PARIKSHA PE CHARCHA 2024 LIVE LINK 29 JANUARY 2024
Pariksha Pe Charcha 2024 : పరీక్షల సమయంలో విద్యార్థుల్లో సహజంగా ఉండే భయాలను, ఒత్తిడిని ఎలా అధిగమించాలన్న అంశాలపై ప్రతీ ఏటా ప్రధాని నరేంద్ర మోదీ ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమానికి నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పరీక్షా పే చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విద్యార్థులతో వర్చువల్‌గా మాట్లాడనున్నారు ప్రధాని. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని ఐటీపీవో, భారత్ మండపం టౌన్‌హాల్‌లో ఈ రోజు (జనవరి 29) 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
ఈ ఏఢాది దాదాపు 2 కోట్ల మందికి పైగా విద్యార్థులు, పేరెంట్స్, టీచర్లు ఇందులో పాల్గొననున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో పోటీల ద్వారా ఎంపికైన సుమారు 2,050 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు పీపీసీ కిట్‌లను బహుమతిగా అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య ఇంటరాక్షన్ జరుగుతుంది.వారికి పీఎం మోదీని కలవడానికి, సంభాషించడానికి అవకాశం కల్పిస్తారు. ప్రతి సంవత్సరం 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు పాఠశాల విద్యార్థుల కోసం పరీక్షా పే చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 2 కోట్ల వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థులతోపాటు 14.93 లక్షల మంది ఉపాధ్యాయులు, 5.69 లక్షల మందికిపైగా తల్లిదండ్రులు రిజిస్టర్ చేసుకున్నారు.
January 29,2024 Live LINKS – Pariksha Pe Charcha 2024 | परीक्षा पे चर्चा 2024 | PM Modi
https://pmindiawebcast.nic.in/