ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు గాను రెండో విడత అడ్మిషన్ ప్రక్రియ ఆగస్టు 28 నుండి మొదలవుతుందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఒక ప్రకటనలో పేర్కొంది.
AP DEGREE ADMISSION 2023-24 PHASE-2
ఏపీలో ప్రభుత్వ డిగ్రీ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లోకి రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఒక ప్రకటనలో పేర్కొంది. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్ నమోదుకు సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 12న సీట్ల కేటాయింపు చేయనున్నారు. సెప్టెంబర్ 12వ తేదీన కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. రెండో విడతలో ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 20 వరకు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లను కూడా భర్తీ చేయనున్నారు.
AP DEGREE ADMISSION 2023-24 PHASE-2
IMPORTANT LINKS