*🌷ఉద్యోగులకు గుడ్ న్యూస్…ఈఎంఐలో ఈ-స్కూటర్లు అందించనున్న ప్రభుత్వం🌷*
*🌴రాజమహేంద్రవరం: ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందిస్తోంది.*
*🦋ఎలక్ట్రిక్ స్కూటర్(ఈ-స్కూటర్)లను వాయిదాల పద్ధతిలో అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది*
*⛱️తొలుత ప్రభుత్వ ఉద్యోగులకు వీటిని అందించనుంది.*
*🦚కొనుగోలు చేసిన ఈ-స్కూటర్లకు ఒకేసారి కాకుండా 60 నెలల పాటు వాయిదాల పద్ధతిలో (ఈఎంఐ) డబ్బులు చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తోంది.*
*🦋 గుర్తింపు పొందిన ప్రైవేటు సంస్థలో పని చేసే ఉద్యోగులు సైతం ఈ-స్కూటర్లు కొనుగోలు చేసుకోవచ్చు.*
*🌴అయితే ఆ సంస్థ నిర్వాహకుడు (మేనేజర్, సీఈఓ తదితర) సదరు ఉద్యోగి నుంచి ప్రతి నెలా ఈఎంఐ చెల్లించేందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.*
*🦋ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది.*
*🌴ఇందుకు అవసరమైన ప్రణాళికలను ఆంధ్రప్రదేశ్ నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ (నెడ్‌క్యాప్) అధికారులు సిద్ధం చేశారు.*
*⛱️ఉద్యోగులకు ప్రాధాన్యం⛱️*
*🌴విద్యుత్ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వీటిని తొలుత ప్రభుత్వోద్యోగులకు ఇస్తాం. అనంతరం నిబంధనలకు అనుగుణంగా ప్రైవేటు ఉద్యోగులకు విక్రయిస్తాం.*
*🦋ఈ వాహనాల ద్వారా వాయు, శబ్ద కాలుష్యానికి చెక్ పెట్టవచ్చు.*
*🌴త్వరలో జిల్లాకు వాహనాలు వచ్చే అవకాశం ఉంది.*
*🦋వివరాలకు నెడ్కాప్ డీఎంను 9000550972, డీఓను 99 89949144 నంబర్లలో సంప్రదించవచ్చు.*
*- జి.సత్యనారాయణ, జిల్లా మేనేజర్, నెడ్‌క్యాప్*
*⛱️10 వేలకు పైగా..⛱️*
*🌴ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే సుమారు 10 వేలకు పైగా ఈ-స్కూటర్లు, ఈ-కార్లు ఉన్నాయి.*
*🦋వీటి కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 ప్రాంతాల్లో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నెడ్‌క్యాప్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.*
*⛱️ప్రధానంగా ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేటు స్థలాల్లో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు.*
*🌴అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పని చేసే వాటిని అందుబాటులోకి తీసుకురానున్నారు.*
*🦚ఒకసారి కారుకు రీచార్జ్ చేస్తే 400 కిలోమీటర్లు ప్రయాణించే వీలుంటుంది.*
*🦋 ఇప్పటి వరకూ కారుకు 6 గంటల పాటు చార్జ్ చేయాల్సి వచ్చేది.*
*🌴 ప్రస్తుతం 45 నిమిషాల్లోనే చార్జ్ చేసే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది.*
*🦋 ఇప్పటికే రాజమహేంద్రవరంలో టాటా సంస్థ రెండు చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తెచ్చింది.*
*🌴 మిగతా వాటి ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది.*