TODAY EDUCATION/TEACHERS NEWS 12/10/2022
*🌻గుంటూరు(విద్య), అక్టోబరు 11:* ఉపాధ్యాయుల పదోన్నతుల, బదిలీ కౌన్సెలింగ్ మంగళవారం ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలోని 42 మంది స్కూల్ అసిస్టెంట్స్‌కు హెచ్‌ఎంలుగా పదోన్నతి ఇచ్చేందుకు కౌన్సెలింగ్‌కు పిలిచారు. అయితే ఇందులో 12 మంది పదోన్నతులకు నిరాకరించారు. ముగ్గురు ఎస్‌ఎస్‌ఏలో పనిచేస్తున్నారు. మరో 39మందికి కౌన్సెలింగ్ ద్వారా పదోన్నతులు కల్పించారు. బదిలీ తరువాత వారికి స్థానాలు కేటాయిస్తామని అధికారులు వెల్లడించారు. పదోన్నతుల కౌన్సెలింగ్‌ను ఆర్జేడీ వీఎస్ సుబ్బారావు, డీఈవో పి.శైలజ, డిప్యూటీ డీఈో సుధాకర్ తదితరులు నిర్వహించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు పి.ప్రేమ్‌కుమార్, ఏపీటీఎఫ్ నాయకులు మేకల సుబ్బారావు, వైఎస్‌ఆర్‌టీఎఫ్ నాయకులు మేకల మీరయ్య తదితరులు పాల్గొన్నారు.
కాగా.. జిల్లాలో పదోన్నతులు ఇచ్చిన వారికి ఖాళీలు చూపకుండా వారి వద్ద నుంచి అంగీకార పత్రాలు తీసుకోవడం పట్ల యూటీఎఫ్ (పల్నాడు) అధ్యక్ష, కార్యదర్శుల పి.ప్రేమ్‌కుమార్, పార్ధసారధి అభ్యంతరం వ్యక్తం చేశారు. నూతన నియామకాలు, అంతర జిల్లాల బదిలీలకు సైతం ఖాళీలు చూపకుండా నిర్వహించాలని అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. దీనిపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.
*♦️నేటి కౌన్సెలింగ్ ఇలా..*
పదోన్నతులు, బదిలీల్లో భాగంగా బుధవారం ఉదయం 9 గంటలకు ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్(లెక్కలు, తెలుగు మీడియం) అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు డీఈవో శైలజ తెలిపారు. అదేవిధంగా ఉదయం 11 గంటలకు స్కూల్ అసిస్టెంట్(బీఎస్ తెలుగు మీడియం), స్కూల్ అసిస్టెంట్(పీడీ), మధ్యాహ్నం 2 గంటలకు స్కూల్ అసిస్టెంట్(ఆంగ్లం) ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించన్నుట్లు పేర్కొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*♦️జాబితాలో కొత్తగా పదిమంది*
*🌻ఒంగోలు (విద్య), అక్టోబరు 11:* హైస్కూళ్లలో గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయుల కౌన్సెలింగ్ కోసం అర్హులైన స్కూలు అసిస్టెంట్లు మంగళవారం స్థానిక డీఆర్ఆర్ఎం మునిసిపల్ స్కూలులో 8గంటలకుపైగా పడిగాపులు
కాశారు. హెచ్‌ఎం పదోన్నతులకు సీనియారిటీ జాబితాలోని టీచర్లు తమ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు హాజ రుకావాలని కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చి న ఆదేశాల మేరకు డీఈవో జాబితాలోని వారం దరికీ వ్యక్తిగతంగా వారి మొబైల్‌కు సమాచారా న్ని పంపారు. దీంతో జిల్లా నలుమూలల నుంచి ఉపాధ్యాయులు ఉదయం పది గంటలకు చేరుకున్నారు. అయితే సాయంత్రం వరకు వారిని ఎవ్వరూ పట్టించుకున్న పాపానపోలేదు. దీంతో టీచర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు.
