SSC DELHI POLICE 7547 EXECUTIVE CONSTABLE RECRUITMENT 2023

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దేశ రాజధాని దిల్లీలోని దిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌) పోస్టుల భర్తీకి  ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అర్హతలున్న అభ్యర్థులు సెప్టెంబర్‌ 30వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 


వివరాలు:

కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌)- పురుషులు: 5,056 పోస్టులు (జనరల్- 3053, ఈడబ్ల్యూఎస్‌- 542, ఓబీసీ- 287, ఎస్సీ- 872, ఎస్టీ- 302)

కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌)- మహిళలు: 2,491 పోస్టులు (జనరల్- 1502, ఈడబ్ల్యూఎస్‌- 268, ఓబీసీ- 142, ఎస్సీ- 429, ఎస్టీ- 150)

అర్హత: 10+2 (సీనియర్ సెకండరీ) ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌(ఎల్‌ఎంవీ) కలిగి ఉండాలి. 

జీత భత్యాలు: పే లెవల్-3 (రూ.21,700-రూ.69,100)

దరఖాస్తు రుసుము: రూ.100 (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు)

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్(పీఎంటీ), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా ఎంపిక చేస్తారు.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష: ఆబ్జెక్టివ్ టైప్‌లో 100 మార్కులు 100 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్‌/ కరెంట్‌ అఫైర్స్‌, రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, కంప్యూటర్‌ ఫండమెంటల్స్‌, ఎంఎస్‌ ఎక్సెల్‌, ఎంఎస్‌ వర్డ్‌, కమ్యూనికేషన్‌, ఇంటర్‌నెట్‌, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, వెబ్‌ బ్రౌజింగ్‌ తదితర 

అంశాల్లో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పరీక్షా కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

ముఖ్యమైన తేదీలు…

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: 01-09-2023 నుంచి 30-09-2023 వరకు.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేది: 30-09-2023

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేది: 30-09-2023

దరఖాస్తు సవరణ తేదీలు: 03, 04-10-2023.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష: 2023, డిసెంబర్‌లో ఉంటాయి.


CLICK HERE TO DOWNLOAD NOTIFICATION

error: Content is protected !!