Chemistry Nobel Prize : ముగ్గురు శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి
స్టాక్‌హోం : రసాయన శాస్త్రం (Chemistry)లో నోబెల్ బహుమతి (Nobel Prize) ముగ్గురు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా లభించింది. మరింత కార్యనిర్వాహక రూపంలో రసాయన శాస్త్రానికి పునాది వేసినందుకు వీరికి ఈ బహుమతి దక్కింది. వీరు అమెరికా, డెన్మార్క్‌లకు చెందినవారు.
అమెరికన్స్ కెరోలిన్ బెర్టోజ్జి (Carolyn Bertozzi), బారీ షార్‌ప్‌లెస్ (Barry Sharpless), డెన్మార్క్‌కు చెందిన మోర్టెన్ మెల్డాల్ (Morten Meldal)లకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇస్తున్నట్లు జ్యూరీ ప్రకటించింది. క్లిక్ కెమిస్ట్రీ, బయోఆర్థోగోనల్ కెమిస్ట్రీని అభివృద్ధి చేసినందుకు వీరిని ఎంపిక చేసినట్లు తెలిపింది. రెండుసార్లు ఈ పురస్కారాన్ని పొందిన వ్యక్తుల్లో బారీ షార్‌ప్‌లెస్ ఐదోవారు కావడం విశేషం. గతంలో రెండు నోబెల్ బహుమతులు పొందినవారు…. జాన్ బార్డీన్, మేరీ స్క్లోడోవ్‌స్కా క్యూరీ, లైనస్ పౌలింగ్, ఫ్రెడరిక్ సాంగర్.
బారీ షార్‌ప్‌లెస్ (81)కు 2001లోనూ, 2022లోనూ రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ బహుమతులను ఇస్తోంది. ఈ బహుమతి విలువ $915,072.