*♦️39 మంది అంగీకార పత్రాలు*
హెచ్‌ఎం ఉద్యోగోన్నతుల సీనియారిటీ జాబితాలో మంగళవారం కొత్తగా పది మంది పేర్లు చేర్చారు. మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న ఐదుగురు స్కూలు అసిస్టెంట్లను 2002లో రేషన్‌లైజేషన్‌లో జడ్పీ హైస్కూళ్లలో నియమించారు. సీనియారిటీ ప్రకారం వారు హెచ్‌ఎం ప్రమోషన్‌కు అర్హులు. అయితే మొదట వారి పేర్లు సీనియారిటీ జాబితాలో చేర్చలేదు. దీంతో వారు విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలోని సర్వీసెస్ జేడీ రామలింగంతో మాట్లాడి తమ పేర్లు జాబితాలో కలపాలని కోరారు. దీంతో వారి పేర్లు కలిపారు. తుది జాబితాలోని వారి పేర్లను ఏఎస్‌వో అంజిరెడ్డి అందరికీ చదివి వినిపించారు. ఉద్యోగోన్నతికి ఆసక్తి కలిగిన 39మంది నుంచి అంగీకార పత్రాలు తీసుకొని పంపించారు. బుధ, గురువారాల్లో వీరికి స్థానాలు లేకుండా కంప్యూటర్ ద్వారా ఉద్యోగోన్నతి ఉత్తర్వులను జనరేట్ చేసి వెబ్‌సైట్‌లో పెడతారు. టీచర్లు ఆ ఉత్తర్వులను డౌన్‌లోడ్ చేసుకుంటారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*🌻ప్రజాశక్తి-అమరావతి బ్యూరో* ఉపాధ్యాయుల బదిలీల్లో గరిష్ట కాలపరిమితి
స్టాండ్) ఎనిమిదేళ్లు ఉండాలని (లాంగ్ ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఒ) నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఉపాధ్యాయ బదిలీల్లో ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్లు ఒకేచోట పనిచేసిన ఉపాధ్యాయుడు కచ్చితంగా బదిలీ కావాల్సి ఉంటుంది. అయితే పాఠశాల విద్యాశాఖ ఎనిమిదేళ్ల నిబంధనను ఐదేళ్లకు కుదించాలని నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లకు సంబంధించిన ఫైల్ను కూడా సిఎంఒకు పంపింది. ఈ ఫైల్ను సిఎంఒ తిరస్కరించింది. ఎనిమిదేళ్ల విధానంలో ప్రతిపాదనలు పంపాలని పాఠశాల విద్యాశాఖను కోరింది. దీంతో మరలా గరిష్ట కాలపరిమితి ఎనిమిదేళ్లకు మార్చి విద్యాశాఖ మంత్రి ద్వారా పాఠశాల విద్యాశాఖ సిఎంఒకు పంపేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ ఫైలు సిఎంఒ ఆమోదం తెలిపితే పాత పద్ధతిలోనే ఉపాధ్యాయ బదిలీలు జరిగే అవకాశం ఉంది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*♦️వార్డెన్ల చర్యలపై మంత్రి నాగార్జున అసహనం*
*🌻అమరావతి, ఆంధ్రప్రభ :* హాస్టళ్లలో సమస్యలు పెరిగిపోవడానికి సంబంధించిన వార్డెన్లు హాస్టళ్లలోనే ఉండకపోవడం ప్రధాన కారణమని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నాగార్జున ఆసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులు భోజనం చేస్తున్న సమయంలో వార్డెన్లు అక్కడే ఉంటే వారికి పిల్లల సమస్యలు అర్థమౌతాయని అభిప్రాయపడ్డారు. వార్డెన్లు హాస్టళ్లలోనే ఉండేలా చూడటంతో పాటుగా ప్రతి నెలా డీడీలు తప్పనిసరిగా హాస్టళ్లను సందర్శించి వాటి స్థితిగతులు ను స్వయంగా తెలుసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారులు (డీడీ)లతో రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిన్న పిల్లలు. పేద పిల్లలు ఎక్కువగా ఉండే హాస్టళ్లపై డీడీలు దృష్టిని కేంద్రీకరించాలని కోరారు. హాస్టళ్లపై పర్యవేక్షణ పెంచడం ద్వారా క్షేత్రస్థాయిలోని పరిస్థితులు తెలుసుకోవాలని సూచించారు. వార్డెన్లు ఉదయం నుంచి రాత్రి దాకా విద్యార్ధుల రాకపోకలను గమనించాలని, సమస్యలు పరిష్కరించడానికి తమ వంతుగా చర్యలు తీసుకోవాలని నాగార్జున ఆదేశించారు. విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిం