AP DRAFT VOTER LIST RELEASED

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

AP DRAFT VOTER LIST RELEASED : ఏపీలో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఎన్నికల సంఘం ఇవాళ ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టులో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ తర్వాత తాజాగా ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాను ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా ఇవాళ విడుదల చేశారు. దీన్ని రాజకీయ పార్టీలతో పాటు అందరకీ అందుబాటులో ఉండేందుకు వెబ్ సైట్లో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు.

AP DRAFT VOTER LIST RELEASED

APలో ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఆన్లైన్లో ఉంచింది. ఇంటింటి సర్వే అయ్యాక JAN 5న తుది జాబితాను వెల్లడించనుంది. మొత్తం 4,01,53,292 మంది ఓటర్లు ఉండగా.. పురుష ఓటర్లు 1,97,66,013, మహిళా ఓటర్లు 2,03,83,471 మంది ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 3,808 ఉండగా.. సర్వీసు ఓటర్లు 68,158 మంది ఉన్నారు. అనంత జిల్లాలో అత్యధికంగా 19.79 లక్షల ఓటర్లు ఉండగా.. అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 7.40 లక్షలు మంది ఉన్నారు.

ఎన్నికల సంఘం గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కాగా.. దీనిపై అభ్యంతరాల స్వీకరణ, ఫిర్యాదుల కోసం డిసెంబర్ 9 వరకూ సమయం ఇచ్చారు. ఇలా వచ్చిన అభ్యంతరాల్ని డిసెంబర్ 26 వరకూ పరిష్కరిస్తారు. అనంతరం వచ్చే ఏడాది జనవరి 1న తుది జాబితాలను సిద్ధం చేస్తారు. ఆ తర్వాత జనవరి 5న తుది ఓటర్ల జాబితాను ప్రచురించి విడుదల చేస్తారు.

VOTER’S SERVICE PORTAL : Download Voter list click Here

error: Content is protected !!