TODAY EDUCATION TEACHERS TOP NEWS 14/10/2022

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

 TODAY EDUCATION TEACHERS TOP NEWS 14/10/2022


*🌼17 నుంచి స్కూల్ గేమ్స్*
విజయవాడ స్పోర్ట్స్ : మండల , నియోజకవర్గ , జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఈ నెల 17 వ తేదీ నుంచి నవంబర్ మూడో తేదీ వరకు నిర్వహిం చనున్నట్లు రాష్ట్ర వ్యాయామ విద్యా తనిఖీ అధికారి జి.భానుమూర్తి తెలిపారు . 
విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ , పాఠశాల విద్య డైరె క్టర్ , కో ఆర్డినేటర్ పార్వతి ఆదేశాల మేరకు కబడ్డీ , ఖోఖో , త్రో బాల్ , వాలీబాల్ , బాల్ బ్యాడ్మింటన్ , యోగ , బ్యాడ్మింటన్ , టెన్ని కాయిట్ , అథ్లెటిక్స్ క్రీడల్లో పోటీలను నిర్వహి స్తామన్నారు .
 *💥ఈ నెల 17 నుంచి 19 వ తేదీ వరకు మండల స్థాయి , 20 నుంచి 24 వ తేదీ వరకు నియోజకవర్గస్థాయి , 25 నుంచి నవంబర్ మూడో తేదీ వరకు జిల్లా స్థాయిలో పోటీలు జరుగుతాయన్నారు .*
 పోటీల అనం తరం ఆయా క్రీడాంశాల్లో మండల , నియోజక వర్గ , జిల్లా స్థాయి క్రీడా జట్లను ఎంపిక చేస్తామన్నారు . 
క్రీడాకారులకు మధ్యాహ్నం భోజనం ప్రభుత్వం సమకూర్చుతుందన్నారు

 .
🪸🪷🪸🪷🪸🪷
*🌼నేటితో ముగియనున్న పదోన్నతుల కౌన్సెలింగ్*
 కాకినాడ రూరల్  : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబ ంధించి స్కూల్ అసిస్టెంట్లుగా ఉపాధ్యా పదోన్నతి కల్పించేందుకు యులకు సంబంధించిన కౌన్సెలింగ్ను రెండురోజు లుగా కాకినాడ డీఈవో కార్యాలయంలోని ఎస్ఎస్ఏ హాల్లో నిర్వహిస్తున్నారు . గణితం , బయాలజీ , సోషల్ , ఆంగ్లం , తెలుగు సబ్జెక్టు ఉపాధ్యాయులకు గురు వారం కౌన్సెలింగ్ కొనసాగింది . కొన్ని ఖా ళీలు ఏర్పడడంతో సీనియారిటీ జాబితా ఆధారంగా శుక్రవారం కూడా భర్తీ చేయ నున్నట్లు డీఈవో తెలిపారు .
🪸🪷🪸🪷🪸🪸
*🌼కేజీబీవీల్లో అతిథి అధ్యాపకుల ఎంపిక • నేడు నియామకాల కౌన్సెలింగ్*
ఒంగోలు మెట్రో : జిల్లాలోని 37 కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో 2022-23 సంవత్సరా నికి గెస్ట్ ఫ్యాకల్టీలుగా పనిచేసేందుకు అర్హు లను సీఆర్ , పీజీటీలుగా ఎంపిక చేసినట్లు డీఈఓ బి . విజయభాస్కర్ తెలిపారు . సీఏఆర్ టీలకు సబ్జెక్టుల వారీగా ఎంపికైన వారి వివ రాలు ఆయన వెల్లడించారు . ఇంగ్లిషు సీఆర్డీ పోస్టు ఒకటి ఖాళీ ఉండగా , తెలుగు 2 , ఇంగ్లిష్ 5 , హిందీ 1 , మేథమేటిక్స్ 7 , ఫిజికల్ సైన్స్ 7 , బయోలాజికల్ సైన్స్ 6 , సోషల్ స్టడీస్ 5 మొత్తం 33 పోస్టులకు గాను 32 పోస్టులకు ఎం పిక చేసినట్టు పేర్కొన్నారు . పీజీటీలు 131 పోస్టులు ఉండగా 69 మందిని ఎంపిక చేశామ ని , మిగిలిన 62 పోస్టులు భర్తీ చేయాల్సి ఉం దని తెలిపారు . శుక్రవారం ఉదయం 10 గం టలకు పీజీటీలకు , మధ్యాహ్నం 12 గంటలకు సీఆర్టీలకు ఒంగోలు సమగ్ర శిక్షా కార్యాల యంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు .
🪸🪷🪸🪷🪸🪷
*కో ఆర్డినేటర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం*
 ఒంగోలు  : జగనన్న గోరుముద్ద ( పాఠశా లల్లో మధ్యాహ్న భోజన పథకం ) కు ప్రోగ్రాం కో ఆర్డినేటర్లుగా కాంట్రాక్టు ప్రాతిపదికన విధులు నిర్వహించేందుకు అర్హులైన వారి నుం చి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యా శాఖాధికారి గురువారం ఒక ప్రకటనలో తెలి పారు . ప్రోగ్రాం కో ఆర్డినేటర్ ( మధ్యాహ్న భో జన పథకం ) -1 పోస్టుకు నెలకు రూ .25 వేలు , ప్రోగ్రాం కో ఆర్డినేటర్ ( టీఎంఎఫ్ ) కు నెలకు రూ .25 వేల చొప్పున వేతనం చెల్లిస్తారని పేర్కొన్నారు . తగిన అనుభవంతో పాటు పీజీ , గ్రాడ్యుయేట్ , స్కూలు ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రే షన్ రూల్స్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధా న్యత ఉంటుందని తెలిపారు . కమ్యూనికేషన్ నైపుణ్యాలు , కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ఇంగ్లీషు , తెలుగు భాషల్లో మంచి పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు . మంచి ట్రాక్ రికార్డుతో అసిస్టెంట్ డైరెక్టర్ / గెజిటెడ్ హెడ్మాస్టర్ / సూప రింటెండెంట్ కేడర్లో పాఠశాల విద్యాశాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు . దరఖాస్తు లను డీఈవో కార్యాలయంలోని మధ్యాహ్నం భోజన పథకం , ఒంగోలు వారి కార్యాలయం లో ఈ నెల 16 వ తేదీ సాయంత్రం ఐదు గంట ల్లోగా సమర్పించాలని ఆయన కోరారు
🪷🪸🪷🪸🪷🪸
*🌼ముగిసిన సర్టిఫికెట్ల పరిశీలన*
 కర్నూలు సిటీ : డీఎస్సీ -1998 లో అర్హత పొం దిన అభ్యర్థులను కాంట్రాక్ట్ ఉపాధ్యాయు లుగా నియమించనున్నారు .