చే వార్డెన్లపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. జిల్లాల వ్యాప్తంగా ఉండే ఎస్సీ హాస్టళ్లలో క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోవడానికి డిప్యుటీ డైరెక్టర్లు తప్పనిసరిగా హాస్టళ్లను సందర్శిం చాలని, వాటిలోని సమస్యలను పరిష్కరిం చడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి మేరుగు నాగార్జున ఆదేశించారు. తాను కూడా త్వరలోనే హాస్టళ్లను సందర్శించి అక్కడి పరిస్థితులు పరిశీలిస్తామని, అధికారుల నిర్లక్ష్యం కారణంగా హాస్టళ్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న ట్లు తన దృష్టికి వస్తే అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. ముఖ్యమంత్రి జగన్ ఎస్సీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి చెప్పారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలో ఉన్న 1015 ఎస్సీ హాస్టళ్లలో 500 హాస్టళ్లను నాడు-నేడు పథకం మొదటి విడతలో భాగంగా అవసరమైన మరమ్మత్తులు చేసి మెరుగులు దిద్దడం జరుగుతుందన్నారు. మూడు ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన అధికారు లు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారని తెలిపారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాల అమలు తీరును సమీక్షిస్తూ, అర్హత కలిగిన ప్రతి విద్యార్థికీ ఈ పథకాల్లో ఆర్థిక సాయం అందేలా చూడాలని కోరారు. సాంకేతిక కారణాలతో సాయం అందని వారి సమస్యలు పరిష్కరించి సాయం అందించడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.వైయస్సార్ కళ్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా పథకాలను కూడా నాగార్జున సమీక్షించి అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయలక్ష్మి, డైరెక్టర్ కే. హర్షవర్ధన్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*🌻ఈనాడు, అమరావతి*: వసతి గృహాల్లోని విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వార్డెన్లపై చర్యలు తీసుకుంటామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున హెచ్చరించారు. త్వరలోనే తాను వసతి గృహాలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తా నని చెప్పారు. వెలగపూడిలోని సచివాలయంలో మంగ ళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సమీక్షా సమావే శంలో ఆయన పలు అంశాలపై చర్చించారు. ‘వార్డెన్లు వసతి గృహాల్లో ఉండకపోవడమే సమస్యలు పెరగడా నికి ప్రధాన కారణం. ముఖ్యంగా భోజన సమయంలో వారు అక్కడే ఉంటే పిల్లల ఇబ్బందులు అర్థమవు తాయి. సాంఘిక సంక్షేమ సాధికారతా అధికారులు ప్రతి నెలా వసతి గృహాలను సందర్శించి పరిస్థితుల్ని స్వయంగా తెలుసుకోవాలి. వార్డెన్లు అక్కడే ఉండేలా చూడాలి’ అని ఆదేశించారు. రాష్ట్రంలోని 1,015 వసతి గృహాల్లో 500 చోట్ల ‘నాడు-నేడు’ మొదటి విడత కింద మరమ్మతులు చేస్తామన్నారు. వివిధ సంక్షేమ పథ కాల ప్రగతిని మంత్రి సమీక్షించారు. సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, డైరె క్టర్ హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*🌻ఈనాడు, అమరావతి:* రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లోని రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకుపెంచేందుకు ఆర్థిక శాఖ వివరాలు సేకరిస్తోంది. ఈ ఏడాది జనవరి వరకుఉన్న ఉద్యోగుల వివరాలను బుధవారం లోపు పంపించాలని ఆయా విభాగాలను కోరింది. ఆర్థిక శాఖ సహాయ కార్యదర్శి ఈ-మెయిలు ఈ సమాచారం.పంపించాలని సూచించింది. కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేసే వారికి 62 ఏళ్ల పెంపు వర్తించదని ఇటీవల ఆర్థిక ఆదేశాలు జారీ చేయడంతో దీనిపై ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వంపునరాలోచనలో పడింది. ముందుగా వివరాలను సేకరిస్తోంది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*♦️విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు*

