TODAY EDUCATION TEACHERS TOP NEWS 21/10/2022
24 , 25 తేదీల్లో పాఠశాలలకు సెలవు
*🌻చిత్తూరు (సెంట్రల్), అక్టోబరు 20:* దీపావళి సందర్భంగా జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు సోమ, మంగళవారాల్లో సెలవు ప్రకటించినట్లు డీసీఈబీ కార్యదర్శి హేమారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దీపావళికి ఈనెల 24న అధికారిక సెలవు దినం కాగా, ఉపాధ్యాయ సంఘాల వినతుల మేరకు 25న కాంపెన్సేటరీగా పరిగణించి సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఈ సెలవు దినం బదులుగా నవంబరు 12వ తేది రెండో శనివారం పాఠశాలలు పనిచేస్తాయని ఆ ప్రకటనలో తెలిపారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
బదిలీలకు జీరో సర్వీసు
తీసుకోవాలి:హెచ్ఎంల సంఘం
*🌻అమరావతి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి*): ఉపాధ్యాయ బదిలీల్లో జీరో సర్వీ సును అమలుచేయాలని ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు జి.వి. నారాయణరెడ్డి, వి.శ్రీనివాసరావు కోరారు. గత ఈమేరకు విద్యా శాఖ మంత్రి హామీ ఇచ్చారని, దానిని అమలుచేయాలని గురువారం ఓ ప్రక టనలో విజ్ఞప్తి చేశారు. జీరో సర్వీసును తీసుకుంటే ఉపాధ్యాయులు వారి సొంత జిల్లాలకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
పది’ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ :టెండర్ ఖరారు
*🌻జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్టుడే*: ఉమ్మడివిద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ను పంపిణీ గుంటూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చేసేందుకు జిల్లాపరిషత్తు పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. జిల్లాపరిషత్తు కార్యాలయంలో డిప్యూటీ సీఈవో వి. సుజాత ఆధ్వర్యంలో టెండర్లు గురువారం నిర్వహిం చారు. సీల్డ్ టెండర్లు ఆహ్వానించగా నూజివీడు, విజయవాడ, గుంటూరు నుంచి మూడు సంస్థలు టెండర్లు వేశాయి. కార్యాలయ సిబ్బంది సీల్డ్ టెండరు పత్రాలను తెరిచారు. విజయవాడకు చెందిన సంస్థ తక్కువ ధరకు ముద్రించేందుకు టెండర్ వేయడంతో ఆ సంస్థను ఖరారు చేశారు. గుంటూరు పల్నాడు, బాపట్ల జిల్లాల్లో పదో తరగతి చదువుతున్న 36,155 మంది బాల, బాలికలకు వార్షిక పరీక్షలకు ఉపయోగపడేలా స్టడీ మెటీరియల్ని ముద్రించి పంపిణీ చేయనున్నారు. గతంలో స్టడీ మెటీరి యల్ని ఉచితంగా పంపిణీ చేసినా.. గత రెండేళ్లుగా కరోనా కారణంగా పంపిణీ చేయలేదు. విద్యా ఏడాది ఆలస్యంగా ప్రారంభమవడంతో పాటు తరగతులు సరిగా నిర్వహించకపోవడం, కరోనా పరిస్థితులు కారణంగా విద్యార్థులు విద్యపై దృష్టి సారించకపోవడం వంటి కారణాలతో గత విద్యా ఏడాదిలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో తక్కువ మంది విద్యా ర్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 2022-23 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ముందుగా స్టడీ మెటీరియల్ని పంపిణీ చేయాలని ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు జడ్పీ సర్వసభ్య సమావేశాలు, స్థాయీ సంఘ సమావేశాల్లో జడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినాను కోరారు. దీంతో ఆమె సానుకూ లంగా స్పందించి స్టడీ మెటీరియల్ని పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసు కున్నారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో దీనిని ముద్రించి పంపిణీ చేయ నున్నారు. నవంబరు, డిసెంబరు నెలల్లో విద్యార్థులకు పంపిణీ చేసే అవ కాశముందని జడ్పీ సిబ్బంది పేర్కొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
సీబీఏ విధానంలో ఎఫ్ఎ -1 పరీక్షలు….
విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకే ఓఎంఆర్ షీట్లు • 2 నుంచి 5 వ తేదీ వరకు పరీక్షలు • 8 నుంచి 15 వరకు ఆన్లైన్లో మార్కుల నమోదు*
సీబీఏ విధానంలో 15 మార్కులకు అబ్జెక్టివ్ , 5 మార్కులకు రాత ప్రశ్నాపత్రాలు ఉంటాయి . 1 , 2 తరగతులకు 10 అబ్జెక్టివ్ , 2 నుంచి 5 రాత ప్రశ్నాపత్రాలు ఉంటాయి . ఉపాధ్యాయులు చదివి వినిపించి సమాధా నాలు రాబడతారు. 3 నుంచి 8 తరగతులకు 15 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు , 2 నుంచి 5 రాత ప్రశ్నాపత్రాలు ఉంటాయి . 3 వ తరగతిలో 4 నుంచి 5 ప్రశ్నలు చదివి వినిపించి సమాధానాలు రాబడతారు , 4 , 5 తరగతుల్లో రాతపరీ క్షల్లో ఒక ప్రశ్నను చదివి వినిపించి సమాధానం రాబడతారు
సీబీఏ విధానంలో 1 నుంచి 10 వ తరగతి వరకు విద్యార్థులకు ఎఫ్ -1 పరీ క్షలు నవంబరు 2 నుంచి 5 వతేదీ వరకు జరుగుతాయి . ఉపాధ్యాయులు సమాధాన పత్రాలను మూల్యాంకనం నవంబరు 3 నుంచి 7 వరకు చేయాల్సి ఉంటుంది . ఆన్సర్ ఓఎంఆర్ షీట్లను గవర్నమెంట్ పాఠశాలలు నవంబరు 6 నుంచి ఎంఈవో కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది . మార్కులను నవంబరు 8 నుంచి 15 లోపు ఆన్లైన్లో నమోదు చేయాలి . విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను నవంబరు 8 వతేదీ నుంచి తల్లిదండ్రులకు పంపించాలి . • సీ , డీ గ్రేడ్ ఉన్న విద్యార్థులను క్లాస్ లో సబ్జెక్టుల వారీగా విభజించి మెరు గైన ఫలితాలు రాబట్టే విధంగా వారికి కోచింగ్ ఇవ్వాలి .
9 నుంచి 10 వ తరగతి వరకు నిర్వహించే పరీక్షల్లో ఎలాంటి మార్పులు ఉండ వు
🪷🪸🪷🪸🪷🪸
175 ఇంటర్ కాలేజీలపై వేటు
*♦️ఒకేసారి గుర్తింపు రద్దు చేసిన బోర్డు*
*♦️ప్రమాణాలు, వసతులు మెరుగుపడనందునే*
*♦️3 నెలల గడువివ్వాలని కోరినా ససేమిరా*
*♦️వాటిలోని విద్యార్థులు ఇతర కాలేజీలకు*
*🌻అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి*): రాష్ట్రంలో ఒకేసారి 175 ప్రైవేటు ఇంటర్ కాలేజీల గుర్తింపును ప్రభుత్వం రద్దు చేసేసింది. ఈ మేరకు గురువారం తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో జరిగిన ఇంటర్ బోర్డు సమావేశంలో చేసిన తీర్మానానికి ఆమోదముద్ర పడింది. నిర్దేశిత ప్రమాణాలు లేవనే కారణంతో ఇప్పటికే ఆ కాలేజీలకు నోటీసులు జారీచేశారు. మరో 3నెలల సమయం ఇస్తే నిర్దేశించిన ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటామని యాజమాన్యాలు కోరాయి. కానీ ఇంటర్ బోర్డు సమయం ఇచ్చేందుకు నిరాకరించింది. ఆయా కాలేజీల్లో ఉండే సుమారు 20వేల మంది విద్యార్థులను ఇతర కాలేజీల్లో చేరాలని బోర్డు సూచించనుంది. ఇప్పటివరకూ ఉన్న ఇంటర్మీడియట్ కాలేజీలు, హాస్టళ్లు ఎలా ఉండాలో పేర్కొంటూ ప్రభుత్వం రూపొందించిన కొత్త రెగ్యులేషన్‌కు బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే, ఇంటర్ కాలేజీల గుర్తింపు, అఫిలియేషన్ల రెన్యువల్ లాంటి అంశాలను మాన్యువల్ నుంచి ఆన్‌లైన్‌లోకి మార్చారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను మంత్రి బొత్స ప్రారంభించారు. ఇకపై అనుమతులన్నీ ఈ సాఫ్ట్‌వేర్ ద్వారానే జరుగుతాయి. అలాగే ఇంటర్ పరీక్షల విధానంలో ప్రశ్నపత్రాలను ఆన్‌లైన్ చేయాలని ఇంటర్ విద్యామండలి చేసిన ప్రతిపాదనకు తర్వాతి బోర్డు సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉంది.