 ఈ మేరకు ఈ నెల 6 వ తేదీ నుంచి చేపట్టిన అభ్యర్థుల సర్టిఫికె ట్ల పరిశీలన గురువారంతో ముగిసింది . 
జిల్లాలో మొత్తం 626 మంది అభ్యర్థులు కాం ట్రాక్ట్ ఉద్యోగాలు చేసేందుకు పత్రాలు ఇవ్వగా , వీరిలో 36 మంది సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకాలేదు . 11 మంది నిర్ణీత వయస్సు ఎక్కువగా ఉండడంతో అర్హతను కోల్పోయారు .
 సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన 579 మందికి జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు , సీఆర్పీ వంటి పోస్టులు ఈ నెల చివరిలోపు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి 
🪷🪸🪷🪸🪷🪸
*🌼పాఠశాలలకు టెన్త్ మార్కుల జాబితాలు*
 రాష్ట్ర పరీక్షల విభాగం కార్యాలయం నుంచి పదో తరగతి విద్యార్థుల ఒరిజినల్ మార్కుల జాబితాలను పాఠశాలలకు పంపారు . ఈ మేరకు గురువారం రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఉత్తర్వులు జారీచేశారు .
 ఏప్రిల్ 2022 , జూలై 2022 పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసి ఉత్తీర్ణత చెందిన విద్యార్థుల ఒరిజినల్ మార్కుల జాబితాలను అందజేసేటప్పుడు పాటించాల్సిన నిబంధనలను ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు .
🪷🪸🪷🪸🪷🪸
*📚✍️బడులపైనా*
 *రాజకీయాలా?✍️📚*
*♦️స్కూలు పిల్లలు, పాఠశాలలపై స్థాయికి మించి వక్రీకరణలు*
*♦️విద్యాశాఖపై సమీక్షలో సీఎం జగన్*
*♦️ఇంగ్లిష్ మీడియం చదవలేక మానేస్తున్నారట!..*
 *♦️ఇలాంటి వక్రీకరణల వెనుక వారి ఉద్దేశమేంటి?.. పిల్లలను ఇంగ్లిష్‌ మీడియానికి దూరం చేయాలనే కదా!*
*♦️పిల్లల భవిష్యత్‌కు నైతిక స్థైర్యాన్ని ఇవ్వాల్సిన వాళ్లే ఇలా చేయడం దారుణం*
*♦️విద్యా, వ్యవసాయం, ఆరోగ్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత*
*♦️ఇంత చేస్తున్నా ఓ వర్గం మీడియా నిరంతరం దుష్ప్రచారం*
*♦️8వ తరగతి విద్యార్థులు, టీచర్లకు కలిపి 5,18,740 ట్యాబ్‌లు*
*♦️ట్యాబ్‌లు రాగానే బైజూస్‌ కంటెంట్‌ అప్‌లోడ్‌ చేయాలి*
*♦️మిగిలిన విద్యార్థులందరికీ అందుబాటులో ఈ-కంటెంట్‌*
*♦️పాఠ్య పుస్తకాల్లో కూడా పొందు పరచాలి.. విద్యా కానుక మరింత మెరుగ్గా ఇచ్చేందుకు చర్యలు*
*♦️యూనిఫారం క్లాత్, బ్యాగ్‌ల సైజు, కుట్టు కూలి పెంపు*
🔺విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ మూడేళ్లలో ఈ మూడు రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం. ఇంత చేస్తున్నా.. ఓ వర్గం మీడియా ప్రభుత్వంపై నిరంతరం పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోంది. ఇదంతా ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం లేకుండా చేసి, ఇదివరకట్లా పేదలకు మంచి విద్య అందకుండా దూరం చేయాలనే కదా! ఇంతటి దుర్మార్గపు రాజకీయాలు చేస్తుండటం దురదృష్టకరం. ఇలాంటి వాటిని ఎదుర్కొంటూనే మనం లక్ష్యాల వైపు అడుగులు వేయాలి.
*▪️- సీఎం వైఎస్‌ జగన్‌*
*🌻సాక్షి, అమరావతి*: ‘రాష్ట్రంలో రాజకీయాలు చాలా అన్యాయంగా నడుస్తున్నాయి. ఓ వర్గం మీడియా ప్రభుత్వంపై నిరంతరం దుష్ప్రచారం చేస్తోంది. చివరకు వారి స్వార్థం కోసం స్కూలు పిల్లలనూ రాజకీయాల్లోకి లాగుతున్నారు. విద్యార్థులని కూడా చూడకుండా వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యా రంగానికి సంబంధించిన అంశాలపై కొన్ని పత్రికలు తప్పుడు వార్తలతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. వీటిపై సీఎం స్పందిస్తూ ‘విద్యా సంబంధిత కార్యక్రమాలపై రాజకీయాలు దురదృష్టకరం. ముఖ్యంగా లక్షలాది మంది పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు ఆసరాగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసేందుకు ఇలాంటి దుష్ప్రచారం సాగిస్తున్నారు.