*📚✍️వార్డెన్లు హాస్టళ్లలోనే*
*ఉండాలి✍️📚*
*♦️సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నాగార్జున*
*🌻ఈనాడు, అమరావతి*: వసతి గృహాల్లోని విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వార్డెన్లపై చర్యలు తీసుకుంటామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున హెచ్చరించారు. త్వరలోనే తాను వసతి గృహాలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తా నని చెప్పారు. వెలగపూడిలోని సచివాలయంలో మంగ ళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సమీక్షా సమావే శంలో ఆయన పలు అంశాలపై చర్చించారు. ‘వార్డెన్లు వసతి గృహాల్లో ఉండకపోవడమే సమస్యలు పెరగడా నికి ప్రధాన కారణం. ముఖ్యంగా భోజన సమయంలో వారు అక్కడే ఉంటే పిల్లల ఇబ్బందులు అర్థమవు తాయి. సాంఘిక సంక్షేమ సాధికారతా అధికారులు ప్రతి నెలా వసతి గృహాలను సందర్శించి పరిస్థితుల్ని స్వయంగా తెలుసుకోవాలి. వార్డెన్లు అక్కడే ఉండేలా చూడాలి’ అని ఆదేశించారు. రాష్ట్రంలోని 1,015 వసతి గృహాల్లో 500 చోట్ల ‘నాడు-నేడు’ మొదటి విడత కింద మరమ్మతులు చేస్తామన్నారు. వివిధ సంక్షేమ పథ కాల ప్రగతిని మంత్రి సమీక్షించారు. సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, డైరె క్టర్ హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️పదవీ విరమణ వయసు పెంపుపై వివరాలు సేకరిస్తున్న ఆర్థిక శాఖ✍️📚*
*🌻ఈనాడు, అమరావతి:* రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లోని రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకుపెంచేందుకు ఆర్థిక శాఖ వివరాలు సేకరిస్తోంది. ఈ ఏడాది జనవరి వరకుఉన్న ఉద్యోగుల వివరాలను బుధవారం లోపు పంపించాలని ఆయా విభాగాలను కోరింది. ఆర్థిక శాఖ సహాయ కార్యదర్శి ఈ-మెయిలు ఈ సమాచారం.పంపించాలని సూచించింది. కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేసే వారికి 62 ఏళ్ల పెంపు వర్తించదని ఇటీవల ఆర్థిక ఆదేశాలు జారీ చేయడంతో దీనిపై ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వంపునరాలోచనలో పడింది. ముందుగా వివరాలను సేకరిస్తోంది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*🌻దిల్లీ*: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ సదుపాయాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ కేంద్రం మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఆ ప్రకారం ఈ సౌకర్యాన్ని సెప్టెంబరు 25, 2024లోగా విని యోగించుకోవచ్చు. ఇందులో భాగంగా కేంద్రప్ర భుత్వ ఉద్యోగులు జమ్మూ-కశ్మీర్, లద్దాఫ్, అండ మాన్-నికోబార్ దీవులు, ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించవచ్చు. ఎల్టీసీ కింద అర్హత గల ఉద్యోగులు రాను-పోను టికెట్ ఛార్జీలను తిరిగి పొందుతారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*🌻విజయవాడ(అలంకార్ కూడలి), న్యూస్టుడే:* రాష్ట్ర ప్రభుత్వం 1998 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసిందని, తమకూ తగిన న్యాయం చేయాలని 1996 డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేశారు. మంగళవారం వారు విజయవాడ ధర్నాచౌక్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కొందరు డీఎస్సీ 96 అభ్యర్థులకు న్యాయం చేశారని, మిగిలిన 200 మందికీ న్యాయం చేయలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. దీపావళి పండగ నాటికైనా పోస్టింగ్లు ఇచ్చి తమ కుటుంబాల్లో సంతోషం నింపాలపి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్సీ 1996వ బ్యాచ్ అభ్యర్థుల సంఘం నాయకులు జి. గోపాల్, నంద కుమార్, దానియేల్, తిప్పస్వామి, చవిటి రాజు తదితరులు పాల్గొన్నారు. తొలుత వీరి ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. మధ్యాహ్నం 1 గంట వరకు నిరసన వ్యక్తం చేసి వెళ్లిపోవాలని పోలీసులు హుకుం జారీ చేయడంతో… అప్పటి వరకు ధర్నా చేశారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*🌻రాజవరం (గంపలగూడెం), న్యూస్టుడే*: జిల్లా పాలనాధికారి ఢిల్లీరావు ఓ పాఠశాలలో ఉపాధ్యాయుని అవతార మెత్తారు. ఐదో తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పరీక్షించారు. తాను అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా చక్కగా జవాబులు చెప్పిన విద్యార్థులను అభినందించారు. ఆయన చెప్పిన తెలుగు నెలల పేర్లు, తేలిక పదాలను నల్ల బల్లపై అక్షరదోషం లేకుండా రాసిన బాలబాలికలను కరతాళ ధ్వనులతో ప్రోత్సహించారు. గణితంపై ప్రశ్నించి సంతృప్తి చెందారు. ఇదంతా మంగళవారం మండలంలోని రాజవరం ప్రాథమిక బడిని ఆయన సందర్శించినప్పుడు జరిగింది. విద్యార్థులను పలకరించి సౌకర్యాలు, భోజనం, జేవీకే కిట్లపై ఆరా తీశారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*🌻అమరావతి, ఆంధ్రప్రభ*: ప్రభుత్వ ఉద్యోగులకు మెడికల్ రీయంబర్స్మెంట్ గడువు పొడిగించిన విధంగానే వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోగా ఈహెచ్ఎస్ కార్డులపై నెట్వర్క్ ఆస్పత్రులు పూర్తి స్థాయిలో వైద్యం అందించే విధంగా కొనసాగించాలని ఏపీజేఏసీ- అమరావతి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది… మెడికల్ రీ యింబర్స్మెంట్ కొనసాగింపు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం ఆమోదించేందుకు ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీ తరువాత వైద్యం చేసుకున్న ఉద్యోగులు బిల్లులు ప్రాసెస్ చేసుకోవాలని జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వైవీ రావు. కోరారు. మెడికల్ రీ యింబర్స్మెంట్ సాధనకు జేఏసీ చేసిన ప్రయత్నాలను వివరించారు. ఉద్యోగ సంఘాల అభ్యర్ధన మేరకు స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*🌻అమరావతి,ఆంధ్రప్రభ:* రాష్ట్రంలోని అనేక పాఠశాలలు ప్రభుత్వం చేస్తున్న రేషనలైజెషన్ వలన ఏకోపాధ్యాయ పాఠశాలలు గా మారిపోతున్నాయి అని ఇది ప్రాధమిక విద్యావ్యవస్థకు తీవ్ర నష్టం కలిగించే చర్య అని తెలుగునాడు ఉపా ధ్యాయ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి సింగల్ టీచర్ స్కూల్స్ లో ప్రభుత్వం కోరుతున్న సమాచారం ఆన్లైన్ నమోదుకు మరియు ఇతర పథకాల అమలుకు వాటి సమాచారం యాప్లలో ఇవ్వడానికి ఆ ఉపాధ్యాయునికి అధిక సమయం తీసుకొంటుందని.. పిల్లలకు ప్రాధమిక స్థాయిలోనే పునాది బాగుండాలని నాణ్యమైన విద్య అందాలి అంటే పిల్లల నమోదు తో సంబంధం లేకుండా ప్రతి పాఠశాలలో తప్పని సరిగా 2 ఎసిటి పోస్టులు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షు, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు, ఆర్ధిక కార్యదర్శి సిహెచ్. పినాకాపాణి , గౌరవాధ్యక్ష్యుడు బెంగుళూరు రమేష్ ఒక ప్రకటన లో డిమాండ్ చేసారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*♦️మెడికల్ రియంబర్స్ మెంట్ గడువు పొడిగింపు*
