TODAY EDUCATION/TEACHERS TOP NEWS 19/10/2022

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

TODAY EDUCATION/TEACHERS TOP NEWS 19/10/2022

ఉపాధ్యాయ బదిలీలకు రంగం సిద్ధం

నేడు ఎస్జీటీల సర్టిఫికెట్ల
 పరిశీలన


*🌻మచిలీపట్నం టౌన్, అక్టోబరు 18* : జిల్లాలో ఖాళీగా ఉన్న స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతులకు అర్హులైన సెకండరీ గ్రేడ్ టీచర్లు బుధవారం ఉదయం డీఈవో కార్యాలయం వద్ద జరగనున్న కార్యక్రమంలో విద్యార్హతల ధృవపత్రాలు, సర్వీసు రిజిష్టర్లు రెండు సెట్ల జెరాక్స్ కాపీలు తీసుకురావాలని డీఈవో తాహెరా సుల్తానా సూచించారు. సీనియారిటీ లిస్టులో ఎస్జీటీలు పేరు నమోదు చేసుకోవాలన్నారు. అర్హులైన సెకండరీ గ్రేడ్ టీచర్లు హాజరు కావాలని సూచించారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

ట్రిపుల్ ఐటీల్లో 446
 సీట్లకు త్వరలో కౌన్సెలింగ్


 *♦️ప్రత్యేక కేటగిరీలో 14 ఖాళీలు.. బదిలీలకు అనుమతి*

*🌻వేంపల్లె, అక్టోబరు 18:* రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నాలుగు ట్రిపుల్ ఐటీల్లో మొదటి విడత కౌన్సెలింగ్ ముగిసింది. ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో 4,400 సీట్ల భర్తీ కోసం మొదటి విడత నిర్వహించిన కౌన్సెలింగ్ పూర్తికాగా ఇంకా 446 సీట్లు మిగిలాయి. నూజి వీడు ట్రిపుల్ ఐటీలో 48 సీట్లు, ఇడుపులపాయలో 110, ఒంగోలులో 149, శ్రీకా కుళం ట్రిపుల్ ఐటీలో 139 సీట్లు మిగిలాయి. ఇందులో అన్ని ట్రిపుల్ ఐటీల్లోను ఓసీ విభాగానికి 206 సీట్లు, బీసీ-ఏలో 21, బీసీ-బీలో 45, బీసీ-సీలో 7, బీసీ-డీలో 24, బీసీ-ఈలో 28 సీట్లు మిగిలాయి. అలాగే ఎస్సీ కోటాలో 55, ఎస్టీ 28, ఈడబ్ల్యూ ఎస్ కోటాలో 32 సీట్లు మిగిలాయి. వీటికి సంబంధించి గతంలో దరఖాస్తు చేసు కున్న వారిలో మెరిట్ జాబితా సిద్ధంగా ఉంది. జాబితాలో ఉన్న విద్యార్థులకు రెండో విడత కౌన్సెలింగ్ కోసం కాల్ లెటర్లు పంపుతారు. 10వ తరగతి మార్కు లకు సంబంధించి మార్పులు ఉన్న వారు ఈనెల 22వ తేదీలోపు దరఖాస్తు చేసు కునేందుకు అవకాశం కల్పించారు. ఆ గడువు అయిన వెంటనే కౌన్సెలింగ్ తేదీని ప్రకటించనున్నట్టు చాన్సలర్ కేసీ రెడ్డి తెలిపారు. ప్రత్యేక కేటగిరీకి సంబంధించి 14 సీట్లు మిగిలాయి. అందులో క్యాప్ విభాగంలో 11 సీట్లు, పీహెచ్ 1, బీఎసీ విభాగంలో 2 ఖాళీలు ఉన్నాయని ఆయన తెలిపారు. కాగా, మొదటి విడత ట్రిపు ల్బటీలో సీటు పొందిన వారు. వేరే ట్రిపుల్ ఐటీకి బదిలీ కోరుకునే ఉద్దేశం ఉంటే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. వివరాలకు ఆర్జీ యూకేటీ.ఇన్ వెబ్సైట్ను సందర్శించాలని తెలిపారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

నీట్ పిజి అడ్మిషన్ల కోసం కటాఫ్ మార్కుల తగ్గింపు


*🌻న్యూఢిల్లీ* : పిజి మెడికల్ ప్రోగ్రామ్లలో అడ్మిషన్ల కోసం కటాఫ్ మార్కులు తగ్గించేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసి) ప్రకటించింది. అధికారిక నోటీసుల ప్రకారం… అన్ని కేటగిరీల్లో కటాఫ్ మార్కులు 25 శాతం తగ్గాయని తెలిపింది. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల తగ్గింపు 25 శాతం ఉండగా, జనరల్ కేటగిరీలో వికలాంగ అభ్యర్థులకు 20 శాతం, ఎస్సి, ఎస్టి, బిసిలలో వికలాంగ అభ్యర్థులకు 15 శాతం కటాఫ్ మార్కుల తగ్గింపు ఉంటుందని పేర్కొంది. గతేడాది అడ్మిషన్ల కోసం నిర్వహించిన పిజి కౌన్సిలింగ్లో పెద్ద సంఖ్యలో సీట్లు ఖాళీ కావడంతో ఎన్ఎంసి ఈ నిర్ణయం తీసుకుంది.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