♦️ప్రభుత్వ పాఠశాలలపై వక్రీకరణలు ఒక స్థాయికి మించి చేస్తున్నారు’ అని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం చదవలేక మానేస్తున్నారన్నట్టుగా వక్రీకరణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వక్రీకరణల వెనుక వారి ఉద్దేశం ఏమిటో ప్రజలందరికీ తెలుసని.. మంచి మాటలు చెప్పి, పిల్లల భవిష్యత్తుకు నైతిక స్థైర్యాన్ని అందివ్వాల్సిన వాళ్లే ఇలాంటి వక్రీకరణలు చేస్తుండటం దారుణం అన్నారు.
*♦️స్కూళ్ల నిర్వహణపై నివేదికలు*
స్కూళ్ల నిర్వహణ అంశాలపై క్రమం తప్పకుండా అధికారులతో పాటు సచివాలయ ఉద్యోగుల నుంచి కూడా నివేదికలు తెప్పించుకోవాలని, ఈ నివేదికలను అనుసరించి ఎలాంటి అలసత్వం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. 8వ తరగతి పిల్లలకు ఇవ్వాల్సిన ట్యాబ్‌లు ప్రస్తుతం లక్షన్నరకు పైగా అందుబాటులో ఉన్నాయని అధికారులు చెప్పారు. అవసరమైనన్ని రాగానే, వాటిలో బైజూస్‌ కంటెంట్‌ను లోడ్‌ చేయాలని సీఎం చెప్పారు.
♦️8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు కలిపి మొత్తం 5,18,740 ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్నామని, ముందుగా టీచర్లకు పంపిణీ చేసి.. అందులోని కంటెంట్‌పై వారికి అవగాహన కల్పించడం మంచిదని సూచించారు. బైజూస్‌ కంటెంట్‌ను ప్రభుత్వ పాఠశాలల్లో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అందిస్తామని.. అందువల్ల ట్యాబ్‌లు పొందిన 8వ తరగతి విద్యార్థులే కాకుండా మిగతా తరగతుల్లోని విద్యార్థులందరికీ ఈ కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకు వస్తున్నామని అధికారులు వివరించారు.
ఆ విద్యార్థులు తమ ఇంట్లో ఉన్న సొంత ఫోన్లలో ఈ కంటెంట్‌ను డౌన్లోడ్‌ చేసుకొనేలా అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ‘బైజూస్‌ కంటెంట్‌లోని అంశాలను పాఠ్య పుస్తకాల్లో కూడా పొందు పరచాలి. డిజిటల్‌ పద్ధతుల్లోనే కాకుండా హార్డ్‌ కాపీల రూపంలో కూడా ఈ కంటెంట్‌ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. మార్కెట్లో వేల రూపాయలు ఖర్చయ్యే కంటెంట్‌ను విద్యార్థులకు ఉచితంగా అందిసున్నాం. దీన్ని డౌన్లోడ్‌ చేసుకొని అధ్యయనం చేయడం ద్వారా పిల్లలకు ఎంతో మేలు జరుగుతుంది’ అని సీఎం అన్నారు.
*♦️’విద్యాకానుక’లో ఏ లోటూ ఉండకూడదు*
‘నాడు – నేడుకు సంబంధించి ఆడిట్‌లో గుర్తించిన అంశాలన్నింపై కూడా దృష్టి పెట్టాలి. ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే చర్యలు తీసుకునే విధానాన్ని అమలు చేయాలి.
నాడు-నేడు కింద తొలి దశలో పనులు పూర్తి అయిన చోట్ల తరగతి గదులను డిజిటలైజేషన్‌ చేస్తున్నందున ప్రతి స్కూల్లో కూడా జనవరి, ఫిబ్రవరి నాటికి ఇంటర్నెట్‌ సౌకర్యం ఏర్పాటు చేయాలి. జగనన్న విద్యా కానుకకు సంబంధించి మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవాలి.
♦️పిల్లలకు ఇచ్చే యూనిఫారం క్లాత్‌ సైజును అవసరమైన మేరకు పెంచండి. ప్రస్తుతం జతకు ఇస్తున్న కుట్టు కూలి రూ.40ని ఇకపై రూ.50కి పెంచుతున్నాం. స్కూలు బ్యాగు విషయంలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలి. వచ్చే ఏడాది నుంచి 1-6 తరగతుల వరకు మీడియం సైజు, 6-10 తరగతుల వారికి పెద్ద బ్యాగు ఇవ్వాలి. షూ సైజులు ఇప్పుడే తీసుకుని, ఆ మేరకు వాటిని నిర్ణీత సమయంలోగా తెప్పించాలి. ఎట్టిపరిస్థితిలో స్కూళ్లు తెరిచే నాటికే విద్యాకానుకను అందించాలి. పీపీ-1, 2 పూర్తి చేసుకున్న అంగన్‌వాడీ పిల్లలను తప్పకుండా స్కూళ్లలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలి’ అని సీఎం అధికారులకు సూచించారు.
*♦️నాణ్యత పరిశీలనకు థర్డ్‌ పార్టీగా కేంద్ర ప్రభుత్వ సంస్థ*
స్కూళ్ల నిర్వహణ మరింత మెరుగవ్వడం కోసం మండల విద్యా శాఖ అధికారితో పాటు మరో అధికారిని పెడుతున్నామని, దీని వల్ల పర్యవేక్షణ మెరుగై మంచి ఫలితాలు వస్తాయని సీఎం తెలిపారు. సెర్ఫ్‌లో పనిచేస్తున్న (ఏపీఎం) అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్లను నాన్‌ అకడమిక్‌ వ్యవహారాలను పర్యవేక్షించడానికి నియమిస్తున్నామని అధికారులు వివరించారు. అక్టోబర్‌ 17 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు. ‘జగనన్న గోరుముద్దకు సంబంధించి నేరుగా స్కూళ్లకే సార్టెక్స్‌ బియ్యం పంపిణీ చేయాలి.
