తెలంగాణలో మరో ఉద్యోగ ప్రకటన వెలువడనుంది. ఈ సారి రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి టీఎస్‌పీఎస్సీ త్వరలోనే నోటిఫికేషన్ జారీచేయనుంది. డిగ్రీ లెక్చరర్ 491, సాంకేతిక విద్యలో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నియమ నిబంధనలతో కూడిన వివరాలను అధికారులు ఇటీవలే టీఎస్‌పీఎస్సీకి అందజేశారు. ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, ఆర్థిక శాఖ వేర్వేరుగా రెండు జీవోలను జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 132 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిల్లో 4,098 పోస్టులుండగా, 1,255 రెగ్యులర్,812 కాంట్రాక్ట్, 1,940 గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు.
TSPSC త్వరలో 738 లెక్చరర్ పోస్టుల భర్తీకి సన్నాహాలు!
TSPSC త్వరలో 738 లెక్చరర్ పోస్టుల భర్తీకి సన్నాహాలు!