*🌻అమరావతి, ఆంధ్రప్రభ*: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెడికల్ రీయంబర్స్మెంట్ పథకం గడువును 2022 ఆగస్టు 1వ తేదీ నుండి 2023 మార్చి 31వరకూ పొడిగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరి ఎంటీ క్రిష్ణబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి పలు ఉద్యోగ సంఘాల నేతలు చేసిన విజ్ఞప్తుల్ని పరిశీలించిన అనంతరం మరికొంత కాలం పాటు దీన్ని పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఇహెచ్ఎస్)తో పాటు మెడికల్ రిఎంబర్స్ మెంట్ స్కీంను కూడా వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో వివరించారు. ఉద్యోగులు, పెన్షనర్ల ఇహెచ్ఎస్ పథకాన్ని సులభతరం చేసేందుకు అనువైన విధానాల్ని అందుబాటులోకి తేవాలని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సిఇఒకు సూచించారు. ఇందుకు సంబంధించి ఆరోగ్య శ్రీ సిఇవో అవసరమైన చర్యల్ని తీసుకోవడంతో పాటు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని < ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఎటువంటి సమస్యలకు గురికాకుండా ఉండేందుకు గాను తగిన యంత్రాంగాన్ని ఆరోగ్యశ్రీ సిఇవో ఏర్పాటు చేసుకోవాలని ఉత్తర్వుల్లో సూచించారు. ఆర్థిక శాఖ సమ్మతి మేరకే ఈ ఉత్తర్వుల్ని జారీ చేశామని కృష్ణ బాబు స్పష్టం చేసారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*♦️1 నుంచి 8 వరకు ఓఎంఆర్ షీట్ల ద్వారా ఫార్మటివ్ అసెస్మెంట్ పరీక్షలు*
*🌻న్యూస్టుడే, కానూరు*
నూతన విద్యా విధానంలో భాగంగా పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. వచ్చే నెలలో జరగాల్సిన ఫార్మటివ్ అసెస్మెంట్-1 పరీక్షను ఈ విధానంలో నిర్వహించనున్నారు. గతంలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా ప్రశ్నాపత్రాలు ఇచ్చి జవాబులు రాయిం చేవారు. ఈ సారి 1 నుంచి 8వ తరగతి విద్యా ర్దులకు కొత్త విధానంలో ఓఎంఆర్ షీట్లలో జవా బులు రాయాల్సి ఉంటుంది.
*♦️నూతన పరీక్ష విధానం ఇలా :* ప్రస్తుతంప్రభుత్వం ఎస్ఏఎల్ (సపోర్టింగ్ ఆంధ్రా లెర్నింగ్ ట్రైనింగ్), ఈఐ (ఎడ్యుకేషనల్ ఎసన్షి యల్స్)తో అవగాహన ఒప్పందం కుదుర్చు కుంది. ఇందులో భాగంగా ఓఎంఆర్ షీట్ల ద్వారా పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో సబ్జెక్టుకు 20 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో సబ్జె క్టులో 15 బిట్లు ఉంటాయి. మరో 5 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఏబీసీడీల్లో జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. మిగిలిన ఐదింటికి ప్రశ్నాపత్రం ఇస్తారు. వీటికి విద్యార్థులు జవా బులు రాయాల్సి ఉంటుంది. 1 నుంచి 8వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకే ఓఎంఆర్ షీటు ఉంటుంది. మొదటి రోజు పరీక్ష అనంతరం ఉపా ద్యాయుడికి షీటు ఇవ్వాలి. తరువాత రోజు జరిగే పరీక్ష అప్పుడు అతనికి మళ్లీ ఓఎంఆర్ షీటు ఇస్తారు. అప్పుడు ఈ సబ్జెక్టుకు సంబంధించిన కాలమ్లో జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. 9, 10 విద్యార్థులకు పాత పద్ధతిలోనే పరీక్షలు నిర్వహించనున్నారు.