*♦️కోడిగుడ్లు పాడవకుండా ఉండేందుకు అనుసరించదగ్గ విధానాలపై దృష్టి పెట్టాలి.* మధ్యాహ్న భోజనం నాణ్యతను కచ్చితంగా పాటించాలి. ఇందుకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయాల్సిన నంబర్‌ 14417 నంబర్‌ను అన్ని స్కూళ్లలో అందరికీ కనిపించేలా ప్రదర్శించాలి’ అని సీఎం ఆదేశించారు. నాడు-నేడు పనుల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ రూ.1,120 కోట్లు విడుదల అయ్యాయని, పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు తెలిపారు.
♦️వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యాకానుక టెండర్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని వివరించారు. ఏప్రిల్‌ నాటికే కిట్లను సిద్ధం చేయనున్నామని, నాణ్యతను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థను థర్డ్‌ పార్టీగా పెడుతున్నట్టు సీఎంకు నివేదించారు.
ఈ సమీక్షలో సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యా శాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ ఎం వి శేషగిరిబాబు, స్టేట్‌ అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ (ఎస్‌ఎస్‌ఏ) బి శ్రీనివాసులు, విద్యా శాఖ సలహాదారు ఏ మురళి, నాడు-నేడు కార్యక్రమం డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌ మనోహరరెడ్డి, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ (ఎస్‌సీఈఆర్‌టి) బి ప్రతాప్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️గవర్నమెంట్ కోటా ఇంజనీరింగ్ సీట్లకు ఫీజు ఖరారు✍️📚*
*🌻అమరావతి, ఆంధ్రప్రభ:* రాష్ట్రంలోని ప్రయివేట్ యూనివర్శిటీల్లో గవర్న మెంట్ కోటా ప్రకారం భర్తీ చేసే 35 శాతం సీట్లకు ఏడాదికి రూ.50 వేలు చొప్పున ఫీజును రాష్ట్ర ఉన్నత విద్యాశాఖనిర్ణయిం చింది. ఈమేరకు గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. 2022-23,2023-24 సంవత్సరాలకు గాను ఈ ఫీజుల వర్తింపు ఉంటుంది. హాస్టల్, మెస్ ఛార్జీలు, అడ్మిషన్ ఫీజు, రిఫండబుల్ డిపాజిట్స్ ఆఫ్ లైబ్రరీ, లేబరేటోరీ ఫీజులు మినహా అన్ని రకాల ఫీజులు ఈ 50 వేల ఫీజు పరిధి లోనే ఉంటాయి. ఈ రెండేళ్లలో చేరిన విద్యార్థులకు వారి ఇంజనీరింగ్ కోర్సు పూర్త య్యేంతవరకు ఇదే ఫీజు కొనసాగుతుంది. 35 శాతం గవర్నమెంట్ కోటా సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కన్నా ఎక్కువ ఫీజును ఏ రూపంలో తీసు కున్నా తాము తీసుకునే చర్యలకు బాధ్యులవుతారని ఉత్తర్వుల్లో హెచ్చరించారు. 
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️ఉత్తుత్తి పదోన్నతులు✍️📚*
*♦️ఖాళీలు చూపించని విద్యాశాఖ*
*♦️హతాశులవుతున్న ఉపాధ్యాయులు* 
*♦️హెచ్ఎంల పదోన్నతికి 17 మంది విముఖం*
 *🌻విశాఖపట్నం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి):*
పాఠశాల విద్యా శాఖ నిర్వహిస్తున్న పదోన్నతులలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఖాళీలు చూపించకుండా ప్రక్రియ చేపట్టడంపై ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పాఠశాల విద్యాశాఖలో తొలిసారిగా ఈ విధానానికి ఉన్నతాధికారులు తెరతీశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఆంగ్లం, తెలుగు, హిందీ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు పదోన్నతులు కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి బుధవారం నిర్వహించిన కౌన్సెలింగ్‌లో తొమ్మిది ఖాళీలను భర్తీచేశారు. ఈ కౌన్సెలింగ్‌కు సీనియారిటీ జాబితాలో వున్న 17 మంది పదోన్నతులను తిరస్కరించారు. ఉమ్మడి జిల్లాలో 106 ఆంగ్లం స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతులకు నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఎనిమిది మంది పదోన్నతిని వదులుకున్నారు. హిందీ స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతులు గురువారం నిర్వహించగా, శుక్రవారం తెలుగు స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతి కౌన్సెలింగ్‌ చేపడతారు.
*♦️ఖాళీలు చూపించకుండానే…*
సాధారణంగా కౌన్సెలింగ్‌ నిర్వహించే ముందు ఖాళీలు చూపిస్తారు. దీంతో సీనియారిటీ, రిజర్వేషన్‌ మేరకు ఎక్కడ పోస్టు వస్తుందో ఉపాధ్యాయులు కొంతవరకు అంచనాకు వస్తారు. అప్పటివరకు పనిచేసే చోటుకు దూరంగా వస్తే.. పదోన్నతిని తిరస్కరిస్తారు. అయితే ప్రస్తుతం పదోన్నతి మాత్రమే ఇస్తున్నారు తప్ప ఎక్కడ పోస్టింగ్‌ అనేది చూపడం లేదు. తాజాగా పదోన్నతి పొందిన వారంతా ప్రస్తుతం వున్న పోస్టులోనే కొనసాగుతున్నారు. తాజా నిబంధనల మేరకు ప్రస్తుతం పదోన్నతి పొందినా…త్వరలో జరగనున్న బదిలీల కౌన్సెలింగ్‌లో పోస్టు అలాట్‌మెంట్‌ జరిగిన తేదీ నుంచి సీనియారిటీ ఖరారు చేస్తారు.