రెండో విడత డిగ్రీ అడ్మిషన్లకు షెడ్యూలు: రెండోవిడత డిగ్రీ అడ్మిషన్లకు ఉన్నత విద్యామండలి షెడ్యూలు విడుదల చేసింది. శుక్రవారం నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్ చేసుకోవచ్చని, 25నుంచి 27వరకు సర్టిఫికెట్ల పరిశీలన, 28 నుంచి 31 తేదీల మధ్య వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని, 3న సీట్లు కేటాయిస్తారని వివరించింది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
విద్యాంజలి’లో నమోదు చేసుకోవాలి
: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యాంజలి -2.0 లో అన్ని ప్రభుత్వ , ఎయిడెడ్ పాఠశాలల వివరాలు నమోదు చేసుకోవాలి .
పాఠశాలకు అవసరమైన వస్తు , ధన , సేవా పరంగా స్వచ్ఛంద విరాళాలను వ్యక్తులు , స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి , ప్రవాస భారతీయుల నుంచి పొందవచ్చునని తెలిపారు .
https://vidyanjali.education.gov.in/en/users/login పోర్టల్లో పాఠశాల అవసరాలను ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు నమోదు చేసుకోవాలి .
🪷🪸🪷🪸🪷
పాఠశాలల్లో ఎన్నికల ప్రచారం చేయొద్దు
*🌻ఈనాడు, అమరావతి:* ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న తూర్పు, పశ్చిమ రాయలసీమ ప్రాంత జిల్లాల్లో అభ్య ర్థులు, వారి అనుచరులు పాఠశాలల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించరాదంటూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ఎన్నికల కార్యకలాపాల వల్ల విద్యార్థుల అభ్యసనకు ఆటంకాలు ఎదురవుతాయని, పాఠశాలల సమయాల్లో ప్రచారం నిర్వహించొద్దంటూ నాయకులు, ఉపాధ్యాయులకు ఆదేశాలు ఇవ్వా లని డీఈవోలకు సూచించింది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
జీపీఎస్ విధానాన్ని ఒప్పుకోం
*♦️ఆర్థిక ప్రయోజనాలు మంజూరు చేయాలి*
*♦️ఏపీ ఎన్జీవో సంఘం నేతల డిమాండ్*
*♦️సమావేశమైన ఏపీ ఎన్జీవో సంఘం నేతలు*
*🌻కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే*: ఉద్యోగులపై కొందరు నాయకులు దాడులకు పాల్పడుతూ దురుసుగా ప్రవర్తిస్తున్నారు.. దీనిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీసీహెచ్ వెంగళ్‌రెడ్డి, జవహర్‌లాల్ అన్నారు. వారు గురువారం కలెక్టరేట్‌లో మాట్లాడారు. సీపీఎస్ రద్దుపై అన్ని పార్టీలు తమ అభిప్రాయాలు వెల్లడించాలని కోరారు.
జీపీఎస్ విధానాన్ని తాము ఒప్పుకోబోమన్నారు. పాత పింఛను విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, పింఛనుదారులు చనిపోతే మట్టి ఖర్చుల సాయం అందడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, సరెండర్ లీవ్‌లు తదితర ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందన్నారు.
ఐదు విడతల డీఏ బకాయిలు చెల్లించడం లేదని, జీపీఎఫ్‌లో పొదుపు చేసుకున్న డబ్బుకు సంబంధించి రుణాలు, పార్ట్ ఫైనల్ విత్‌డ్రా వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. సచివాలయ ఉద్యోగులకు 2-10-2021 నుంచి టైం స్కేల్ వర్తింపజేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే వారికి సైతం ఆరోగ్య కార్డులు ఇవ్వాలని కోరారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు వచ్చే నెల ఏడో తేదీలోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.రామకృష్ణారెడ్డి, నగర అధ్యక్షుడు ఎంసీ కాశన్న, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా కోశాధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
ఎడ్సెట్ కౌన్సెలింగ్ 22 నుంచి
*🌻ఈనాడు, అమరావతి*: బీఈడీలో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్సెట్ మొదటి విడత కౌన్సెలింగ్ ఈనెల 22 నుంచి ప్రారంభించనున్నట్లు కన్వీనర్ రామమో హన్రావు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ 22-27 తేదీల మధ్య, ధ్రువపత్రాల పరిశీ లన 26-31, ప్రత్యేక కేటగిరీ ధ్రువపత్రాల పరిశీలన 27న, వెబ్ ఐచ్ఛికాల నమోదు నవంబరు 1-3 వరకు, ఐచ్ఛికాల మార్పు 3న, సీట్ల కేటాయింపు 5న, కళాశాలల్లో ప్రవేశాలు 7-9 తేదీల మధ్య ఉంటుందని వెల్లడించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
మేనిఫెస్టోలో పాతపెన్షన్ విధానాన్ని తెస్తామని చెప్పండి
*🌻అమరావతి,ఆంధ్రప్రభ:* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీరని నష్టం చేస్తు న్న నేషనల్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఆ స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని కొన సాగించాలని, ఈ డిమాండ్ ను రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టాలని స్టేట్ టీచర్స్ ఫెడరేషన్ (ఎస్టియు) రాహుల్ గాంధీని కోరింది. ఈమేరకు తమ వినతిపత్రాన్ని రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత పల్లంరాజు ద్వారా రాహుల్గాం ధీకి పంపించారు. రాజస్థాన్, చత్తీసఘర్ లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు వారి రాష్ట్రాల్లో ఎన్పిఎస్ను రద్దు చేసి మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని ఆ వినతి పత్రం లో తెలిపింది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
6,5ll పోలీసు ఉద్యోగాల భర్తీకి పరిపాలన అనుమతులు
జారీ చేసిన ప్రభుత్వం
*🌻ఈనాడు, అమరావతి:* ఆంధ్రప్రదేశ్లో 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గురువారం పరిపాలన అనుమతులు జారీ చేసింది. 411 ఎస్సై స్థాయి పోస్టులు, 6,100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కు మార్ గుప్తా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు.