ఆరేళ్లలోగా వైద్యులు
 కోర్సు పూర్తి చేయాలి


*🌻ఈనాడు-అమరావతి*: ఇన సర్వీసు వైద్యులు పీజీ (ఎండీ/ఎంఎస్/ఎండీ ఎస్) వైద్య విద్యలో చేరిన నాటి నుంచి ఆరేళ్లలోగా కోర్సు పూర్తి చేయా లని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం గెజిట్ జారీ చేసింది. లేని పక్షంలో రూ.25 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. డిప్లొ మాలో చేరిన వారు నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలని పేర్కొంది.

*📚✍️ఉన్నత విద్య కమిషన్ వైస్ చైర్మన్, కార్యదర్శి పదవీకాలం పొడిగింపు*

*🌻ఈనాడు, అమరావతి*: ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ వైస్ ఛైర్మన్, కార్యదర్శి, సభ్యుల పదవీకాలాన్ని మరో నెల రోజులు పొడి గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరి పదవీకాలం అక్టోబరు 23తో ముగుస్తున్నందున నవంబరు 22 వరకు పొడిగించింది.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

ఫిజికల్ డైరెక్టర్ సస్పెన్షన్


*♦️13 ఏళ్లు ఒకేచోట డెప్యూటేషన్పై కొనసాగినందుకు చర్యలు*

*♦️ఉత్తర్వులు విడుదల చేసిన గుంటూరు డీఈఓ శైలజ*

*🌻గుంటూరు ఎడ్యుకేషన్:* గుంటూరు నగరం పొత్తూ రువారితోటలోని మహాకవి తిక్కన, పులిపాక కమల -హనుమంతరాయ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఫిజికల్ డైరెక్టర్ ఎ.సత్యనారాయణను సస్పెం డ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి పి. శైలజ మంగళ వారం ఉత్తర్వులు విడుదల చేశారు. మాతృ పాఠ శాలకు దూరంగా 13 ఏళ్ల పాటు డెప్యూటేషన్పై నర సరావుపేటలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం ఇన్ చార్జిగా కొనసాగిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపిన అధికారులు ఎట్టకేలకు సస్పెన్షన్ వేటు వేశారు. 2008 నుంచి 2017, 2019 నుంచి 2022 వరకు ఏకథా టిగా 13 ఏళ్లపాటు డెప్యూటేషన్పై కొనసాగడంపై పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కమిషనర్ కార్యాలయం నుంచి గత ఆగస్టు 29న ఆర్జేడీ వీఎస్ సుబ్బారావు, డీఈఓ పి.శైలజకు ఆదేశాలు అందాయి. విచారణలో జాప్యం చేసిన అధి కారులు ఎట్టకేలకు చర్యలు చేపట్టారు. 13 ఏళ్లపాటు డెప్యూటేషన్తో పాటు ఆన్ డ్యూటీ సదుపాయాన్ని వర్తింపజేయడం ప్రభుత్వ నిబంధనలకు పూర్తి విరు ద్ధమని తేల్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల అమ లులో జరిగిన జాప్యాన్ని వెలుగులోకి తెస్తూ సాక్షి జిల్లా టాబ్లాయిడ్లో సోమవారం ‘తిష్టా గరిష్టుడు’ శీర్షికతో కథనాన్ని ప్రచురితమైంది.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

ఉపాధ్యాయుడు నడిపల్లికి వరల్డ్ రికార్డు సర్టిఫికెట్


*🌻పెనమలూరు*: కృష్ణాజిల్లా పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిత్రకళా ఉపా ధ్యాయుడిగా పనిచేస్తున్న నడిపల్లి రవికుమా ర్కు బ్రేవో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ వరించింది. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సంద ర్భంగా పెన్సిల్ మొనపై 2.5 సెంటీమీటర్ల ఎత్తు, ఐదు మిల్లీ మీటర్ల వెడల్పు కొలతలతో జాతిపిత రూపాన్ని చెక్కారు. దీనికి గానూ యూకేకు చెందిన బ్రేవో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రకటించింది. సంబం ధిత సర్టిఫికెట్ను ఉపాధ్యాయుడు నడిపల్లి రవికుమార్ కు మచిలీపట్నంలో కలెక్టర్ రంజి త్బాషా సోమవారం అందజేశారు. వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ గ్రహీత నడిపల్లి రవికుమార్ మాట్లాడుతూ.. తన చిత్రకళకు ఇప్పటివరకు 20 ప్రపంచ రికార్డులు వచ్చాయన్నారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