*♦️గత పదోన్నతులకే దిక్కులేదు*
2020 డిసెంబరులో ప్రధానోపాధ్యాయులు, స్కూలు అసిస్టెంట్‌లకు జరిగిన కౌన్సెలింగ్‌లో అడ్‌హాక్‌ పదోన్నతులు కల్పించిన విద్యాశాఖ ఇప్పటివరకు వారి ప్లేస్‌లను ఖరారు చేయలేదు. తరువాత జరిగిన బదిలీల కౌన్సెలింగ్‌లో ప్లేస్‌లు ఖరారు చేస్తామని చెప్పినా ఇంతవరకు అమలు చేయలేదు. ఈ పర్యాయం ఖాళీలు చూపించకుండానే పదోన్నతులు కల్పిస్తున్నారు. దీంతో పలువురు టీచర్లు ఎందుకొచ్చిన తలనొప్పి అని తప్పించుకుంటున్నారు. ప్రస్తుతం పదోన్నతి తీసుకోకపోతే ఏడాది వరకు అర్హత లేదని ప్రభుత్వం మెలిక పెట్టడంతో మరికొందరు ఇష్టం లేకపోయినా కౌన్సెలింగ్‌కు హాజరవుతున్నారు. తాజా నిబంధనలపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. పదోన్నతి విషయంలో టీచర్లకు వెసులుబాటు ఇవ్వాలని, మెడపై కత్తిపెట్టే విధానమేమిటని ప్రశ్నిస్తున్నాయి. విద్యాశాఖలో పదోన్నతి ప్రక్రియ ఒక భాగమే అయినా కొందరు ఉన్నతాధికారులు అవగాహన లేకుండా రోజుకో ఉత్తర్వుతో గందరగోళానికి తెరతీస్తున్నారని ఆరోపిస్తున్నారు. బోధన, పాఠశాలల నిర్వహణపై దృష్టిసారించకుండా ఇప్పటికే యాప్‌లతో అవరోధం కల్పిస్తున్న ఉన్నతాధికారులు, పదోన్నతుల విషయంలో వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకోవడాన్ని తప్పుబడుతున్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️టీచర్ల పదోన్నతుల్లో*
 *గందరగోళం📚✍️*
*♦️ఎస్ఏలుగా 51 మంది ఎస్జీటీలు*
 *♦️బదిలీ స్థానాలు కేటాయించని వైనం ఉన్నచోటే కొనసాగింపు..*
 *♦️అయోమయంలో టీచర్లు*
🔺ఉపాధ్యాయుల పదోన్నతుల్లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. పదోన్నతులు పొందుతున్న ఉపాధ్యాయులకు స్థానాలను కేటాయించకుండా కౌన్సెలింగ్‌ నిర్వహించారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్లు స్కూల్‌ అసిస్టెంట్లు మారినా ఎక్కడ పనిచేస్తున్న వారు అక్కడే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వ విధానాలపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరిగే సాధారణ బదిలీల్లో ఏర్పడే ఖాళీల ద్వారా పదోన్నతులు పొందిన వారికి స్థానాలు కేటాయింపులు ఉంటాయని ఉపాధ్యాయ వర్గాలు చెబుతుండటం విశేషం.
*🌻నెల్లూరు (విద్య), అక్టోబరు 13 :* జాతీయ విద్యావిధానం అమల్లో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ప్రాఽథమిక స్థాయిలో విద్యార్థులకు కూడా సబ్జెక్ట్‌ టీచర్లు బోధిస్తే మేలు జరుగుతుందని భావించి ఉన్నత పాఠశాలలు, యూపీ స్కూళ్లకు కొత్త స్టాఫ్‌ ఫ్యాట్రనను ప్రకటించింది. దీనికోసంగా ఉపాధ్యాయుల పునర్విభజన చేపట్టింది. ఈ క్రమంలో ఉన్నత పాఠశాలల్లో కొత్తగా గ్రేడ్‌-2 హెచఎంలు, స్కూల్‌ అసిస్టెంట్‌ సబ్జెక్ట్‌ టీచర్ల పోస్టులను ప్రతిపాదించింది. ఈ మేరకు పదోన్నతుల ద్వారా ఖాళీలను భర్తీ చేసేందుకు సీనియారిటీ జాబితాను ప్రకటించి కౌన్సెలింగ్‌ చేపట్టారు. పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలో అర్హత కలిగిన సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. ప్రభుత్వ యాజమాన్యంలో స్కూల్‌ అసిస్టెంట్‌ ఉర్దూకు ఒకరు, ఇంగ్లీ్‌షకు ఒకరి పదోన్నతి కల్పించారు. జడ్పీ యాజమాన్యంలో స్కూల్‌ అసిస్టెంట్‌ సంస్కృతం ఒకరు, ఉర్దూకు 10 మంది, ఇంగ్లీ్‌షకు 38 మందికి పదోన్నతులు కల్పించారు. మొత్తం రెండు యాజమాన్యాల్లో 51 మంది ఎస్‌జీటీలకు ఎస్‌ఏలుగా పదోన్నతులు కల్పించారు. అయితే, ఏ పాఠశాలల్లో విధులు నిర్వహించాలన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతానికి వారు పనిచేసే పాఠశాలల్లోనే విధులు నిర్వహించాలని, కొత్త మార్గదర్శకాలు వచ్చిన వెంటనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని విద్యా శాఖ అధికారులు చెప్పడం గమనార్హం.