*♦️భర్తీ చేయనున్న పోస్టుల వివరాలివి*
ఆర్ఎస్సై: 96 • ఎస్సై: 315
కానిస్టేబుల్ (ఏపీఎస్పీ): 2,520
కానిస్టేబుల్ (సివిల్): 3580
ngo: 6,511
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
నేటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ
*🌻పెడన, న్యూస్టుడే:* పెడన మండలంలో 3,4,5 తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయులకు రెండో దశ శిక్షణ ఈనెల 21 నుంచి 26వ తేదీ వరకు టీచింగ్ ఎట్ రైట్ లెవల్పై శిక్షణ ఇవ్వనున్నట్లు ఎంఈవో బి.టిల్దారాణి చెప్పారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్య క్రమం ఉంటుందని పేర్కొన్నారు. 27వ తేదీ నుంచి మూడో శిక్షణ ప్రారంభమవుతుందన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
ఉద్యోగుల సొమ్మును ప్రభుత్వం వాడుకుంది
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లానేతల ధ్వజం
*🌻ఆదోని(అగ్రికల్చర్), అక్టోబరు 20:* ప్రభుత్వ ఉద్యోగులు రూ.10 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వాడుకుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం జిల్లా అధ్య క్షుడు శ్రీధర్, ప్రధాన కార్యదర్శి రమణ, నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎంసీ నరసిం హులు అన్నారు. గురువారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆదోని తాలుకా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ విరమణ వయస్సు ప్రభుత్వం స్వార్థం కోసమే పెంచిందని ఆరోపించారు. పీఆర్సీ అమలు, డీఏల విడుదలలో జాప్యం చేయడం అన్యాయమన్నారు. నవంబరు 6న కర్నూలులో జరిగే రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలకు భారీ ఎత్తున ఉద్యోగులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఆదోని తాలుకా కమిటీ అధ్యక్షుడిగా ఎస్‌ఏ రసీద్, అసోసియేటెడ్ ప్రెసిడెంటుగా అల్లాబకాష్, కార్యదర్శులుగా లక్ష్మీనారాయణ, లక్ష్మీనర్సి రెడ్డి, లక్ష్మీ, ఉపాధ్యక్షులుగా ఎల్లయ్య, ఇందిరా డోరతి, గోపాల్, రాజశేఖర్, వీరుష్, వేణు, సహాయ కార్యదర్శులుగా నాగవేణి, సందీప్ కుమార్, నబీరసూల్, దేవోజీ, రాధాకృష్ణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
‘డిగ్రీ’ గెస్ట్ ఫ్యాకల్టీ గౌరవవేతనం పెంపు ఉత్తర్వులు విడుదల
*🌻సాక్షి, అమరావతి*: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ గౌరవ వేతనం పెంచుతూ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జే శ్యామలరావు గురువారం ఉత్త ర్వులు (జీవో 157) జారీ చేశారు. వారి వేత నాన్ని గంటకు రూ.200 నుంచి రూ.400కు ప్రభుత్వం పెంచింది. ధరలు ఆకాశాన్నంటు తున్న తరుణంలో కొంతమేరకైనా ఉపశమనం కలిగించేలా వీరి వేతనాలు పెంచడం హర్షణీ యమని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పేర్కొ న్నారు. నెలకు రూ.28 వేలకు మించకుండా వీరికి గౌరవ వేతనం చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