TS SCHOOLS: దసరా సెలవుల్లో ఎలాంటి మార్పు లేదు: విద్యాశాఖ

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

TS SCHOOLS: దసరా సెలవుల్లో ఎలాంటి మార్పు లేదు: విద్యాశాఖ

హైదరాబాద్: దసరా సెలవులపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. సెలవులు తగ్గించాలన్న రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రతిపాదనను తిరస్కరించింది. సెలవుల్లో ఎలాంటి మార్పు లేదని.. సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్ 9 వరకు యథాతథంగా పాఠశాలలకు సెలవులు ఉంటాయని స్పష్టం చేసింది.. అక్టోబర్ 10న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని విద్యాశాఖ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 

భారీ వర్షాల కారణంగా జులైలో పాఠశాలలకు సెలవులు ఇచ్చినందున.. నష్టపోయిన బోధన పనిదినాల భర్తీకి దసరా సెలవులు తగ్గించాలని పాఠశాల విద్యాశాఖకు ఎస్‌సీఈఆర్‌టీ సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఆ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ తొలుత ప్రకటించిన విధంగానే దసరా సెలవులు కొనసాగుతాయని వెల్లడించింది.

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!