TSPSC AE RECRUITMENT 2022 APPY 837 POSTS ONLINE

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
TSPSC AE RECRUITMENT 2022  APPY 837 POSTS ONLINE

తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్‌సీ) నుంచి మ‌రో నోటిఫికేష‌న్ వెలువడింది. వివిధ విభాగాల్లో 833 అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్  పోస్టుల భ‌ర్తీకి సెప్టెంబరు 12న నోటిఫికేషన్ వెలువడింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ/డిప్లొమా అర్హత ఉన్నవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సెప్టెంబరు 28 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 

అదనంగా మరో 4 పోస్టులు
తెలంగాణలో వివిధ ఇంజినీరింగ్ సర్వీసుల్లో 833 అసిస్టెంట్‌ అదనంగా మరో నాలుగు పోస్టులు వచ్చి చేరాయి. ఈ మేరకు  టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. భూగర్భజలశాఖ పరిధిలో డ్రిల్లింగ్ సూపర్ వైజర్ (మెకానికల్) పోస్టులను జతచేసింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 837కి చేరినట్టయింది. అర్హులైన అభ్యర్థులు అక్టోబరు 21లోగా దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ సూచించింది.

వివరాలు…

మొత్తం ఖాళీలు: 837


* అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్: 434 పోస్టులు 


విభాగాలవారీగా పోస్టుల వివరాలు..

1)  అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్):  62 పోస్టులు
     
 విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ మిషన్ భగీరథ(సివిల్)


2)  అసిస్టెంట్ ఇంజినీర్: 41 పోస్టులు

విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్.


3) అసిస్టెంట్ ఇంజినీర్: 13 పోస్టులు

విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్‌ హెల్త్.


4) మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్): 29 పోస్టులు

విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్‌ హెల్త్ .


5) టెక్నికల్ ఆఫీసర్: 09 పోస్టులు

విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్‌ హెల్త్ .

6)  అసిస్టెంట్ ఇంజినీర్: 03 పోస్టులు

విభాగం:  ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్.


7) అసిస్టెంట్ ఇంజినీర్: 227 పోస్టులు

విభాగం: ఇరిగేషన్ & కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్. 


8) అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్): 12 పోస్టులు

విభాగం: గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్.


9)  అసిస్టెంట్ ఇంజినీర్: 38 పోస్టులు

విభాగం: గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్


10) అసిస్టెంట్ ఇంజినీర్: 38 పోస్టులు

విభాగం: ట్రాన్స్‌పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్‌మెంట్.

అర్హత: అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ డిప్లొమా/బీఈ/బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.45960-రూ.124150 చెల్లిస్తారు.

* జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 399 పోస్టులు

1) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్:  27 పోస్టులు

విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ మిషన్ భగీరథ.

2) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 68 పోస్టులు

విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్

3) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 32 పోస్టులు

విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్‌ హెల్త్.

4) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 212 పోస్టులు

విభాగం: ఇరిగేషన్ & కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్. 

5) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 60 పోస్టులు

విభాగం: ట్రాన్స్‌పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్‌మెంట్.

అర్హత: జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ డిప్లొమా/ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 18-44 ఏళ్లు వయసు ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.32810-రూ.96890 చెల్లిస్తారు.

 

* డ్రిల్లింగ్ సూపర్ వైజర్ (మెకానికల్) : 4 పోస్టులు

విభాగం: గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్.

అర్హత:  డిప్లొమా (మెకానికల్ ఇంజినీరింగ్).

వయసు: 18-44 ఏళ్లు వయసు ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.45,960–రూ.1,24,150  చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు…

* సంక్షిప్త ప్రకటన: 12.09.2022.

* పూర్తినోటిఫికేషన్ వెల్లడి: 23.09.2022.

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.09.2022

* ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది: 21.10.2022.

Notification

Online Application

Website

error: Content is protected !!