*♦️సామర్థ్యం అంచనాకు కసరత్తు:* విద్యార్థులకు ఇప్పటికే బేస్మెంటు ఎసెస్మెంటు నిర్వహించారు. వీరికి ఓఎంఆర్ షీట్లలో పరీక్షలపై శిక్షణ ఇస్తున్నా మని అధికారులు చెబుతున్నారు. ఈ పరీక్ష అనం తరం ఓఎంఆర్ షీట్లను ఈఐకు అందజేసి స్కానర్ల ద్వారా మార్కులు కేటాయిస్తారు. వీటిని ఫార్మటివ్ అసెస్మెంటు-1 పరీక్షల మార్కులుగా నమోదు చేస్తారు. ఈ పరీక్షల అనంతరం క్లాసూం బేస్ మెంట్ ప్రోగ్రాం కింద విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేలా కసరత్తు చేస్తున్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*♦️ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 5 ఏళ్లపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం*
*🌻అమరావతి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి)*: ఉపాధ్యాయ బదిలీలపై ప్రభుత్వం మళ్లీ కీలక మార్పులు చేస్తోంది. ప్రతిసారీ టీచర్ల బదిలీలకు ఎనిమిదేళ్ల సర్వీసును ప్రామాణికంగా తీసుకుంటుండగా.. ఈసారి దానిని ఐదేళ్లకు కుదించింది. దీనిపై ఉపాధ్యాయులు, సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనా ప్రభుత్వం ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన అందరికీ బదిలీకి అవకాశం ఇస్తామని ప్రకటించింది. అయితే, దీనికి సంబంధించిన ఫైలు ఇప్పటి వరకు సీఎంవోలో పెండింగ్‌లో ఉంది. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఐదేళ్ల నిర్ణయంపై వెనక్కి తగ్గినట్లు తెలిసింది. ప్రస్తుత ఫైలు ఐదేళ్ల సర్వీసు ఆధారంగా ఉండగా దానిని ఎనిమిదేళ్లకు మార్చి తిరిగి పంపాలని ఆదేశించినట్లు సమాచారం.
ఎనిమిదేళ్ల సర్వీసును ప్రామాణికంగా తీసుకుంటే ఎక్కువ మంది మారాల్సిన అవసరం ఉండదు. అదే ఐదేళ్లు తీసుకుంటే ఇప్పుడు దాదాపు 80ు మందికి స్థానచలనం తప్పదనే అంచనా ఉంది. విద్యా సంవత్సరం మధ్యలో అంతమందిని ఒకేసారి బదిలీ చేస్తే బోధనపై ప్రభావం చూపుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కాగా, బదిలీలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం సాగదీత ధోరణి అవలంబిస్తోంది. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేస్తే ఉపాధ్యాయులకు ఇబ్బంది అవుతుందని ఇటీవల సంఘాలతో జరిగిన సమావేశంలో విద్యామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. దీంతో బదిలీలపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందనే వాదన వచ్చింది. ఇప్పుడు మళ్లీ సర్వీసును మార్చే ప్రతిపాదన ముందుకు తెచ్చింది. కొత్త ప్రతిపాదనతో ఫైలు పెట్టినా ఎప్పటికి దానికి ఆమోదముద్ర పడుతుందో స్పష్టత లేకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
You might also check these ralated posts.....