AP HIGH COURT RECRUITMENT:: AP DISTRICT COURT 3546 JOBS CERTIFICATE VERIFICATION

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

AP HIGH COURT RECRUITMENT:: AP DISTRICT COURT 3546 JOBS CERTIFICATE VERIFICATION 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో 3,546 ఉద్యోగాల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. జిల్లా న్యాయస్థానాల్లో కార్యాలయ సిబ్బంది నియామకాలకు సంబంధించి రాత పరీక్ష ఫలితాలు మార్చి 29న వెల్లడయ్యాయి. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. నియామకాల్లో భాగంగా నాన్‌ టెక్నికల్‌ విభాగాల్లోని ఉద్యోగాలకు ఏప్రిల్‌ 10 నుంచి 24 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగనుంది. ఈ మేరకు ఏపీ హైకోర్టు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. సంబంధిత జిల్లాల్లోని ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జెస్‌ కోర్ట్స్‌ పరిధిలో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులున్నందున ఖాళీలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కోర్టుల నుంచి ఖాళీలను అనుసరించి నిర్ణీత సమయంలో రెండో ఎంపిక జాబితా వెలువడనుంది. తదుపరి ఖాళీలను బట్టి అవసరమైతే, మూడో ఎంపిక జాబితా కూడా ప్రకటిస్తారు. టెక్నికల్‌ విభాగంలోని స్టెనో, టైపిస్టు, కాపీయిస్టు పోస్టులకు ఎంపికైన వారికి స్కిల్‌ టెస్టు, డ్రైవర్‌ పోస్టులకు ఎంపికైన వారికి డ్రైవింగ్‌ టెస్టు తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.

 

పోస్టు  ధ్రువపత్రాల పరిశీలన తేదీలు
జూనియర్ అసిస్టెంట్ ఏప్రిల్‌ 10, 11, 12 
ఫీల్డ్ అసిస్టెంట్/ ఎగ్జామినర్‌/ రికార్డ్‌ అసిస్టెంట్‌  ఏప్రిల్‌ 13, 15
ప్రాసెస్‌ సర్వర్  ఏప్రిల్‌ 17, 18
ఆఫీస్ సబార్డినేట్ ఏప్రిల్‌ 19, 20, 21, 24

 

 

                    
ప్రకటన వివరాలు 

error: Content is protected !!