జాతీయస్థాయి సైన్స్ ఫెయిర్కు విద్యార్థి ఎంపిక


*🌻నాగాయలంక(అవనిగడ్డ)*: స్థానిక జిల్లా పరి షత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఆకునూరు హేమచంద్ర సాయి జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్కు ఎంపికై నట్లు పాఠశాల హెచ్ఎం అన్నపరెడ్డి రామారావు మంగళవారం తెలి పారు. గత నెల 30వ తేదీన ఆన్లైన్లో జరిగిన రాష్ట్ర సైన్స్ ఫెయిర్ హేమచంద్ర ప్రదర్శించిన ఎకో ఫ్రెండ్లీ లార్విసైడ్ ప్రాజెక్ట్ పలువురి ప్రశంసలు పొంది, విజేతగా నిలిచినట్లు సోమవారం సర్టిఫికెట్ పంపారని విద్యార్థికి తర్ఫీదు ఇచ్చిన గైడ్ టీచర్ కొమ్మినేని ఉదయ కుమార్ వివరించారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

ఉపాధ్యాయులు పేర్లు నమోదు చేయించుకోవాలి


*🌻మచిలీపట్నం(గొడుగు పేట), న్యూస్టుడే:* ఉమ్మడి జిల్లాలోని స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసి స్టెంట్ ఉద్యోగోన్నతుల్లో భాగంగా అర్హులైన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు సంబంధిత ధ్రువపత్రాలతో ఈనెల 19న డీఈఓ కార్యాలయానికి హాజరు కావాలని జిల్లా విద్యాశాఖాధి కారి తాహెరా సుల్తానా ఒక ప్రకటనలో తెలి పారు. ఉదయం 11 గంటలకు కల్లా హాజరై సీనియారిటీ జాబితాలో పేరు నమోదు చేయిం చుకోవాలన్నారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

నాణ్యమైన విద్యను అందించాలి


*🌻ఈనాడు, అమరావతి*: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంపై దృష్టి సారించా లని కళాశాలల విద్య కమిషనర్ పోలా భాస్కర్ కోరారు. అధ్యాపకులు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. డిగ్రీ విద్యార్థుల కోసం రూపొందించిన 13 నైపుణ్యాభివృద్ధి, నాలుగు జీవన నైపుణ్యాల పాఠ్యపుస్తకాలు, బోధన, ఫీజుల వసూలు, ఇంటర్న్షిప్ లాంటి వాటి కోసం రూపొం దించిన నాలుగు యాప్లను నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ సత్యనారాయణతో కలిసి ఆయన విజయవాడ లో మంగళవారం ఆవిష్కరించారు. నైపుణ్య పాఠ్యాంశాల రూపకల్పనకు సహకారం అందించిన అధ్యాపకులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు పెంచడంపైనా దృష్టి పెట్టాలని, నాణ్యమైన విద్య అందితే సీట్ల భర్తీ దానికదే పెరుగుతుందని సూచించారు. అనంతరం నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 525 నైపుణ్య ఎక్స్ లెన్స్ కేంద్రాలు, 104 హైఎండ్ నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటిని విద్యార్థులు వినియోగించుకునేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేడీ, డెవిడ్, అకడమిక్ అధికారులు తులసీ, అనిల్ పాల్గొన్నారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

ఏపీజీఎల్ఐ ప్రీమియం పెంచిన ఆర్థిక శాఖ


*🌻ఈనాడు, అమరావతి*: ఉద్యోగ పదవీవిరమణ వయస్సు 62ఏళ్లు పెరిగినందున ఏపీజీఎల్ఐ కు చెల్లించే ప్రీమియం మొత్తాలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త పీఆర్సీ వేతనాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పెరిగిన ప్రీమియం మొత్తాలనే వసూలు చేయాలని పేర్కొంది. గరిష్ఠ బీమా వయస్సును 55 ఏళ్ల నుంచి 57ఏళ్లకు పెంచింది. సవరించిన వేతన స్లాబ్ల ప్రకారం రూ.800 నుంచి గరిష్ఠంగా రూ.3వేలు వరకు బీమా ప్రీమియం మొత్తాలను ఉద్యోగుల వేతనాల నుంచి వసూలు చేయాలని పేర్కొంది. ఈ ఆదేశాలు నవంబరు ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని, అక్టోబరు వేతనాల నుంచే పెంచిన ప్రీమి యంను రికవరీ చేయాలని వెల్లడించింది.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!