AP ICET 2022 COUNSELING:ఆంధ్రప్రదేశ్‌లో ఎంసీఏ, ఎంబీఏ కోర్సు్లో ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీఐసెట్-2022 కౌన్సెలింగ్ షెడ్యూలును అక్టోబరు 7న అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూలును అందుబాటులో ఉంచారు. ఐసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ తేదీలను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 9 నుంచి 22 వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.
AP ICET 2022 COUNSELING SCHEDULE RELEASED
✦ అక్టోబరు 9 నుంచి 12 వరకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
✦ రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి అక్టోబరు 10 నుంచి 14 మధ్య సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
✦ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అభ్యర్థులు అక్టోబరు 14 నుంచి 16 వరకు వెబ్ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది.
✦అభ్యర్థులు అక్టోబరు 17న వెబ్ ఆప్షన్లలో ఏమైనా మార్పులు ఉంటే సరిచేసుకోవచ్చు.
✦ అక్టోబరు 19న అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు.
✦ సీట్లు పొందినవారు అక్టోబరు 20 నుంచి 22 మధ్య సంబంధిత కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
అక్టోబరు 9 నుంచి 12 వరకు | రిజిస్ట్రేషన్ |
అక్టోబరు 10 నుంచి 14 వరకు | సర్టిఫికేట్ వెరిఫికేషన్ |
అక్టోబరు 14 నుంచి 16 వరకు | వెబ్‌ఆప్షన్లు |
అక్టోబరు 17 | వెబ్ఆప్షన్ల మార్పు |
అక్టోబరు 19 | సీట్ల కేటాయింపు |
అక్టోబరు 20 నుంచి 22 వరకు | కాలేజీలో రిపోర్టింగ్ |
AP ICET 2022 కౌన్సెలింగ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
✦ AP ICET కౌన్సెలింగ్ వెబ్‌సైట్, https://icet-sche.aptonline.in/ వెళ్లాలి.
✦ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
✦ రిజిస్ట్రేషన్ నంబర్, ఇతర వివరాలను నమోదు చేసి లాగిన్ కావాలి.
✦ అవసరమైన వివరాలను నింపాలి.
✦ బుక్ స్లాట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎంచుకోవాలి.
✦ ఎంపిక నమోదు కోసం లాగిన్ చేయాలి.
✦ సేవ్ చేసిన ఎంపిక ప్రక్రియను ప్రింట్ తీసుకుని.. లాగ్ అవుట్ చేయండి.
కౌన్సెలింగ్ వెబ్‌సైట్: CLICK HERE |
ఏపీలోని పీజీ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జూలై 25న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఏపీ ఐసెట్(AP ICET)-2022 ఫలితాలను ఆగస్టు 8న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫలితాలతోపాటు ఐసెట్ ర్యాంకు కార్డులను కూడా ఏపీ ఉన్నత విద్యా మండలి అధికారులు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో మొత్తం 87.83 శాతం మంది అర్హత సాధించారు. ఏపీ ఐసెట్-2022 పరీక్షకు మొత్తం 42,496 మంది హాజరుకాగా 37,326 మంది అర్హత సాధించారు. ఫలితాల్లో అత్యధికంగా బాలురు 87.98 శాతం పాస్ అయ్యారు. ఇక అమ్మాయిలు విషయానికొస్తే 87.68 శాతం ఉత్తీర్ణత సాధించారు.
JOIN OUR TELEGRAM GROUP-CLICK HERE