SAINIK SCHOOLS: భారతదేశంలో దేశవ్యాప్తంగా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ 23 సైనిక్ పాఠశాలలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఏపీలో కడప జిల్లా పులివెందుల మండలంలో నల్లపురెడ్డిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలకు చోటు దక్కింది.
దేశవ్యాప్తంగా అనేక స్వచ్ఛంద సంస్థలు ప్రైవేటు పాఠశాలలు మరియు ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యంలో 100 సైనిక్ స్కూల్లో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని విషయం తెలిసిందే. దీనిలో భాగంగా నూతనంగా 23 పాఠశాలలకు ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసింది.వీటిలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి 4, రాజస్థాన్ 4, మధ్యప్రదేశ్‌కు 3, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 3, కేరళ రాష్ట్రానికి 2, హరియాణా రాష్ట్రానికి , హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రానికి 1, కర్ణాటక రాష్ట్రానికి 1 చొప్పున చోటు దక్కాయి.
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా నాణ్యతాయుతమైన విద్యను అదించడం, మెరుగైన కెరీర్ అవకాశాలు కల్పించడం, సాయుధ బలగాల్లో చోటు కల్పించడం సైనిక స్కూళ్ల లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేశారని తెలుస్తోంది.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అదాని వరల్డ్ స్కూల్ నకు భాగస్వామి పద్ధతిలో సైనిక పాఠశాలగా ఎంపికైంది దీనితో కలిపి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కోరుకొండ కలికిరి, అదానీ వరల్డ్ స్కూల్ మరియు నల్లపురెడ్డి జడ్పీ హైస్కూల్ తో నాలుగు స్కూల్స్ కు చోటు దక్కినట్లయింది.దేశంలో ఎప్పటికీ 33 సైనిక పాఠశాలలో ఉండగా గతంలో అనుమతులు లభించిన 19 పాఠశాలలకు అదనంగా నూతనంగా ఆమోదం పొందిన 23 పాఠశాలలు కలిపి మొత్తం భాగస్వామ్య ప్రాతిపదికన 42 పాఠశాలలకు చోటు దక్కింది.