NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS…
05–01–2023,*
*అమరావతి.*
*పాఠశాల విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.*
అమరావతి:
– క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
– రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ పూర్తయిందని వెల్లడించిన అధికారులు.
– ట్యాబుల మెయింటైనెన్స్‌కు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వీస్ సెంటర్‌ను కంపెనీ ద్వారా ఏర్పాటు చేస్తున్నామన్న అధికారులు.
– ట్యాబుల్లో ఎలాంటి సమస్య ఉన్నా వారంరోజుల్లో మరమ్మత్తు చేసి లేదా కొత్త ట్యాబును విద్యార్థికి అందించాలని సీఎం ఆదేశం.
– ట్యాబుల వాడకం? పాఠాలను నేర్చుకుంటున్న తీరు తదితర అంశాలపై ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్న అధికారులు.
– డేటా అనలిటిక్స్ ద్వారా విద్యార్థులు నేర్చుకుంటున్న తీరుపై నిరంతర పరిశీలన ఉండాలని, దీనికి అనుగుణంగా హెడ్ మాస్టర్, ఎంఈఓలు తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి .
– తరగతి గదుల డిజిటలైజేషన్‌లో భాగంగా ఐఎఫ్‌పి ప్యానెల్స్ ఏర్పాటుపై తీసుకుంటున్న చర్యలను వివరించిన అధికారులు.
– వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యే నాటికి ఐఎఫ్‌పి ప్యానెల్స్ ఏర్పాటు కావాలని సీఎం ఆదేశం.
– నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ వద్దన్న సీఎం.
– ఈ డిజిటల్ స్క్రీన్లు వల్ల విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందాలన్న సీఎం.
– వీటిని ఉపయోగించుకుని ఎలా బోధన చేయాలో టీచర్లకు చక్కటి అవగాహన, శిక్షణ కల్పించాలన్న సీఎం.
– పిల్లలు అందరివద్దా డిక్షనరీలు ఉన్నాయా? లేవా? మరోసారి పరిశీలన చేయాలన్న సీఎం.
– లేని పిల్లలు అందరికీ డిక్షనరీలు ఇవ్వాలన్న సీఎం.
– వచ్చే విద్యా సంవత్సరం విద్యాకానుక కోసం అన్నిరకాల ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం ఆదేశం.
– విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పిల్లలకు విద్యాకానుక అందాలన్న సీఎం.
– ఏ స్కూల్లో లేకపోయినా వెంటనే టీచర్లు ఉండేలా చూసుకోవాలన్న సీఎం.
– సబ్జెక్టుల వారీగా టీచర్లను పెట్టడం వల్ల బోధనలో నాణ్యత పెరుగుతుందని, విద్యార్థుల అభ్యాసం కూడా మెరుగుపడుతుందన్న సీఎం.
*– డీఎస్సీ 98 అభ్యర్థులకు పోస్టింగులు త్వరగా ఇవ్వాలని సీఎం ఆదేశం*
– గోరుముద్ద నాణ్యతను నిరంతర పరిశీలన చేయాలన్న సీఎం.
– అన్ని స్కూళ్లు, అంగన్వాడీలకు సార్టెక్స్ ఫోర్టిఫైడ్ బియ్యం మాత్రమే సరఫరా చేయాలని సీఎం ఆదేశాలు.
– నాణ్యత విషయంలో ఎలాంటి రాజీవద్దన్న సీఎం.
– సీఎం ఆదేశాల మేరకు ప్రత్యేక లేబుల్‌తో ఈ బియ్యాన్ని అన్ని పాఠశాలలు, అంగన్వాడీలు, అన్ని గురుకులపాఠశాలలకు, హాస్టళ్లకు సరఫరా చేస్తున్నట్టు తెలిపిన అధికారులు.
*– ఇప్పుడు ఇస్తున్న ఆహారానికి అదనంగా స్కూలు పిల్లలకు బెల్లంతో రాగి మాల్ట్ ఇవ్వాలని సీఎం ఆదేశం*
*పిబ్రవరి 1వ తేదీ నుంచి రాగిమాల్ట్ సరఫరా చేయాలని ఆదేశం*
– వారానికి మూడు రోజులు పిల్లలకు గ్లాసుడు రాగిమాల్ట్.
– ఐరన్, కాల్షియం లోపం నివారణకు ఇది ఉపయోగపడుతుందన్న సీఎం.
– నాడు – నేడు కింద బాగుచేసిన పాఠశాలల్లో సౌకర్యాల నిర్వహణపై నిరంతర పరిశీలన ఉండాలన్న సీఎం.
– ఎస్‌ఎంఎఫ్, టీఎంఎఫ్ నిధులను వినియోగించుకుని ఏ సమస్య వచ్చినా వెంటనే మరమ్మతులు చేపట్టాలన్న సీఎం.
– నాడు –నేడు రెండో దశ పనులనూ సమీక్షించిన సీఎం.
– 22 వేలకుపైగా స్కూళ్లలో పనులు నడుస్తున్నాయన్న అధికారులు.
– దాదాపు రూ.1500 కోట్లు విలువైన పనులు ఇప్పటికే జరుగుతున్నాయన్న అధికారులు.
ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణ, గ్రామ వార్డు సచివాలయాలశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, విద్యాశాఖ సలహాదారు ఏ సాంబశివారెడ్డి, ఇంటర్ మీడియట్ విద్య కమిషనర్ ఎం వీ శేషగిరిబాబు, పాఠశాల మౌలిక వసతులు కల్పన కమిషనర్ కాటమనేని భాస్కర్, పౌరసరఫరాలశాఖ కమిషనర్ జీ వీరపాండ్యన్, మిడ్ డే మీల్స్ డైరెక్టర్ నిధి మీనా, నాడు నేడు డైరెక్టర్ (టెక్నికల్) మనోహర్ రెడ్డి
మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ ఏ సిరి, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ (పాఠశాల విద్యాశాఖ) ప్రతాప్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.