*♦️మార్గదర్శకాలపై అయోమయం*
ఉపాధ్యాయుల పదోన్నతులకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) రెండు సబ్జెక్ట్‌లలో స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) పోస్టుకు అర్హత ఉంది. ఇప్పటి వరకు రెండు సబ్జెక్ట్‌లకు అర్హత ఉన్న వారు ఏదో ఒకటి కోరుకుంటే ఆ పోస్టుకు పదోన్నతి కల్పించేవారు. కానీ ప్రస్తుతం ఒక పోస్టుకు ప్రమోషన తిరస్కరిస్తే రెండో సబ్జెక్ట్‌ కోసం ఏడాదిపాటు ఎదురు చూడాల్సిందే. ఎవరైనా పదోన్నతి పొంది ఆ స్థానంలో చేరకపోతే వారికి ఏడాదిపాటు మధ్యలో పదోన్నతులు ఇవ్వకూడదని కొత్త ఆంక్షలు పెట్టారు. మరోవైపు ఎయిడెడ్‌ టీచర్లు ప్రభుత్వ పాఠశాలల్లో విలీనమైన తేదీ నుంచే వారి సీనియారిటీని పరిగణించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అడహాక్‌ పదోన్నతులను కూడా వారు వ్యతిరేకిస్తున్నారు. ముందుగా ఖాళీలను ప్రకటించకుండా పదోన్నతులు కల్పించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. త్వరలో జరిగే సాధారణ బదిలీల్లో ప్రభుత్వం ఎన్ని మెలికలు పెడుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
*♦️విధుల నుంచి టీచరు తొలగింపు*
కొండాపురం మండలం తూర్పు బ్రాహ్మణపల్లిలో పనిచేసే ఎస్‌జీటీ వేణుగోపాల్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు డీఈవో రమేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడం, మద్యం సేవించి పాఠశాలకు హాజరు కావడం తదితర కారణాలతో ఆయనపై ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. కొండాపురం ఎంఈఓ చేపట్టిన విచారణలో వాస్తవాలని నిర్ధారణ కావడంతో సదరు టీచరును విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️శాఖాధిపతుల కార్యాలయాల్లో ముఖ ఆధారిత గుర్తింపు హాజరు✍️📚*
*🌻ఈనాడు, అమరావతి*: ముఖఆధారిత గుర్తింపు హాజరు విధానాన్ని అన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంతోపాటు సీఎంన అమలు చేస్తారు. సంబంధిత యాప్ను అక్టోబరు 25 నుంచి అందుబాటులో ఉంచుతారు. 31వ తేదీ వరకు ట్రయల్ రన్ నిర్వ హిస్తారు. నవంబరు 1 నుంచి అమల్లోకి వస్తుం దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్త ర్వులు జారీ చేశారు. హాజరును ఎడిట్ చేయడం, సెలవుల మంజూరు, ఆలస్యంగా రావడం తదితర అంశాలన్నీ సంబంధిత ప్రభుత్వ కార్యదర్శి నియం త్రణలో ఉంటాయన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️హెచ్ ఓ డీ లకూ ఫేస్*
 *రికగ్నిషన్✍️📚*
*🌻అమరావతి, ఆంధ్రప్రభ:* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి శాఖాధిపతుల ఆఫీసుల్లో ఫేస్ యాప్ హాజరు (ముఖ ఆధారిత హాజరు) అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 25 నుంచి ఈ యాప్ను వినియోగించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ హెడ్ ఆఫ్ ద డిపార్ట్ మెంట్స్ (శాఖాధిపతులకు) కూ ఫేస్ రికగ్నిషన్ తో అటెండెన్సును తప్పని సరి చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ సాధారణ ఉద్యోగులకు మాత్రమే ఫేస్ రికగ్నిషన్ అటెండెన్సు ఉండేది. శాఖాధిపతులకు ఈ పద్దతి ఉండేది కాదు. వారు మొత్తం ఉద్యోగులకు ఇన్ చార్జిలుగా వ్యవహరిస్తారు కాబట్టి వారి బాధ్యతను వేరెవరూ గుర్తు చేయాల్సిన అవసరం ఉండదని ఇంత కాలం ప్రభుత్వాధినేతలు భావించారు. అయితే ప్రభుత్వం గురువారం జీవో ఎంఎస్ నెం 122 జారీ చేసి వారికి కూడా ఫేస్ రికగ్నిషన్ అటెండెన్సును తప్పని సరి చేసింది. శాఖాధిపతులు హెడ్ క్వార్టర్స్ ను దాటి బయటకు వెళ్లినా, సెలవు పెట్టినా లేదా శిక్షణా కార్యక్రమాలకు వెళ్లినా సంబంధిత కార్యదర్శి ఆ శాఖకు ఇన్ చార్జి బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ నెల 25 నుంచి 31 వరకూ ట్రైల్ రన్ ఉంటుంది. దీనికి సంబంధించిన యాప్ ను కూడా ప్రత్యేకంగా అభివృద్ధి పరిచారు. ఉద్యోగులంతా ఉదయం 10 గంటలకల్లా కార్యాలయాల్లో ఉండాలి. వారికి పది నిమిషాల పాటు గ్రేస్ పిరియడ్ ను నిర్దేశించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️విద్యపై కూడా*
 *రాజకీయాలా?✍️📚*
*♦️ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం* 
*♦️విద్యార్థులకుపంపిణీకి సిద్ధంగా ట్యాబ్లు* 
*♦️విద్యాశాఖపై సమీక్షలో సీఎం జగన్*
*🌻అమరావతి, ఆంధ్రప్రభ* : విద్యా సంబంధ నిర్ణయాలపై కూడా కొన్ని పత్రికలు, ఛానళ్లు
రాజకీయం చేయడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నతాధికారులతో పాఠశాల విద్యాశాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎంతమేరకు అమల్లోకి వచ్చాయని సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు తాము తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఎనిమిదో తరగతి విద్యార్థులకు, టీచర్లకు కలిపి ఐదు లక్షలకు పైగా ట్యాప్లను అందజేయబోతున్నామని చెప్పారు. ఇప్పటికే లక్షన్నర ట్యాబులు అందుబాటులో ఉన్నాయని, మిగిలినవి కూడా వస్తునాయని చెప్పారు. తరగతి గదులను డిజిటలైజేషన్ చేస్తున్నందున ప్రతి స్కూల్లో కూడా ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్న సీఎం ఆదేశించారు. జనవరి ఫిబ్రవరి నాటికి ప్రతి స్కూల్లో కూడా ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు అవుతుందని అధికారులు తెలిపారు.
