంలో పాత డీఎస్సీ నోటిఫికేషన్ ను ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. నేడో, రేపో 16,347 పోస్టులతో నూతన డీఎస్సీ నోటిఫికేషన్ జారీకానుంది

డీఎస్సీ పోస్టులు వివరాలు

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (పీజీటీలు)-286, ప్రిన్సిపాల్స్ 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 ఉద్యోగాలు ఉన్నాయి.

pin

Notifications

error: Content is protected !!