AGNIPATH ARMY RECRUITMENT ONLINE EXAMS SCHEDULE OUT: The examination for the Indian Army Agniveer recruitment is scheduled to commence from 22nd April 2024 onwards. Candidates are advised to prepare accordingly and keep an eye on the official website for any updates or changes to the schedule.
Remember to check the specific dates for downloading the admit card, as it may vary based on the category of the post.
అగ్నిపథ్ పథకం కింద 2024-25 సంవత్సరం అగ్నివీరుల నియామకాల రాత పరీక్ష తేదీలను ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ జోన్ల వారీగా భారత సైన్యం ఖరారు చేసింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సికింద్రాబాద్, వైజాగ్, గుంటూరు నగరాల్లో నియామక ర్యాలీని ఆర్మీ నిర్వహించనుంది. అర్హులైన అభ్యర్థులకు ప్రధాన కేంద్రాల్లో ఏప్రిల్ 22, 23, 24, 25, 29, 30, మే 2, 3 తేదీల్లో ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు ఉంటాయి. త్వరలో అడ్మిట్‌కార్డులు జారీకానున్నాయి. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి శారీరక సామర్థ్య, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. నియామకాల్లో భాగంగా అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్/ స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ కేటగిరీల్లో ఖాళీలు భర్తీ కానున్నాయి. అభ్యర్థుల వడపోత అనంతరం నాలుగేళ్ల కాలానికి అగ్నివీరులను ఎంపిక చేస్తారు.
CLICK HERE TO DOWNLOAD SCHEDULE