EMRS 10391 POSTS RECRUITMENT APPLY DATE EXTENDED

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

EMRS 10391 POSTS RECRUITMENT APPLY DATE EXTENDED

దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల(EMRS)లో ఖాళీగా ఉన్న 10,391 బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు గడువు పెరిగింది. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని స్వయంప్రతిపత్తి సంస్థ- నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ (నెస్ట్స్‌) నియామక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల దరఖాస్తులు పొడిగించినట్లు నెస్ట్స్‌ ఓ ప్రకటనలో తెలియజేసింది. ప్రిన్సిపల్/ పీజీటీ/ జూనియర్‌ సెక్రెటేరియట్‌ అసిస్టెంట్/ ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు- జులై 31; 6,329 టీజీటీ/ హాస్టల్ వార్డెన్ పోస్టులకు- ఆగస్టు 18న దరఖాస్తు ప్రక్రియ ముగియగా తాజాగా గడువు పొడిగించారు. డిగ్రీ, డిప్లొమా, పీజీ, డీఈడీ, బీఈడీ, సీటెట్‌ తదితర విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 19వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని నెస్ట్స్‌(NESTS) తెలిపింది. ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్-2023, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.



CLICK HERE TO APPLY ONLINE   

Join Our WhatsApp Group Join Our Groups

error: Content is protected !!