SBI RECRUITMENT 2023 OF 8283 JUNIOR ASSOCIATES: RECRUITMENT OF JUNIOR ASSOCIATES (CUSTOMER SUPPORT & SALES)
(Advertisement No. CRPD/CR/2023-24/27)
ONLINE REGISTRATION OF APPLICATION AND PAYMENT OF FEES: 17.11.2023 TO 07.12.2023
Applications are invited from eligible Indian Citizens for appointment as Junior Associate (Customer Support & Sales) in clerical cadre in State Bank
of India. Candidates can apply for vacancies in one State/UT only. Candidates can appear for the test only once under this recruitment project. The
candidates applying for vacancies of a particular State/UT, should be proficient (reading, writing, speaking and understanding) in the specified opted
local language of that State/UT (mentioned in the under given vacancy table against each state/UT). The test for knowledge of specified opted local
language will be conducted as a part of selection process. It will be conducted after qualifying the online Main examination but before joining the
Bank. Candidates who fail to qualify this test will not be offered appointment. Candidates who produce 10th or 12th standard mark sheet/ certificate
evidencing having studied the specified opted local language will not be required to undergo the language test. There is no provision for Inter Circle Transfer / Inter State Transfer for Junior Associates to be recruited.
Preliminary Examination will be conducted tentatively in the month of January 2024 and Main Examination will be conducted tentatively in the month of February 2024. Candidates are advised to check regularly Bank’s website https://bank.sbi/web/careers/current-openings or https://www.sbi.co.in/web/careers/current-openings for details and updates. The examinations will be as detailed under point No. 4 under Selection procedure.
SBI Recruitment 2022: ఎస్‌బీఐలో 8,283 జూనియర్ అసోసియేట్ పోస్టులు
ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) భారీ ఖాళీలతో క్లర్క్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా 8,283 జూనియర్ అసోసియేట్స్(క్లరికల్ కేడర్) పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్‌లో 525; అమరావతి సర్కిల్‌లో 50 ఖాళీలున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నవంబర్ 17 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు….
పోస్టులు: జూనియర్ అసోసియేట్స్(కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్)
రాష్ట్రాల వారీగా ఖాళీలు:
1. ఉత్తర్ ప్రదేశ్- 1781
2. ఆంధ్రప్రదేశ్- 50
3. మధ్యప్రదేశ్- 288
4. రాజస్థాన్- 940
5. దిల్లీ- 437
6. ఉత్తరాఖండ్- 215
7. ఛత్తీస్‌గఢ్- 212
8. తెలంగాణ- 525
9. అండమాన్ అండ్ నికోబార్ దీవులు- 20
10. హిమాచల్ ప్రదేశ్- 180
11. హరియాణా- 267
12. జమ్ము అండ్ కశ్మీర్- 88
13. ఒడిశా- 72
14. పంజాబ్- 180
15. సిక్కిం- 04
16. తమిళనాడు- 171
17. పుదుచ్చేరి- 04
18. పశ్చిమ్ బెంగాల్- 114
19. కేరళ- 47
20. లక్షద్వీప్- 03
21. మహారాష్ట్ర- 100
22. అసోం- 430
23. అరుణాచల్ ప్రదేశ్- 69
24. మణిపూర్- 26
25. మేఘాలయ- 77
26. మిజోరం- 17
27. నాగాలాండ్- 40
28. త్రిపుర- 26
29. గుజరాత్- 820
30. కర్ణాటక- 450
31. లడఖ్- 50
32. బిహార్- 415
33. ఝార్ఖండ్- 165
మొత్తం పోస్టుల సంఖ్య: 8,283 .
హైదరాబాద్ సర్కిల్(తెలంగాణ)లో పోస్టుల సంఖ్య: 525.
అమరావతి సర్కిల్(ఆంధ్రప్రదేశ్)లో పోస్టుల సంఖ్య: 50.
విద్యార్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ ఫైనల్/ చివరి సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.04.2023 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. 02.04.1995 – 01.04.2003 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ(జనరల్/ ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
బేసిక్ పే: నెలకు రూ.19,900.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), స్థానిక భాష పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది.
ప్రిలిమినరీ పరీక్ష: ఇది 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు.. 30 మార్కులకు; న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు… 35 మార్కులకు; రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు… 35 మార్కులకు జరుగుతుంది. పరీక్ష సమయం ఒక గంట. నెగిటివ్ మార్కుల విధానం అమల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రధాన పరీక్షకు ఎంపికవుతారు.
మెయిన్ ఎగ్జామ్: మెయిన్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ప్రశ్నల సంఖ్య 190. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. జనరల్/ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు… 50 మార్కులు; జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు… 40 మార్కులు; క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు… 50 మార్కులు; రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు… 60 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటల 40 నిమిషాలు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: అనంతపూర్, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమహేంద్రవరం, రాజంపేట, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్.
ముఖ్యమైన తేదీలు…
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు రూ.750 చెల్లించాలి.
ముఖ్య తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.11.2023.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 07.12.2023.
ప్రిలిమినరీ పరీక్ష: జనవరి 2024లో జరుగుతుంది.
మెయిన్ పరీక్ష తేది: ఫిబ్రవరి 2024లో జరుగుతుంది.
HOW TO APPLY
Login to https://bank.sbi/web/careers/current-openings
Scroll down and click on Recruitment of
Junior Associates (Customer Support & Sales)
Download advertisement
(Carefully read the detailed advertisement)
Apply Online
(Before final submission, go through your application.
Corrections will not be allowed after final submission)