APSLPRB SI MAINS EXAM DATES RELEASED

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన తుది రాత పరీక్ష అక్టోబరు 14, 15 తేదీల్లో నిర్వహించనున్నట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ అతుల్‌సింగ్‌ తెలిపారు. 

14న ఉదయం 10 నుంచి 1 గంట వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30-5.30 గంటల వరకు పేపర్‌-2, 15న ఉదయం 10 నుంచి 1 గంట వరకు పేపర్‌-3, మధ్యాహ్నం 2.30-5.30 గంటల వరకు పేపర్‌-4 పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. పేపర్‌-1, పేపర్‌-2లు వివరణాత్మక విధానంలో, పేపర్‌-3, పేపర్‌-4లు బహుళ ఐచ్ఛిక విధానంలో ఉంటాయని పేర్కొన్నారు. విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు నగరాల్లోని కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 56,130 మందికి శారీరక, దేహదారుఢ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలు జరుగుతున్నాయని, వాటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు తుది రాత పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. 

Download copy 

  

error: Content is protected !!