DCCB CHITTOOR RECRUITMENT 2022 FOR STAFF ASSISTANT/ CLEARK POSTS
చిత్తూరులోని చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్… శాశ్వత ప్రాతిపదికన స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్: 40 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఇంగ్లిష్, తెలుగు భాషలు, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
వయోపరిమితి: 01.10.2022 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు రూ.17900 – రూ.47920.
ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్/ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.590(ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, దివ్యాంగులకు రూ.413).
ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 20.11.2022.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.11.2022.
ఆన్లైన్ పరీక్ష నిర్వహణ తేదీ: డిసెంబర్ 2022.