Indian Navy Agniveer SSR Recruitment 2024: INDIAN NAVY
(HAR KAAM DESH KE NAAM)
INDIAN NAVY INVITES ONLINE APPLICATIONS FROM UNMARRIED MALE AND UNMARRIED FEMALE
CANDIDATES FOR AGNIVEER (SSR) – 02/2024 BATCH
ELIGIBILITY CONDITIONS
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా.. భారత నౌకాదళంలో అగ్నివీర్ ఖాళీల నియామకానికి ప్రకటన వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అగ్నివీర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్ చిల్కాలో ప్రారంభమయ్యే 02/2024 బ్యాచ్ పేరున శిక్షణ ఉంటుంది. మే 13 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది. ఇంటర్ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రకటన వివరాలు:
* అగ్నివీర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్- ఎస్‌ఎస్‌ఆర్) ఖాళీలు
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్మీడియట్ (10+2)/ రెండేళ్ల ఒకేషనల్ కోర్సు లేదా ఇంజినీరింగ్ డిప్లొమా (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఆటోమొబైల్స్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: అభ్యర్థి 01.11.2003 – 30.04.2007 మధ్యలో జన్మించి ఉండాలి. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి.
కనిష్ఠ ఎత్తు ప్రమాణాలు: పురుషులు, మహిళలు కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్, స్టేజ్-1 (ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్), స్టేజ్-2 (రాత పరీక్ష, శారీరక దార్ఢ్య పరీక్ష- పీఎఫ్‌టీ), వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
శిక్షణ: అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్‌ఎస్ చిల్కాలో నవంబర్ నెలలో కోర్సు శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
జీత భత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో ఏడాది రూ.33 వేలు, మూడో ఏడాది రూ.36500, నాలుగో ఏడాది రూ.40 వేల వేతనం లభిస్తుంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: ప్రశ్నపత్రం హిందీ/ ఇంగ్లిష్ భాషల్లో మొత్తం 100 బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఒక్కొక్కటి 1 మార్కు చొప్పున 100 మార్కులను కలిగి ఉంటుంది. ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్… నాలుగు విభాగాల్లో ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి ఒక గంట. నెగెటివ్ మార్కింగ్ అమలులో ఉంటుంది. నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.550.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు నేవీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్య తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: 13-05-2024.
ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 27-05-2024.
శిక్షణ ప్రారంభం: 2024, నవంబర్ నెలలో.
NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 3NMMS MODEL GRAND TEST - 3HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 2NMMS MODEL GRAND TEST - 2HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 1 NMMS MODEL GRAND TEST - 1 HOW TO ATTEMPT… Read More
'PAPER CUTTING' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More
'ANALYTICAL REASONING' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More
'SHAPE CONSTRUCTION' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More