*♦️జగనన్న గోరుముద్ద పథకంపైనా సీఎం సమీక్ష*
నేరుగా స్కూళ్లకే సార్టెక్స్ బియ్యం పంపిణీ, కోడిగుడ్లు పాడవకుండా ఉండేందుకు అనుస రించదగ్గ విధానాలపైనా అధికారులతో సిఎం చర్చించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను కచ్చితంగా పాటించాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎంవి శేషగిరిబాబు, స్టేట్ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ (ఎస్ఎస్ఏ) బి శ్రీనివాసులు, విద్యాశాఖ సలహాదారు ఏ మురళీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️బైజూస్.. భారం✍️📚*
*♦️ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల చేతిలో ఇక స్మార్ట్ ఫోన్లు*
*♦️జిల్లాలో తల్లిదండ్రులపై రూ. 100 కోట్లు ఆర్థిక భారం* 
*♦️విమర్శలకు దారి తీస్తున్న ప్రభుత్వ నిర్ణయం*
*🌻భీమవరం-ఆంధ్రజ్యోతి)*
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రు లపై భారం మోపుతోంది. బైజూస్‌ పాఠాలు చెప్పేకేందుకుని పాఠశాలలకు స్మార్ట్‌ ఫోన్‌లు తెచ్చుకోవాలన్న నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రభుత్వం బైజూస్‌తో చేసుకున్న ఒప్పందమే విమర్శలకు దారితీసింది. కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తోందంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. అయినా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. తీరా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల విద్యా ర్థులు స్మార్ట్‌ ఫోన్‌లు తెచ్చుకునేలా నిర్ణయం తీసుకోవడంతో తల్లిదండ్రుల్లో గుబులు మొదలైంది.
ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులే చదువుతుంటారు. నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు బైజూస్‌ క్లాస్‌లు నిర్వహించనున్నారు. వాటిని వినాలంటే ప్రతి విద్యార్థికి స్మార్ట్‌ ఫోన్‌ ఉండాల్సిందే. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ స్మార్ట్‌ ఫోన్‌ ఉంటోంది. అయితే కొందరు ఇళ్లల్లో ఇప్పటికీ సాధారణ ఫోన్‌లే వాడుతున్నారు. అటువంటి వారికి ప్రభుత్వ నిర్ణయం ఇబ్బందిగా మారుతుంది. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్నాసరే ఇంటి అవసరాలకు వినియోగించు కుంటున్నారు. విద్యార్థులకు ప్రత్యేకంగా ఫోన్‌ కొనుగోలు చేయాలి. కనీస నాణ్యమైన ఫోన్‌ కొనుగోలు చేయాలంటే రూ.12 వేల వరకు పెట్టుబడి చేయాలి. విద్యార్థుల తల్లిదండ్రులకు ఇది భారం కానుంది. జిల్లాలో 1,322 ప్రాథమిక, ఉన్నత పాఠశాలలున్నాయి. సుమారు 1,22,726 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో దాదాపు 85 వేల మంది విద్యార్థులు నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివేవారే ఉన్నారు. వారంతా ఇప్పుడు కొత్తగా ఫోన్‌లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అందుకోసం జిల్లాలో విద్యార్థుల తల్లిదండ్రులు సుమారు రూ.100 కోట్ల మేర పెట్టుబడి చేయాలి. ఇది తలకు మించిన భారంగా మారనుంది. ఇదే ఇప్పుడు తల్లిదండ్రుల్లో ఆందోళనకు గురిచేస్తోంది.
వాస్తవానికి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టిన తర్వాత కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ప్రైవేటు పాఠశాలల వైపే విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. పాఠశాలల విలీనం తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గింది. ప్రైవేటు పాఠశాలల్లో పెరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో బైజూస్‌ తరగతులు నిర్వహించినంత మాత్రాన ఫలితం ఉండదన్న భావన వ్యక్తమవుతోంది. అదే ప్రతి తరగతి గదికి స్మార్‌ టీవీ ఏర్పాటు చేస్తే బైజూస్‌ తరగతులను విద్యార్థులంతా వినేందుకు ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరూ ఫోన్‌ తీసుకురావాలంటూ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడమే విమర్శలకు దారి తీస్తోంది.
