నిన్ను నువ్వు సరిదిద్దుకో….!

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
నిన్ను నువ్వు సరిదిద్దుకో….!
నేనెవరు?..నా పరిస్థితి ఏమిటి… నాకే ఎందుకు అందరితో వైరం ఏర్పడుతుంది.?……
నేనెందుకు అందరిని  గమణిస్తున్నాను.?
నాకే ఎందుకు దోషాలు కనిపిస్తుంటాయి…..
అలా కనిపిస్తాయా  లేక నాకే అనిపిస్తాయా?…
నేను ఏది మాట్లాడిన ఎదుటివారికి బాధేస్తుంది…నిజమ్ మాట్లాడినందుకా  లేక  ఎదుటివారికి నచ్చనందుకా?…లేక 
వాళ్ళు తట్టుకోలేకనా?..లేక నాదే కరెక్ట్ అనుకునే అనుకునే మనస్తత్వమా?..లేక 
ఒప్పించే ప్రయత్నమా…. మొండితనమా?…లేక అవతల వారిని తెలివితక్కువ వారిగా అనుకోవడమా?…
తెలియదు.. తెలిసి తెలియని మిడి మిడి జ్ఞానముతో మూర్ఖుడిగా  వ్యవహరించడమా?..
లేక  అన్ని తెలుసునన్న  అహంభావమా?…
లేక ప్రతివారిని ప్రేమిస్తూ వారి అంతర్యాన్ని తెలుసుకోకుండా  అందరిని మంచి వారని గుడ్డిగా నమ్మేయడమా?.. లేక
 వాళ్ళు ఏ రకంగా మాట్లాడిన… దూషించిన.. నొప్పించిన.. మోసంచేసిన…నష్టపరచిన… 
నా వెనకాల నన్ను కించపరుస్తూ…అవమానిస్తూ…అవసరాలు తీరాక నటిస్తూ.. పరోక్షంగా అగౌవ్రపరుస్తూ…నన్ను ఉపయోగించుకునే వారి చర్యల్ని ఎత్తి చూపిస్తే….
నిష్టురంగా… కఠినంగా… వారికనిపిస్తే…. అది తప్పని నిందలేసే వారికి నేను క్షమించినా.. మనసు గాయపర్చుకున్నా …నాకు దూరమైపోయే వారి గురించి ఆలోచిస్తే  నా దోషమా?..
వద్దని పారిపోతున్న వారి వెనుక నేనెందుకు పరుగెడుతున్నాను?…నన్ను కాదని వెళ్తున్నారని కోపమా?….లేక వాళ్ళ మీద ప్రేమనా?…నన్నెందుకు కాదంటరనే  అహంకారమా?…
ఆత్మభిమానామా?..లేక నాలోని షాడిజమా?..లేక నా టార్చరా?..
నిజంగా నేను వేదిస్తానా?..
నాకందరు దూరమై పోవడానికి నా వేధింపులే కారణమా?..నేనెవరికి చెడు చేయలేదే….నష్టం కలిగించలేదే.. ఎవ్వరిని చెయ్యి చాచాలేదే…. ఎవరికి  ఏ విధంగా ముంచలేదే?..అందరూ కలిసినట్లుగానే కనిపిస్తారే?..వారికి ఇష్టమైనట్లు ప్రవర్తించాలంటే వారు కూడా అలాగే ఉండాలి కదా?..
ప్రతిసారి వారికి అనుగుణంగా ఉండేట్లు ఉండి తట్టుకున్నా….ఒక్కసారి కూడా మనకి లేకపోతే?..
నిజానికి నేను సరిగ్గా ఉన్నానా?..అందరిని…అన్ని విషయాల్లో తట్టుకోవడం నా తప్పేనా?…వారి నైజాన్ని చూపించి..లోపాన్ని గ్రహించమనడం నేను చేస్తున్న నాలో వున్న లోపమా?..
ఏమో కావచ్చు.. చెడిపోతుంటే  చూడలేకపోవడం  నా బలహీనత?..అందరూ బాగుండాలి అనుకోవడం పెద్ద బలహీనతా….లేక నాలో వున్న చెడు దృష్టే చెడుని గమణిస్తుందా?…లేక అందరికి చెప్పి నేను చెడిపోతున్నానా?..లేక చిన్నదాన్ని పెద్దగ  చూస్తున్నానా?.లేక చెడు దృష్టి ఉన్నవారి మధ్య నేను తిరుగుతున్నానా?…లేక నేను మంచిని చూడలేక…గమనించ లేకపోతున్నానా?..లేక 
చెడుని మంచిదే అని ఒప్పించే ప్రయత్నంలో వుండే వారి సహావాసంతో వాటిని ఒప్పుకుంటానా?..నా ఆలోచనలు తప్పా?..లేక నా మాట తీరు తప్పా?..ఏమో కావచ్చేమోననిపిస్తుంది?..
