TSPSC FOOD SAFETY OFFICERS RECRUITMENT 2022KEY, RESPONSE SHEETS DOWNLOAD

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
TSPSC FOOD SAFETY OFFICERS RECRUITMENT 2022KEY, RESPONSE SHEETS DOWNLOAD 

తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నవంబర్ 7న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షను ఆబ్జెక్టివ్ కంప్యూటర్ బేస్ట్ విధానంలో నిర్వహించారు. అయితే ఈ పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీని టీఎస్పీఎస్సీ నవంబర్ 15 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్సర్ కీలతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ లేదా.. టీఎస్పీఎస్సీ ఐడీ ద్వారా లాగిన్ అయి.. రెస్పాన్స్ షీట్స్ ద్వారా తమ మార్కులను తెలుసుకోవచ్చు.

ఈ కీలో ఏమైనా అభ్యంతరాలుంటే టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌లోనే నవంబర్ 16 నుంచి ప్రత్యేక లింక్ ద్వారా తెలపవచ్చు. ఈ లింక్ ద్వారా మీరు అభ్యంతరం చేయవలసిన ప్రశ్నలకు తగిన ఆధారాలను పీడీఎఫ్ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్ 20 వరకు అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చు. నిర్ణీత గడువు దాటిన తర్వాత వచ్చే అబ్జెక్షన్లను ఎట్టిపరిస్థితుల్లో పరిగణనలోకి తీసుకునేదిలేదని స్పష్టం చేశారు. అభ్యంతరాలను మెయిల్స్ ద్వారా గానీ.. ఫోన్ ద్వారా గానీ వ్యక్తం చేయకూడదని తెలిపారు. 

తెలంగాణలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ అండ్ పుడ్(హెల్త్) అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి జులై 29 నుంచి ఆగస్టు 26 వరకు దరఖాస్తులు స్వీకరిచింది. అక్టోబరు 31న రాతపరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నవంబరు 7న పరీక్ష నిర్వహించింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-1, మధ్మాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష జరిగింది. 

పరీక్షకు 64 శాతం హాజరు..

రాష్ట్రంలో మొత్తం 16 జిల్లాల్లోని 56 సెంటర్లలో పరీక్ష నిర్వహించారు. పరీక్ష కోసం మొత్తం 16,381 మంది దరఖాస్తు చేసుకోగా.. 14,830 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో కేవలం 9,535 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక 47 మంది అభ్యర్థులు పేపర్-1 మాత్రమే రాశారు. వీరిని అనర్హులుగా ప్రకటిస్తామని టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది

error: Content is protected !!