APPSC GROUP 2 MODIFIED NEW SYLLABUS, PATTERN OF EXAM

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

ఏపీలో 508 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ ఆగస్టు 28న జీవో జారీ చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఏప్రిల్‌ నెలలో ఏపీపీఎస్సీ గ్రూప్-2 రాత పరీక్షలకు కొత్త సిలబస్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 450 మార్కులకు గాను రెండు దశల రాత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొదటి దశలో 150 మార్కులకు ప్రాథమిక (స్క్రీనింగ్) పరీక్ష, రెండో దశలో 300 మార్కులకు  ప్రధాన పరీక్ష (మెయిన్స్‌) నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధిస్తేనే మెయిన్స్‌కు ఎంపికవుతారు. ప్రిలిమ్స్‌లో కొత్తగా భారతీయ సమాజం అంశాన్ని చేర్చారు. సవరించిన సిలబస్, పరీక్ష విధానం ప్రకారం… 150 మార్కులకు ప్రాథమిక పరీక్ష ఉంటుంది. స్క్రీనింగ్ టెస్టులో భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, భారతీయ సమాజం, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. మెయిన్స్‌లో రెండు పేపర్లు ఒక్కొక్కటి 150 మార్కులకు(మొత్తం 300) ఉంటుంది. పేపర్-1లో ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం; పేపర్-2లో భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 

ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) పరీక్ష విధానం

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు
భారతదేశ చరిత్ర (ప్రాచీన, మధ్య, ఆధునిక చరిత్ర) 30 30
భూగోళశాస్త్రం (జనరల్‌, ఫిజికల్‌ జాగ్రఫీ, ఎకనమిక్‌ జాగ్రఫీ ఆఫ్‌ ఇండియా అండ్‌ ఏపీ, హ్యూమన్‌ జాగ్రఫీ ఆఫ్‌ ఇండియా అండ్‌ ఏపీ) 30 30
భారతీయ సమాజం(స్ట్రక్చర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సొసైటీ, సోషియల్‌ ఇష్యూస్‌, వెల్ఫేర్‌ మెకానిజం) 30 30
కరెంట్ అఫైర్స్ (రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు) 30 30
మెంటల్ ఎబిలిటీ (లాజికల్‌ రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ, బేసిక్‌ న్యూమరసీ) 30 30
మొత్తం 150 150

మెయిన్స్‌ పరీక్ష విధానం

సబ్జెక్టు ప్రశ్నలు సమయం (నిమిషాల్లో) మార్కులు
పేపర్-1 (ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం) 150 150 150
పేపర్-2 (భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ) 150 150 150
మొత్తం 300   300

 

  పూర్తి సిలబస్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి  

error: Content is protected !!