నేను నిజమే మాట్లాడతాను…నిష్టురంగా వున్నా దాచుకోను… వారి తప్పు ఎత్తి చూపితే బాధ కల్గితే నా తప్పా?…
నిజంగా ఇప్పుడనిపిస్తుంది… అది  తప్పెనని….ఎవరి తప్పులను ఎత్తి చూపే అవసరం నాకెందుకు?..
ఎవరేట్లబోతే  నిజంగా నాకెందుకు?..
ఎవరికి నచ్చినట్లు వారు తిరిగితే నాకేంటి?..
లెక్కగట్టే అర్హత నాకెక్కడిది?…
నేనేం గురువును కాదు…
దేశోద్ధారకుని కాదు… అంతకుమించి దేవుణ్ణి గాదు……
అన్ని చూస్తున్నా ఆ దేవుడే గమ్మున్నుంటే  నేనెందుకు ఆలోచిస్తున్నాను?…
నాకు అవసరమా?..
అందరి గురించి ఆలోచించే నువ్వు సరిగ్గా ఉన్నవా?..
నీ కర్తవ్యాన్ని నీవు చేస్తున్నావా?…
నీలో వున్న లోపాన్ని నువ్వు సరిదిద్దుకో?….
నీ పని ఏమిటో..నీ ఆశయాలు  ఏమిటో…వాటి మీద ఫోకస్ చేయి చాలు… 
ఎవరు దూరంకారు…ఏది గ్రహించే సమయం చాలదు……
ఈ చిన్ని జీవితానికి ఎందుకురా ప్రపంచజ్ఞానం?…
పనిలేని మేధావులు …..పండిపోయిన  అనుభజ్ఞులు ఎవరి  అభిప్రాయాలు వాళ్ళు చెబుతారు…. 
ప్రతి మేధావి ఒక్కొక్కటి భోధిస్తాడు…
 అందరూ కలసి ఒకటే భోధిస్తే ఆచరణకు వీలువుంటుంది  గాని…
అందరిని ఫాలో అయితే ఏటో తెలియక…….ఎదో తెలియక…..తిక మకలో   ఇప్పటి జీవితంలా మారి పోతాయి….
ఇలాగే అందరి మధ్య ఈర్ష్యాద్వేషాలతో…..అనవసర చర్చలతో…….పనికిరాని మాటలతో కాలం గడిచిపోతుంది…….
నీవెవరో తెలిసేలోగా నీ ఆయుష్షు తీరిపోతుంది…..
మరి నీకేం మిగులుతుంది?……
కనీసం నిన్ను గుర్తుచేసుకోవడానికైనా నీ భార్య పిల్లలకు జ్ఞాపకాలు మిగలాలి కదా?…
మరి మిగలాలి అంటే ……నువ్వు ఏదైనా సాధించాలి కదా?..
మరి సాధించాలంటే  సంకల్పం ఉండాలి కదా?…
మరి ఆ సంకల్పానికి పట్టుదల…కృషి.. సాధన…..ఆచరణ.. అన్ని మొదలు కావాలి కదా…..
 అందుకే క్షణం ఆలస్యం చెయ్యకుండా నీ మనసుకు నచ్చినది ఏదైనా  నువ్వు చేస్తూపో….
ఈ వేదాలు… వేదంతాలు.. సూక్తులు… నీ కడుపు నింపదు……….నీకూ ముక్తినివ్వదు…
దేశాన్ని ఉద్ధరించడానికి చాలా మందే ఉన్నారు…కానీ నిన్ను ఉద్ధరించడానికి ఆ దేవుడైన దిగిరాడు..
అందుకే నిన్ను నువ్వే మార్చుకో….నిన్ను నువ్వే సరిదిద్దుకో… 
నీకూ నీవే గురువు….నీకు నీవే శత్రువు…..సర్వం నీవే…….సకలం నీవే………అహంబ్రహ్మాస్మి

error: Content is protected !!