*♦️ఉపాధ్యాయుల పనేమిటో…?*
బైజూస్‌లో ప్రధానంగా గణితం, రాసాయన శాస్త్రం, జీవ శాస్త్రం, భౌతిక శాస్ర్తాలను బోధిస్తుంటారు. వాటిని తరగతుల్లో ఆన్‌లైన్‌ పద్ధతి ద్వారా బోధన నిర్వహిస్తే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏమి చేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే కొరత గా ఉన్న ఉపాధ్యాయుల భర్తీపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉన్నవారిని హేతుబద్ధీకరణ పేరుతో సర్దుబాటు చేస్తోంది. విలీన ప్రక్రియలో మిగులు ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు తరలించే ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తంపైన ఉపాధ్యాయ పోస్టులు భర్తీ లేకుండా కేవలం బైజూస్‌ సంస్థ బోధనకు మొగ్గు చూపుతోంది. తెలుగుదేశం హయాంలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ఐఐటీ ఫౌండేషన్‌ కోర్సులను నిర్వహించారు. కొందరు ఉపాధ్యాయులను కాంట్రాక్ట్‌ పద్ధతిన నియమించారు. ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులను అందుకు ఉపయోగించుకున్నారు. ఐఐటీ ఫౌండేషన్‌ కోర్సు కోసం ప్రత్యేకంగా సిలబస్‌ను ఏర్పాటు చేశారు. పుస్తకాలను ముద్రించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఐటీ ఫౌండేషన్‌ కోర్సును నిలిపివేసింది. బైజూస్‌తో ఒప్పందం చేసుకుంది. దానికోసం స్మార్ట్‌ ఫోన్‌లు వినియోగించేలా చర్యలు తీసుకుటోంది. అంతిమంగా తల్లిదండ్రులపై భారం మోపుతోంది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️చురుగ్గా*
 *ఉద్యోగోన్నతుల ప్రక్రియ✍️📚*
*🌻మచిలీపట్నం(గొడుగుపేట), న్యూ స్టుడే:* ఉమ్మడి జిల్లాలో నిర్వహిస్తున్న పదోన్నతుల ప్రక్రియలో భాగంగా గురువారం స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు సంబంధించి ఇంగ్లీషు సబ్జెక్టు ఉపాధ్యాయులు అభి. ప్రాయాలను తెలుసుకున్నారు. 181. మందికి ఉద్యోగోన్నతులు కల్పిస్తుం డగా ఇంగ్లీషు సబ్జెక్టులోనే ఎక్కువగా 136 మంది ఉన్నారు. దీంతో ఈ పోస్టులకు సంబంధించి జిల్లా నలు మూలల నుంచి 200 మందికి పైగా ఉపాధ్యాయులు వచ్చి వారి అభిప్రా యాలను వెల్లడించారు. వారితోపాటు కుటుంబ సభ్యులు కూడా రావడంతో డీఈవో కార్యాలయం ఉపాధ్యాయులతో కోలాహలంగా కనిపించింది.ఆయా పోస్టులకు సంబంధించి నివేదిక తయారు చేసి కమిషనరేట్కు పంపించామని అధికారులు తెలిపారు. అక్కడ నుంచి ఆన్లైన్లో ఉత్తర్వులు వెలువడతాయన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️పాఠ్యపుస్తకాల్లో బైజూస్*
 *ఈ కంటెంట్✍️📚*
*♦️పాఠశాల విద్యపై సమీక్షలో సీఎం జగన్*
*🌻ఈనాడు, అమరావతి:*
బైజూస్ ఈ కంటెంట్ను పాఠ్యపుస్తకాల్లో పొందుపరచాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. డిజిటల్ పద్దతుల్లోనే కాకుండా హార్డ్ కాపీల రూపంలోనూ ఈకంటెంటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో గురువారం పాఠ శాల విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ‘తరగతి గదులను డిజిటలైజేషన్ చేస్తున్నందున ప్రతి పాఠశాలలో ఇంటర్ నెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. నేరుగా పాఠశాలలకే సార్టెక్స్ బియ్యం పంపిణీ చేయాలి. కోడిగుడ్లు చెడి పోకుండా చర్యలు తీసుకోవాలి. మధ్యాహ్న భోజ నంలో నాణ్యతను కచ్చితంగా పాటించాలి. విద్య. వ్యవసాయం, ఆరోగ్య రంగాలకు అత్యంత ప్రాదాన్యం ఇస్తున్నాం. ఈ మూడేళ్లల్లో ఎన్నడూ లేని విధంగా నిధులను వ్యయం చేశాం. ఇంత చేస్తున్నా.. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో రాజకీ యాలు చాలా అన్యాయంగా నడుస్తున్నాయి.. ఇలాంటి వాటిని ఎదుర్కొంటూ లక్ష్యాలవైపు ఆడు. గులు వేయాలి’ అని వెల్లడించారు. ‘విద్యా సంబం దిత కార్యక్రమాలు, విద్యార్థులకు మంచి చేసే నిర్ణ యాలను రాజకీయాల్లోకి లాగడం అత్యంత దుర దృష్టకరం. ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం చదవలేక మానేస్తున్నారన్నట్లుగా వక్రీకరణలు చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. పిల్లలకు విద్యా కానుక కింద ఇచ్చే ఏకరూప వస్త్రాల పరిమాణాన్ని పెంచేందుకు సీఎం అంగీకారం తెలిపారు. ఒక్కో జత కుట్టు కూలీ రూ.10 పెంచారు. ప్రస్తుతం జతకు రూ.40 ఇస్తుండగా.. దీన్ని రూ.50కి
పెంచుతున్నట్లు వెల్లడించారు.
 *♦️ఫిబ్రవరి నాటికి ఇంటర్ నెట్ సౌకర్యం:*
 వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నాటికి ప్రతి పాఠ శాలలోనూ ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేస్తా మని సీఎంకు పాఠశాల విద్యాశాఖ అధికారులు. తెలిపారు. “నాడు – నేడు” పనుల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ. 1120 కోట్లు విడుదలయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరిచే నాటికి విద్యా కానుకను అందిం చేలా టెండర్ల ప్రక్రియ ప్రారంభించాం. ఏప్రిల్ నాటికే విద్యా కానుక కిట్లను సిద్ధం చేస్తాం. నాణ్య తను పరిశీలించేందుకు కేంద్ర సంస్థను థర్డ్ పార్టీగా పెడుతున్నాం. ఎనిమిదో తరగతి పిల్లలకు ఇచ్చేం దుకు ప్రస్తుతం లక్షన్నరకు పైగా ట్యాబ్లు వచ్చాయి. మిగిలినవి త్వరలో వస్తాయి. విద్యా, ర్థులు, ఉపాధ్యాయులకు కలిపి 5,18,740 ట్యాబ్ లను అందించనున్నాం. ముందుగా టీచర్లకు పంపిణీ చేసి, వాటిల్లో కంటెంట్పై వారికి అవగా “హన కల్పిస్తాం. బైజూస్ ఈ కంటెంట్ను 4 నుంచి పదో తరగతి వరకు అందిస్తున్నాం’ అని సీఎం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!