AP SSA RECRUITMENT 2023 FOR BHAVITHA INCLUSIVE EDUCATION RESOURCE PERSONS

WhatsApp Group         Join Now
Telegram Group Join Now


 ఏపీ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) నిర్వహణలో ఉన్న భవిత కేంద్రాల్లో ఖాళీగా ఉన్న సహిత విద్యా రీసోర్స్‌పర్సన్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. 

AP SSA RECRUITMENT 2023 FOR BHAVITHA  INCLUSIVE EDUCATION RESOURCE PERSONS 

తాత్కాలిక/ఒప్పంద ప్రాతిపదికన ఏడాది పాటు పనిచేసేందుకు ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. మొత్తం 396 పోస్టులు భర్తీ చేయనున్నట్టు ఏపీ రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు http.apie.apcfss.in వెబ్‌సైట్‌ ద్వారా సెప్టెంబర్‌ 4 నుంచి 18వ తేదీ రాత్రి 11.59గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

దరఖాస్తు రుసుం రూ.100 కాగా.. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించరు.  ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి 18-42 ఏళ్లు కాగా..  ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, మాజీ సైనిక ఉద్యోగులకు మూడు, దివ్యాంగులకు పదేళ్లు చొప్పున సడలింపు ఇచ్చారు. జిల్లాల వారీగా పోస్టుల ఖాళీలు, విద్యార్హతల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచిన పూర్తి నోటిఫికేషన్‌ద్వారా పొందొచ్చని శ్రీనివాసరావు తెలిపారు. అభ్యర్థుల మెరిట్‌ లిస్ట్‌ జాబితాకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయాన్ని సంప్రదించవచ్చన్నారు.  

error: Content is protected !!