AP NMMS 2022: NOTIFICATION, IMPORTANT DATES,APPLY ONLINE LINK

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

AP NMMS 2022: NOTIFICATION, IMPORTANT DATES,APPLY ONLINE LINK


NMMS scholarship 2022: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్

ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌(ఎన్‌ఎంఎంఎస్‌) పథకాన్ని అమలు చేస్తోంది. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకూ చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా ఉపకారవేతనాన్ని అందిస్తోంది. పరీక్షకు సంబంధించిన ప్రకటనను ఏపీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌ విభాగం తాజాగా విడుదల చేసింది.

వివరాలు:

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ 2022-23

ఏడాదికి రూ.12 వేల ఆర్థిక ప్రోత్సాహం: ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ పూర్తిచేసే వరకు ఉపకారవేతనం లభిస్తుంది.

అర్హతలు:

ఏడో తరగతిలో 55 శాతం మార్కులు పొందిన విద్యార్థులు పరీక్ష రాయడానికి అర్హులు. తుది ఎంపిక సమయం నాటికి ఎనిమిదో తరగతిలో 55శాతం మార్కులు పొంది ఉండాలి.

* ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలల్లో రెగ్యులర్‌ విధానంలో చదవుతూ ఉండాలి. 

విద్యార్థి కుటుంబ వార్షికాదాయం రూ.3,50,000 మించకూడదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా విద్యార్థులను స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు. 

రాత పరీక్ష: ఈ స్కాలర్‌షిప్స్‌కు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రాష్ట్రస్థాయిలో రెండు పేపర్ల రాత పరీక్షలు నిర్వహిస్తారు. 

దరఖాస్తు విధానం: రాష్ట్ర ప్రభుత్వ సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డు వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో విద్యార్థుల దరఖాస్తులను ఆయా స్కూళ్లు సమర్పించాలి. అనంతరం ఆ దరఖాస్తుల ప్రింటవుట్లను, ధ్రువీకరణ పత్రాలను డీఈవోలకు పంపాలి. ప్రతి విద్యార్థికి పరీక్ష ఫీజు రూ.100 ఎస్‌బీఐ చలానా రూపంలో జతచేయాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు…

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 30-09-2022.

దరఖాస్తు ఫీజు చెల్లింపు ప్రారంభం: 06-10-2022. 

పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీ: 31-10-2022.

సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ: 31-10-2022.

దరఖాస్తు ఫారాలు, ధ్రువపత్రాలను డీఈవో కార్యాలయంలో అందజేసేందుకు చివరితేది: 02-11-2022.

డీఈవో లాగిన్‌లో దరఖాస్తు ఆమోదం పొందేందుకు చివరి తేదీ: 04-11-2022. 

CLICK HERE TO DOWNLOAD FULL DETAILS

error: Content is protected !!